ప్రకాశం

రైతుల క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామూరు, మే 22: రాష్ట్రంలోని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి స్థితిగతులపై అధ్యయనం సాగించి క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నివేదిక తయారు చేసి వారి సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. మంగళవారం పామూరుకు చెందిన రియల్టర్ ఏ రమణయ్య, వెంకటేష్‌ల ఆత్మీయ పిలుపులో భాగంగా వారి ఇంటికి తేనేటి విందుకు వచ్చిన ఆయన కొద్దిసేపు విలేఖరులతో ముచ్చటించారు. క్షేత్రస్థాయిలో రైతాంగం తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, శ్రీకాకుళం, అనంతపురం, ప్రకాశం జిల్లాలోని ప్రాంతాల్లో స్వయంగా పరిశీలించి ఏ ప్రాంతంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలో రైతులు మామిడి, సపోట, పొగాకు పండించే వారితోపాటు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదిక తయారు చేసామన్నారు. దేశానికి వెన్నుముక రాజు అని ఆయన అన్నారు. రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రైతులు, బడుగు,బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నివేదిక అందించిన వెంటనే ప్రభుత్వం స్పందించని పక్షంలో పరిష్కారం కోసం అవసరమైన మార్గాలను అనే్వషిస్తామని ఆయన తెలిపారు. విలేఖరులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ రాజకీయంగా తాను పర్యటించడం లేదని, బాధ్యతగల పౌరుడిగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై, వాటి పరిష్కార మార్గాలపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. 13 జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన ప్రజల స్థితిగతులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తానన్నారు. గ్రామీణాభివృద్ధి వ్యవసాయంపై ఆధారపడి ఉందని, తాను వ్యవసాయంపై చిన్ననాటి నుంచి మక్కువ ఎక్కువ అని పేర్కొన్నారు. గ్రామసీమలో పట్టణానికి పట్టుకొమ్ములు అని, వ్యవసాయం భారం అయి రానున్న రోజుల్లో తినడానికి తిండిలేని పరిస్థితులు వస్తాయన్నారు. ఉన్నత ఉద్యోగంలో ఉంటూ రాజీనామా చేసి ప్రజలకు వద్దకు వస్తున్న మీరు ఏ పార్టీ తరుపున పోటీ చేస్తారని ప్రశ్నించగా సున్నితంగా దానిని ఆయన తిరస్కరించారు. అనంతరం లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.