మహబూబ్‌నగర్

గ్రామాల్లో ఆట మొదలైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 22: గ్రామ పంచాయతీ ఎన్నికలను జూలై నెలఖరు వరకు నిర్వహించాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ నమూనా షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా గ్రామాల్లో అప్పుడే ఆట మొదలైంది. పల్లెల్లో ఎవరినోట విన్న పంచాయతీ ఎన్నికలపైనే జోరుగా చర్చ జరుగుతుంది. ఇంకా రిజర్వేషన్ ప్రక్రియనే జరగకముందు అన్ని రాజకీయ పార్టీల నుండి ముగ్గురు నలుగురు అభ్యర్థులు ఒక్కో గ్రామంలో తామే సర్పంచ్ అభ్యర్థిగా తమ పార్టీ నుండి బరిలోకి దిగుతామని, పార్టీ రహిత ఎన్నికలు ఉండడంతో పార్టీ నాయకుల మద్దతు తనకే దక్కుంతుందని ఆశావాహులు అప్పుడే ప్రజల ముందుకు వెళ్లి చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ పాలక మండలి కాల పరిమితి ఆగస్టు 1 నాటికి ముగియనున్నడంతో 2వ తేదీ నుండి కొత్త పాలక మండళ్లు ఏర్పాటు కావల్సింది. ఈ నేపథ్యంలో రాబోయే పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం నమూనా ఎన్నికల షెడ్యూల్‌లను జారీ చేయడంతో ఒక్కసారిగా పల్లెల్లో రాజకీయం వెడేక్కింది. అయితే ఈ ఎన్నికలను రెండు లేదా మూడు విడతల్లో నిర్వహించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన నమూనా ఎన్నికల షెడ్యూల్‌ను కూడా జారీ చేయడం సంబంధిత పంచాయతీరాజ్ కమిషనర్, జిల్లా ఎన్నికల ఆథారిటీగా కొనసాగుతున్న జిల్లాల కలెక్టర్లకు నమూనా షెడ్యూల్‌ను కూడా పంపించేసింది. మూడు విడతల్లో నిర్వహించాలనుకుంటున్న ఈ ఎన్నికలకు కనీసం ఒక విడత 15రోజులు రెండు విడతలు నిర్వహిస్తే 19 రోజులు మూడు విడతలు నిర్వహిస్తే 23 రోజులు నిడివి అవసరం ఉంటుందని ఎన్నికల సంఘం భావించిన నేపథ్యంలో ఇక తప్పకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలు మాత్రం వెలువడినట్లయంది. అయితే నమూనా ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యిందనే ప్రచారం జరగడంతో ఇక ఎన్నికలు వచ్చినట్లేనని రాజకీయ పార్టీల నాయకులు ప్రజలు భావిస్తున్నారు. నమూనా ఎన్నికల షెడ్యూల్ తుది షెడ్యూల్ కాదనే విషయాన్ని రాజకీయ నాయకులు కూడా ప్రజలకు తెలియపర్చకపోవడంతో రాజకీయ విశే్లషకులు రాజకీయ పార్టీల వ్యవహార శైలిపై పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1600లకుపైగా గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా ఎన్నికలు జరిగే అవకాశాలు ఉంటాయని సంబంధిత అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లో ఇక ఆట మొదలైందని అప్పుడే రాజకీయ పార్టీల నాయకులు సర్పంచు, వార్డు సభ్యుల పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు గ్రామాల్లో తిష్టవేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాలోని ఎంపీడీఓలు పోలింగ్ బూత్‌ల గుర్తింపుతో పాటు ఇదివరకే గుర్తించినటువంటి బూత్‌లను పరిశీలించే పనిలో పడ్డారు.

పేగుబంధం పెనుభారమైనదో..
- అర్ధరాత్రి పసికందును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు - శిశు విహార్‌కు తరలించిన అధికారులు
వెల్దండ, మే 23: అమ్మతనానికి కలంకం తేచ్చే విధంగా నవమాసాలు మోసి కన్న తన పేగుబందానికి బాగోగులు చూడటం భారమైందో.. ఇద్దరి చీకటి తప్పు బయట పడుతుందని భావించారో.. తెలియదు కాని అభం శుభం తెలియని ముక్కుపచ్చలరని పది రోజులు నిండని చిన్నారి పసిబాలుడు ఆ కర్కసురాలు, మానవత్వాన్ని మంటగలిపి ఓ ఇంటి ముందు అర్ధరాత్రి వదిలేసి వెళ్లిన సంఘటన మండలంలోని కొట్ర గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కొట్ర గ్రామంలోని తిర్మాన్‌దాసు శ్రీనివాస్‌గౌడ్ ఇంటి తలుపు ముందు అర్ధరాత్రి గుర్తు తెలియని వారు చిన్నారి పసిబాలుడ్ని చూడముచ్చటగా ముస్తాబు చేసి మరీ వదిలిపెట్టి వెళ్లిపోయారు. అర్ధరాత్రి ఆ పసిబాలుడు గుక్కపెట్టి ఏడుస్తున్నా ఇంట్లో ఉన్న వాళ్లు అపరిచిత వ్యక్తుల భయంతో బయటకు వెళ్లేందుకు జంకారు. కొద్దిసేపటికి తిర్మాన్‌దాస్ పద్మ, శ్రీనివాస్‌గౌడ్ దంపతులు ధైర్యం చేసి బయటకు వచ్చి చిన్నారిని అక్కున చేర్చుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రికి రాత్రే అక్కడికి చేరుకోని విచారణ చేపట్టారు. విషయం దావానలంగా వ్యాపించడంతో స్థానికులు మంగళవారం ఉదయం శ్రీనివాస్‌గౌడ్ ఇంటికి చేరుకోని ముక్కుపచ్చలరాని పసిబాలుడిని చూసి కన్నవారు ఎంత పాపం చేశారని, ఏ తల్లి కన్నదో, ఎట్లా కన్నాదోంటూ దుమ్మెత్తిపోశారు. కాగా, సంతానంలేని దేశమోని మణెమ్మ, శ్రీనివాసులు దంపతులు దేవుడిచ్చిన బిడ్డంటూ చిన్నారిని అక్కున చేర్చుకోని పాలు పట్టి అలనా పాలన చూశారు. చిన్నారిని తమకు ఇస్తే పెంచుకునేందుకు సిద్ధమని ముం దుకు వచ్చారు. కాని సంబంధిత శాఖ అధికారులు నింబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం ఐసీడీఎస్ సీడీపీఓ చందనేశ్వరి, సూపర్‌వైజర్లు వనజ, శోభారాణిలు చిన్నారి శిశువును కల్వకుర్తి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. మండల బీజేపీ అధ్యక్షుడు జూలురి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ ముత్యాల రాంమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇలా ఉండగా ఆసుపత్రి వైద్యుడు శివరాం చిన్నారి ఆరోగ్యం ఉన్నాడని, చిన్నారి బొడ్డుకోతను బట్టి 7రోజులను నుంచి 10రోజుల బాలుడై ఉంటాడని తెలిపారు. అనంతరం చిన్నారిని ఐసీడీఎస్ అధికారులు మహబూబ్‌నగర్ శిశువిహార్‌కు తరలించారు.