అనంతపురం

నిర్దేశిత గడువులోపే ఉపకార వేతనాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 21: జ్ఞానభూమి వెబ్‌పోర్టల్‌లో ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే వారి వివరాలను ఈ నెల 25వ తేదీలోపు పొందుపరచాలని కలెక్టర్ జి.వీరపాండ్యన్ జిల్లాలోని వివిధ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని రెవిన్యూ భవన్‌లో జిల్లా స్థాయి జ్ఞానభూమి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపకార వేతనాలు పొందేందుకు 1,22,764 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉందన్నారు. ఇందులో కేవలం 30 శాతం మాత్రమే రిజిస్టర్ చేశారని మిగిలిన 70శాతం చేయాల్సి ఉందన్నారు. జిల్లాలోని వివిధ కళాశాలల్లో చదువుకుంటున్న ప్రెష్ మరియు రెన్యువల్స్ విద్యార్థుల దరఖాస్తులను ఈ నెల 25వ తేదీలోపు తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు అందకపోతే వారి విద్యను కొనసాగించలేరన్నారు. రిజిస్ట్రేషన్ల్ నమోదు ప్రక్రియలో ఏవైనా సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇలాంటి సమస్యలు తెల్సుకునేందుకు రెండు వాట్సప్ గ్రూపులను ఏర్పాటుచేశామన్నారు. ఆ గ్రూపులో తమ సమస్యలు తెలిపితే సంబందిత అధికారులు వెంటనే పరిష్కరిస్తారన్నారు. గడవులోపు ఈ ప్రక్రియ పూర్తిచేయని విద్యాసంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిందిగా ఉన్నతాధికారులకు తెలిపారు. అయితే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని ఇలాంటి చర్యలకు ఉపక్రమించలేదన్నారు. విద్యార్థులు బ్యాంకు ఖాతాలు తెరవడానికి పాన్‌కార్డులు అవసరం లేదని ఏల్‌డిఏం ద్వారా జిల్లాలోని అన్ని బ్యాంకర్లకు సూచించామన్నారు. కుల ధృవీకరణ పత్రాలు సమస్యలపై కూడా తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అనంతరం జేసీ-2 మాట్లాడుతూ ప్రతి నెల 5వ తేదీలోపు విద్యార్థులు హాజరు నమోదు వివరాలను పంపాలన్నారు. ఈ నెల 27వ తేదీలోపు నూరు శాతం బయోమెట్రిక్ అఫెంటికేషన్, కాలేజి వన్‌టైమ్ అప్రూవల్, డీడీఓడిఏ పూర్తికావాలన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్ మాట్లాడుతూ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తులు రిజిష్టర్ చేసుకోకపోతే ఉపకార వేతనాలు అందవన్నారు. సెప్టెంబర్ 3వ తేదీలోపు స్టూడెంట్స్ హాజరు వంద శాతం పూర్తి చేయాలన్నారు. పూర్తి వివరాలు నమోదు చేసుకున్న విద్యార్థులకు బకాయిలతో సహా సెప్టెంబర్ 7వ తేదీన వారి ఖాతాల్లో జమకాబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐఓ సురేష్, డీవీఇఓ చంద్రశేఖర్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం
పుట్టపర్తి, ఆగస్టు 21 : కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అనంతపురం పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తిలోని కోటా కాంప్లెక్స్‌లో డీసీసీ అధ్యక్షులు కోటా సత్యం నుంచి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల బూత్ కమిటీ జాబితాలను రాజీవ్‌రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ఏమాత్రం నెరవేర్చలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు బూటకపు హామీలతో ప్రజలను వంచించారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఆ రెండు పార్టీలు ప్రజలలో విశ్వాసం కోల్పోయాయన్నారు. 2019లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ అని, రాష్ట్రానికి తమ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయడమే తమ అంతిమ లక్ష్యమన్నారు.