అనంతపురం

మున్సిపల్ కమిషనర్ బదిలీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, ఆగస్టు 21 : హిందూపురం మున్సిపాలిటీలో కమిషనర్లు పూర్తిస్థాయిలో పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. కమిషనర్లకు అధికార పార్టీ నాయకులకు మధ్య సమన్వయం కుదరకపోవడంతో పట్టుమని ఏడాది కాలం పాటు కమిషనర్లు పనిచేయకుండానే బదిలీ అవుతున్నారు. కమిషనర్‌గా పనిచేసిన భద్రారావు పదవీ విరమణ తర్వాత గ్రూపు-1 అధికారి విశ్వనాథ్ ఇక్కడికి కమిషనర్‌గా వచ్చారు. అయితే ఆయన కనీసం ఏడాది కాలం కూడా పనిచేయకుండానే బదిలీపై వెళ్లిపోయారు. ఆయన స్థానంలో మున్సిపల్ అధికారులు ఏరికోరి సమర్థవంతంగా పనిచేస్తారనే భాగ్యలక్ష్మిని ఇక్కడికి కమిషనర్‌గా నియమించారు. ఆమె సైతం ఇక్కడ బదిలీపై వచ్చి తొమ్మిది నెలలు మాత్రమే పనిచేసింది. ఇంతలోనే ఆమెకు బదిలీ రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పురపాలక శాఖలో ఉత్తర్వులు సిద్ధమయ్యాయని, మరో రెండు, మూడు రోజుల్లో ఇక్కడి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఇక్కడికి కమిషనర్‌గా మరోసారి గ్రూపు-1 అధికారి నియమితులు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏలూరులో పనిచేస్తున్న చక్రపాణిని ఇక్కడ కమిషనర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి సోమవారం నాటికి హిందూపురానికి నూతన కమిషనర్ వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి సమన్వయం కుదరకపోవడంతో మొదటి నుంచి అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. కమిషనర్‌గా సమర్థవంతంగానే పనిచేసినప్పటికీ అందరిని కలుపుకుపోయే విషయంలో విఫలమయిందన్న ముద్ర ఆమెపై ఉంది. హిందూపురం నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్న ఓ అధికారి ఓ స్థలానికి సంబంధించి సమాచారాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే మున్సిపల్ నిబంధనల ప్రకారం తాను అంగీకరించలేనని, అవసరమైతే ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికైనా సిద్ధమేనని భాగ్యలక్ష్మి ఖరాఖండిగా తేల్చేయడమే బదిలీకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మున్సిపాలిటీ ముఖ్య నాయకులతోనూ అంతంత మాత్రంగానే సమన్వయం ఉండటం, పాలకవర్గం సైతం కమిషనర్ వ్యవహార శైలి పట్ల అసంతృప్తిగా ఉండటంతో ఏడాది లోపే బదిలీ కానున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ పట్ల కమిషనర్ భాగ్యలక్ష్మి సమర్థవంతంగా వ్యవహరించడం లేదని, ఇంటింటా చెత్తసేకరణ ఆటోలను తొలగించారని పాలకవర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది. దీనికితోడు మున్సిపాలిటీలో అధికారులకు, కమిషనర్ నడుమ సత్సంబంధాలు లేకపోవడం, ఏకపక్ష వైఖరి అవలంభించారన్న ఆరోపణలు ఉండటంతో సమర్థవంతమైన అధికారి అయినా బదిలీ తప్పలేదు.