మహబూబ్‌నగర్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరచింత, సెప్టెంబర్ 22: సకాలంలో వర్షాలు పడక వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుందో లేదోనని ఆందోళనతో తన పొలంలో రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండల పరిధిలోని పాంరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి అమరచింత ఎస్సై బి రామస్వామి తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. పాంరెడ్డిపల్లికి చెందిన దేవర్ల ఆంజనేయులు (51) తనకున్న 4 ఎకరాల్లో కంది సాగు చేశాడు. సకాలంలో వర్షాలు కురియక పోవడంతో దిక్కుతోచక పోలంలో ఉన్న వేప చేట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పుడ్డాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రామస్వామి తెలిపారు.