ఆంధ్ర గాథాలహరి

ఏ దేవతవు నాయనా నువ్వు? (ఆంధ్రగాథాలహరి-57)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ కర్ణ్భూషణలుగా నొప్పు, కలువపూలు
నవపరాగ మామెకు, నయనములబడగ
ఊదునెపమున, ముద్దాడు ‘‘ఓయి! ఘనుడ!
నీవ నిమిషుల యందున నెవరు చెపుమ?
ఆమె చెవులకున్న కలువపూవుల పుప్పొడి కన్నులలో పడగా ఊదే నెంతో ఆమెను ముద్దాడుతున్న ప్రియుణ్ణి ‘‘నీవు సామాన్యుడవు కాదు. ఏ దేవతా స్వరూపం నాయనా నువ్వు?’’ అంటూ చమత్కరిస్తున్నాడు వారిని గమనించిన ఒకడు.

వివరణ
‘గాథాసప్తశతి’లోని అనేక గాథల్లో స్ర్తిలు చెవులకు కలువపూవుల్ని అలంకరణ కోసం ధరించడం ప్రస్తావించబడింది. అంటే నాడు అది చాలా సామాన్యమైన విషయమన్నమాట. ఈ గాథలో నాయిక కంట్లో పడ్డ పుప్పొడిని ఊదే నెపంతో లాఘవంగా ముద్దాడుతున్న యువకుడ్ని ‘ఏ దేవతవు నాయనా నువ్వు?’ అని అడగడం సహజ సుందరంగా ఉంది. పైగా తెలుగుదనం ఉట్టిపడే ‘నువ్వు సామాన్యుడివి కాదురోయ్’ అనే ధ్వని ఈ గాథలో ప్రతిధ్వనిస్తోంది.
ప్రాకృతమూలం
వాఏరిఏణ భరి అం అచ్ఛిం కణ్ణ ఊర ఉప్పలరఏణ
ఫుక్కంతో అవి ఇహ్ణంచుంబంతో కోసి దేవణం (పాలితుడు)

సంస్కృత ఛాయ
వాతేరి తేన భృతమక్షి కర్ణపూరోత్పల రజసా
ఫూత్కుర్వన్న వితృష్ణం చుంబం కోడిసి దేవానామ్ - ఇంకావుంది...

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949