అనంతపురం

ప్రత్యేక హోదా కోసం మానవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, జూలై 7: బుక్కరాయసముద్రం మండలంలో సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో శనివారం మానవహారం నిర్వహించారు. సీపీఐ నియోజికవర్గ కార్యదర్శి టి.నారాయణస్వామి, మండల కార్యదర్శి ఎర్రినాథ ప్రసాద్, సీపీయం డివిజన్ కార్యదర్శి బాలరంగయ్య, మండల కార్యదర్శి ఆర్.కుళ్ళాయప్ప, జనసేన నాయకులు చంద్ర ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అనంతపురం - తాడిపత్రి రహదారిలో ప్రత్యేక హోదా నినాదాలతో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆశయాలను ప్రకటించిన ప్రత్యేక హోదా ఇవ్వకుండా అణగదొక్కుతోందని వారు ఆరోపించారు. ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం ఎన్నికల తర్వాత ప్రధానిగా మోదీ పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఆంధ్రపదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ప్రజలను మోసం చేసిన ఏ ప్రభుత్వమూ మరలా అధికారం చేపట్టిన దాఖలాలు లేవని ఇకనైనా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదాను వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో పర్యటించిన ప్రభుత్వ విప్ యామినీ బాల
బుక్కరాయసముద్రం, జూలై 7: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో శనివారం స్థానిక శింగనమల ఎమ్మెల్యే యామినీ బాల పర్యటించారు. ఈ సందర్భంగా గతంలో కాలనీలో నిర్మించిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం సమీపంలో ఉన్న చర్చిను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సామాజిక బాధ్యతతోనే రాయలసీమ అభివృద్ధి

అనంతపురం సిటీ, జూలై 7: వెనుకబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతాన్ని సామాజిక బాధ్యతతోనే మనమందరం కలసి పనిచేస్తే రాయలసీమ అభివృద్ధి సాధ్యమవుతుందని మోడ్రన్ రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు పాలెం శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో మోడ్రన్ రాయలసీమ డెవలప్‌మెంట్ ట్రస్టు ఆవిర్భావ సభను నిర్వహించారు. అంతకుముందు నగరంలోని ఆర్ట్స్ కాలేజి నుండి టవర్‌క్లాక్, సప్తగిరి సర్కిల్ మీదుగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మీదుగా రాయల్ ఫంక్షన్ హాల్ వరకు భారీగా బైకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఆవిర్భావ సభలో ఎంఆర్‌డీటీ జెండాను పాలెం శ్రీకాంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాయలునాటి వైభవాన్ని గడించిన రాయమసీమ ప్రాంతం అభివృద్ధికి దూరమైందన్నారు. రాయలసీమకు పూర్వ వైభవం తీసుకురావాలంటే మేథావులు, రాజకీయాలకు, కుల, మతాలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమ వివక్షకు గురైందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీన, నిర్లక్ష్య వైఖరి వలన నూతన రాజధాని అమరావతి నిర్మాణం, సాగునీటి, తాగనీటి ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయింపుల్లో, విద్యాసంస్థలు, పరిశ్రమల స్థాపనలో మేథావులు, విద్యావంతులు, యువకుల్లో ఎన్నో అనుమానాలు, అపోహలు కలుగుతున్నాయని, వాటిపై అవగాహన చేయడానికి మోడ్రన్ రాయలసీమ ట్రస్టు రాయలసీమ ప్రాంతంలో సదస్సులు నిర్వహించి ప్రజలను, యువకులను చైతన్యవంతుల చేస్తామని తెలిపారు. అలాగే రాయలసీమ జిల్లాలో యువతకు ఉపాధి కల్పనకు పరిశ్రమలు, నైపుణ్యత కల్గించి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి, రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఎంఆర్‌డీటీ జిల్లా అధ్యక్షుడు ఎం.శివకృష్ణ చౌదరి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతపురం జిల్లాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటుచేయాలని కోరారు.