ప్రకాశం

బాస్కెట్‌బాల్ వేసవి క్రీడా శిక్షణా శిబిరం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, ఏప్రిల్ 26: స్థానిక జిల్లాపరిషత్ బాలుర హైస్కూల్ క్రీడా మైదానంలో బాస్కెట్‌బాల్ వేసవి క్రీడా శిక్షణా శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ శిక్షణా శిబిరాన్ని పాఠశాల హెచ్‌ఎం అనురాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోను సత్తా చాటాలన్నారు. క్రీడలు దేహధారుఢ్యానికి, శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యార్థులు ప్రతి రోజు క్రీడలు, వ్యాయామాన్ని దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం నిర్వహించిన శిక్షణా శిబిరానికి 30 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్‌బాల్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ వేసవి క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని మంచి క్రీడాకారులుగా తయారు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల పీడీలు శ్రీనివాసరావు, రవీంద్ర తదితరులున్నారు.
ఎడ్ల బండలాగుడు పోటీలు ప్రారంభం
అర్ధవీడు, ఏప్రిల్ 25 : మండల కేంద్రమైన అర్ధవీడులో బ్రహ్మంగారి మఠంలో ధ్వజప్రతిష్ఠ ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్టస్థ్రాయి ఎడ్ల బండలాగుడు పోటీలను గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్‌రెడ్డి ప్రారంభించారు. ఈపోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుల్లారెడ్డి, ఎంపిపి రవికుమార్, ఎస్‌ఐ రవీంద్రారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భూములు పరిశీలించిన జేసీ
ఒంగోలు, ఏప్రిల్ 26 : కొత్తపట్నం మండలంలోని ఆలూరు, ఈతముక్కల గ్రామాల్లో ఎస్టీ కార్పొరేషన్ కోసం ప్రైవేట్ భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా 60 ఎకరాల ప్రైవేట్ భూములను పరిశీలించి ఎంత ఆదాయం వస్తుంది, రైతులు ఏయే పంటలు వేస్తారనే వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం నివేదికలను జిల్లా కలెక్టర్‌కు పంపాలని జేసీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఆర్డీవో శ్రీనివాసరావు, తహశీల్దార్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.