కరీంనగర్

కర్ణాటక రాష్ట్ర తరహాలో.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుల్తానాబాద్, జూలై 19: కర్నాటక రాష్ట్ర తరహాలో గ్రామ పంచాయతీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జొన్నకోటి వెంకటేష్ డిమాండ్ చేశారు. గురువారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఈ నెల 23 నుండి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ పంచాయతీ ఉద్యోగ, కార్మికుల రాష్టవ్య్రాప్త నిరవధిక సమ్మెలో భాగంగా, సమ్మెను జయప్రదం చేయాలంటూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల వలె వేతనాలు పెంచాలని, వేతనాల చెల్లింపుకు ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలని జి.ఓ.నం.112, 212 లను సవరించి అర్హులందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. కారోబార్‌లు, బిల్ కలెక్టర్లతో పాటు అర్హులైన ఉద్యోగ, కార్మికులందరికీ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్లు ఇవ్వాలని, పీఎఫ్, ఇఎస్‌ఐ, పింఛన్ సౌకర్యాలను వర్తింపజేసి అమలు చేయాలని, జనశ్రీ బీమా స్థానంలో ఐదు లక్షల బీమా సౌకర్యాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ ఉద్యోగులు ఆసరి రమేష్, కొమురయ్య, పర్శరాములు, వీరయ్య, మహేందర్, సుగుణమ్మ, ఎల్లయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
‘విద్యార్థులకు మెనూ తప్పనిసరి’
ఇల్లందకుంట, జూలై 19: విద్యార్థులకు మెనూ ప్రకారంగా భోజనాన్ని అందించాలని పీసీసీ అధికార ప్రతినిధి తుమ్మేటి సమ్మిరెడ్డి అన్నారు. గురువారం మం డల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న స దుపాయాల గురించి అడిగి తెలుసుకొని పాఠశాల ఉపాధ్యాయులుపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. మెను ప్రకారంగా బోజనాలను తయారు చేయడం లేదని, అంతేకాకుండా దొడ్డు బియ్యంతో బోజనం వడ్డీస్తున్నారని పేర్కొన్నారు. గత రెండు రో జుల క్రితం సరిగ్గా లేని ఆహారాన్ని అందించిన విషయాన్ని విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం కల్పించాలని సూచించారు. విద్యారంగ సమస్యలను పరిష్కారించడంలో రాష్ట్ర ప్రభు త్వం విఫలం చెందిందని పేర్కొన్నారు. ఆయన వెంట మండలాధ్యక్షుడు జిల్లెల తిరుపతిరెడ్డి, నాయకులు, తదితరులు ఉన్నారు.