మహబూబ్‌నగర్

త్రిపుల్ ఐటీకి వనపర్తి అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, ఏప్రిల్ 9: త్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు వనపర్తి అనుకూలంగా ఉందని ఉన్నత విద్య మండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. సోమవారం వనపర్తిలో త్రిపుల్ ఐటీ కళాశాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను, వసతులను, భూమిని పరిశీలించారు. ప్రస్తుతం నడుస్తున్న పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని, స్థలాలను అలాగే నాగవరం శివారులోని 200 సర్వే నెంబర్‌లో గల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిరంజన్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. వనపర్తి జాతీయ రహదారికి, రైల్వే లైన్‌కు, అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్నందున అన్నివిధాలా కళాశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్నారు. ప్రధానంగా నీటి వసతి, భూ వసతి ఉన్నందున కళాశాలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. అలాగే నూతన కళాశాల భవనం నిర్మాణం అయ్యేంత వరకు ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాల రాజ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో త్రిపుల్ ఐటీకి సంబంధించి యూనివర్సిటీ వుందని, దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకోసం ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని, కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే కలెక్టర్‌తో మాట్లాడి స్థలాన్ని కూడా సిద్ధం చేశామని వివరించారు. అధికారుల నివేదిక వెళ్ళిన వెంటనే ప్రభుత్వంతో చర్చించి ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చించి వనపర్తిలోనే ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. భౌగోళికంగా అన్ని వసతులు ఉండటంతో పాటు పరిశ్రమలకు కూడా అనుకూల ప్రాంతం కావడంతో ప్రభుత్వం తప్పకుండా కళాశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం కళాశాల ఏర్పాటుకు అనుమతిస్తే పాలిటెక్నిక్ కళాశాలల తాత్కాలింగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భవన నిర్మాణానికి 200 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ చాలా ఉన్నప్పటికి కళాశాలకు 50 ఎకరాలు కేటాయిస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రమేష్‌గౌడ్, ఉన్నత విద్య మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, సభ్యులు ప్రొఫెసర్ నర్సింహరెడ్డితో పాటు టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మయ్య, గట్టుయాదవ్, లోక్‌నాథ్‌రెడ్డి, వాకిటి శ్రీ్ధర్, ఆవుల రమేష్, రాములుయాదవ్, బీచుపల్లి, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా కంటక ప్రభుత్వాలకు పతనమే..
- ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి
వెల్దండ, ఏప్రిల్ 9: ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మాయ మాటలతో కాలం వెల్లదీస్తున్న ప్రభుత్వాలకు పతనం తప్పదని ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. సోమవారం చారకొండ మండలం జూపల్లి గ్రామంలో పీసీసీ సభ్యుడు భాస్కర్‌రావు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఅర్‌ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడం తప్ప ఓరగబెట్టిదింటూ ఏమి లేదని దుయ్యబట్టారు. కేవలం జేబులు నిండే పనులు చేపట్టుతున్నరే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడం లేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇంటింటో ఉద్యోగమని చెప్పి నిరుద్యోగుల ఓట్లు దండుకోని అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తన ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఇచ్చుకుని నిరుద్యోగులకు కుచ్చుటోపి పెడుతున్నాడని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి దిట్ట అని, దేశంలోనే మోసం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నెంబర్‌వన్ స్థానంలో నిలుస్తారని, ఆయనకు ఎవరు సాటిరారని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం నోట్ల రద్దు పేరుతో నేటికి ప్రజల జీవితాలతో చెలగాటమడుతోంతదన్నారు. కేవలం సంపన్న వర్గాల ప్రజలకు తప్ప పేద ప్రజలకు ఓరగబెట్టింది ఏమి లేదని ఆయన విమర్శించారు. భవిష్యత్తులో ప్రజా కంటక పాలన సాగిస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లను ప్రజలు ఇంటికి సాగనంపుతారని అన్నారు. తమకు గ్రామంలో సిమెంట్ రోడ్లు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరడంతో వచ్చే నిధుల్లో తప్పకుండా మంజూరు చేస్తానని ఆయన హామీనిచ్చారు. ఈసమావేశంలో ఉమ్మడి జిల్లా డీసీసీ కోశాధికారి జూపల్లి భాస్కర్‌రావు, నాయకులు బాలరాజ్, శ్రీనుగౌడ్, జంగయ్య, భగవంతయ్య, సైదులు, ముత్తయ్య, దేవస్వామి తదితరులు ఉన్నారు.