ఆంధ్ర గాథాలహరి

మధ్యముడే ఉత్తమం( ఆంధ్రగాథాలహరి-64)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాకృతమూలం
తామ జ్ఘియోవ్వి అవరం దుజ్జణసు అణోహిదోహి విణకజ్జం
జహ దిట్ఠో తవఇ ఖలో తహే అసు అణో అఈ సంతో (హాలుడు)
సంస్కృతచ్ఛాయ
తన్మధ్యమ ఏవ వరం దుర్జన సుజనాభ్యాం ద్వాభ్యా మపిన కార్యమ్
యథాదృష్టస్తాప యతి ఖలస్తదైవ సుజనో దృశ్యమానః
తెలుగు
తే.గీ దుష్టమిత్రుని జూచుట దుఃఖకరము
సుధృయుడగు సన్మిత్రుని చూడకున్న
నదియు, హృదయాబ్జమునకు సన్తాపకరము
చూడ! మధ్యము స్నేహమేసుఖ కర్మము
‘దుష్టుడైన మిత్రుడు కనపడ్డా దుఃఖమే- సజ్జనుడైన మిత్రుడు కనపడకపోయినా దుఃఖమే. అందువల్ల మధ్యమునితో స్నేహమే సుఖకరమని’ నాయిక తన ప్రియ సఖితో చెపుతోంది.
వివరణ: దుష్టుడైన మిత్రుడు కలిస్తే ఏ ఉపద్రవం తెస్తాడోనని భయం. ఇలాంటివాడు నీ మిత్రుడా! అని ఎవరైనా అంటారేమోనని జంకు. మరీ మంచివాడైన మిత్రుడైతే, అతడు కనపడకపోతే దుఃఖం వస్తుంది. కారణం అతని సౌజన్యం, సౌభ్రాతృత్వం. కాబట్టి మరీ చెడ్డవారిని కాకుండ, మరీ మంచివారిని కాకుండా మధ్యములనే ఎంచుకోమంటుంది గాథ. మంచితనానికి కొలమానం లేదు కదా! అందువల్ల మంచి వాళ్ళందరినీ మిత్రులుగా చేసుకుంటే పోలా!
మంచికి పరిమితి ఏముంది? మంచితనానికి హద్దులేముంటాయ. కాని అతి మంచితనమూ ఒక్కోసారి ప్రమాదాలు కొని తెస్తుంది. స్వాతంత్య్రం ఉందికదా అని ఏపనైనా చేయలేముకదా. అట్లానే మంచితనానికి పరిస్థితులు అనుకూలించకపోతే ఆ మంచితనమే ప్రాణం మీదకు తెస్తుంది. అందుకే అటు పరిస్థితులను బట్టి, వాతావరణాన్ని బట్టి నడుచుకునే మధ్యముడే మంచివాడని గాథాకారుడు చెప్పడం శతకారుడు చెప్పినట్లు మనుషులందరినీ తానొవ్వక, ఇతరులను నొప్పించక బతకమనే కదా. - ఇంకావుంది..

-డి.వి.ఎం. సత్యనారాయణ 9885846949