Others

చిగురొత్తిన సిరా చుక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెల్ల కాగితంపై అక్షరాలు ఇంకిపోతున్నాయి
వల్లె వేసుకున్న కవితాపంక్తులు
దోబూడులాడుతున్నాయి
వాగులు వంకలు పల్లెలు
పచ్చదనం పులుముకున్న పంటచేలు
మల్లెల గుబాళింపులు తల్లుల జోలపాటలు
వెనె్నల కిరణాల్లో నదుల తళతళలు
కనె్న మనసు కేరింతలు.
అన్నీ ఎక్కడికో వలసపోయాయి
ఉత్సాహంతో ఉరకలు వేస్తూ
పరవళ్లు తొక్కుతూ తుళ్లింతలు పడుతూ
నిరంతరం సాగిపోతున్న కలం మాగనే్నసింది.
పదాల పదును చురకత్తులు విసిరిన కలం
భంగపడి బుంగమూతి పెట్టుకుంది.
కొత్తకొత్త నోట్ల కట్టల్లా
తెల్లకాగితాల దొంతర్లు మూలనపడి
మూలుగుతున్నాయి.
సంకెళ్లు త్రెంపుకున్న స్వేచ్ఛా గీతాలను
బానిసత్వం అణచిన వాంఛా అనుభూతులను
సమాజం సమభావం సామరస్యం
నిజానికి నిలువెత్తు అక్షర సాక్ష్యంగా
కేకలు వేసిన కలం - కలత నిద్రలోకి జారింది.
పసిడి రెక్కల్ని గుచ్చుతున్న ముళ్ల పిడికిళ్లు
దీపకాంతుల్ని చిదుముతున్న ముడిపడ్డ నొసళ్లు
అప్పుడే విచ్చిన అరవిందాన్ని
చప్పుడు కాకుండా చప్పరించిన
మిడతదండుల కామాంధత!
రేపటి వేకువ కోసం రెప్పవేయని నిజాల్ని
కర్కశ పదఘట్టనలతో అణచివేస్తున్న
అధికార మదాంధత!
చిరుగాలి రెక్కల్ని చిదిమేసి నిప్పులు
చెరగుతున్న సుడిగాలులు!
ఆశల నిచ్చెన నడుమ విరగకొట్టిన అవకాశవాదాలు
శాంతికి కాంతికి మధ్య సాపత్యంలేని తెరలను
ఆగామిగా ఆవిష్కరించిన సందిగ్ధావస్థ
అభావనలు!
చిరంతన చీకటి బాటలో అగమ్యమై
అస్తవ్యస్తం అవుతున్న అక్షర దారులు!
అయినా..
కలం కలవరపడటం లేదు
కాలాన్ని తనతో మమేకం చేసుకోవటం లేదు
యాగాలు, యుగాలు, యామినుల
స్పర్శ రోమాంచితం కలిగించటం లేదు
భావాలు, భగ్న స్వప్నాలు, బాధిత హృదయాలు
స్పృహ తెప్పించటంలేదు
కలం..
కాల నిర్దేశాన్ని మరచిపోయింది.
నిర్భయత్వాన్ని నీరుకార్చుకుంది
కదను త్రొక్కుతూ కవాతు చేసిన కలం
ఆదమరచి మూలన ముడుచుకుంది
ఎక్కడిదో మలయమారుతం
మకరందపు బిందువుల్ని
మోసుకొచ్చింది
చైతన్యపు చినుకుల్ని చిలకరించింది
కర్తవ్యం విప్లవించింది.
కలం.. అక్షర పల్లవులను
చిగురించింది.
చరాచరమంతా నవచైతన్యం పరచుకుంది. *

--బి.ఎస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199