Others

సత్యానే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంచెం నిప్పిస్తావా?
గుండె వత్తిని వెలిగించాలి
వెల్తుర్లో కన్పించని నిజాల్ని వెతుక్కోవాలి.

అబద్ధాల నిండా స్ప్రే చేసి
అబద్ధం అందంగానే కాదు
పరిమళ భరితం కూడా అని
చెప్పకనే చెప్తున్నారు
కాస్త తెర తొలగించి
విత్తనాల ముఖం చూడాలి.

న్యూజెర్సీ వేదికపైన
‘మముగన్న తల్లికి మల్లెపూదండ’
సీడీ మోగిస్తున్నదెవరో
నా దేశంలో మాత్రం
వోల్డేజ్ హోంల దగ్గర
జ్ఞాపకాల మేఘాలు వర్షిస్తున్నాయి

కళ్లకి కన్నీళ్లు కార్చే
శక్తినిచ్చిన వాణ్ణే
దేవుడని వొప్పుకుంటా.

బాధ మీద పరిశోధన చేసి
ఎవరైనా డాక్టరేట్ పుచ్చుకున్నారా?
వొక వివరం చెప్పండి
గాయపడ్డ మనిషి గుండె
ఏ రంగులో ఉంటుంది?

ప్రేమకి స్వప్న వర్ణాలద్ది
రెక్కల్ని మోసుకెళ్లిపోతే ఎట్లా?
ఎంత దూరమైనా వెంటాడటానికి
కాళ్లు రెండు సరిపోవు కదా.

జీవితాన్ని
ఉచ్ఛ్వాస నిశ్వాసల్తో కొలవకు
కరెంటు తీగకి కూడా
వొక జీవితం ఉంటుంది.
అందుకే
కొంచెం నిప్పిస్తావా?
గుండె వత్తిని వెలిగించాలి
వెల్తుర్లో కనిపించని
నిజాల్ని వెతుక్కోవాలి.
*

-ఈతకోట సుబ్బారావు 800 856 2742