ఐడియా

కాస్తంత ఆలోచనతో కొలువలేని అద్భుతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవికాలం వచ్చేసింది. పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశాయి. సమ్మర్ క్యాంప్స్ అంటూ స్కూల్స్ అన్నీ సందడి చేస్తున్నాయి. కాని కొందరు పిల్లలు మళ్లీ సమ్మర్ క్యాంపుకుపోవడం ఇష్టపడడం లేదు. మేము ఇంట్లోనే ఉంటూ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తాం అని మారాం చేస్తున్నారు.
అదిగో అటువంటివారు స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కోరుకుంటున్నారన్నమాట. వారికి చక్కని ఆలోచనలు వస్తుంటాయి. వాటికి అనువైన తావు దొరికి, మంచి ఆలోచన్లకు పదునుపెట్తే ఎన్నో సృజనాత్మక వస్తువుల తయారుదారులు వాళ్లే అవుతారు.
అందుకే వారికి ఇష్టమైన కలర్స్, వీటిల్లో స్కెచ్స్, వాటర్ కలర్స్, ఫ్యాబ్రిక్ కలర్ ఇలా ఎన్నోరకాలున్నాయి. వాళ్లు ఏదికోరితే దాన్ని అందుబాటులో ఉంచండి. ఆ తరువాత వారికి పేపర్స్, మనం ఉపయోగించుకొని పారేసే వస్తువులను కూడా అందుబాటులో ఉంచండి చాలు వాటిని చూసిన పిల్లలే ఎంచక్కా ఉపయోగపడే వస్తువులెన్నింటిలో తయారు చేయడానికి ముందుకు వస్తారు. ఇదిగో ఇదీ చూపించండి. కొందరు పిల్లలు వ్యర్థంగా పారేసే ప్లాస్టిక్ బాటిల్స్‌ను, యూజ్ అండ్ త్రో చేసే టీకప్పులు, పేపర్ ప్లేట్స్ వాటిని ఉపయోగిస్తూ కొత్త వస్తువుల తయారీకి ఆజ్యం పోస్తున్నారు. వాడేసిన కోడిగుడ్లనూ అందమైన బొమ్మలను తయారు చేస్తూ పిల్లలలనే కాదు పెద్దలనూ ఆకర్షిస్తున్నారు. ఒకసారి వీటిపై లుక్ వేయండి మీలోనూ వేలకు వేలు తలంపులు తలుపులు తీస్తాయి.

-శ్రీలత