మహబూబ్‌నగర్

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 24: తెలంగాణ వస్తే నిరుద్యోగులు ఉద్యోగా లు వస్తాయని, ఉద్యమంలో పోరాడిన నిరుద్యోగులకు ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక నిరాశగానే మిగిలిందని, సీయం కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని గద్వాల తాజా, మాజీ ఎమ్మె ల్యే డీకే అరుణ అన్నారు. సోమవారం గద్వాల తాలుకాలోని పలు పాతపాలెం, రేవులపల్లి, గుంటిపల్లి, చెనుగోనిపల్లి, వెంకంపేట, ఈర్లబండ, తదితర గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త లు, నాయకులు డీకే అరుణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది, తె చ్చింది ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, కాంగ్రెస్ పార్టీకి కా ర్యకర్తలే మనోబలం అని పేర్కొన్నారు. ఇంటికి తాగు నీళ్లు ఇచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగాతనని చెప్పిన కేసీఆర్ ఈనాడు ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో రాష్ట్రాన్ని అదో గతి పాలు చేశారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేక పోయారని, అనుభవం లేని టీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేసి మరోసారి గద్దెనెక్కిస్తే రాష్ట్రం అప్పుల పాలవుతుందని తెలిపారు. ముస్లిములకు 12శాతం రిజర్వేషన్, ముస్లిం మైనార్టిలను అభివృద్ది చేశామని చెప్పి, ఏమి చేశారో ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉందని, రైతులకు రూ.2లక్షల రుణమాపీ, మహిళా సంఘాలకు వడ్డిలేని రుణాలు, వృద్దులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు రూ.3వేల ఫించన్లు, తదితర అంశాలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచి పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో టీపీసీసి కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు బండల వెంకట్రాములు, హన్మంతరాయ, రాజేష్ అయ్యా, నాగేందర్‌యాదవ్, హరీష్, భాస్కర్, నర్సింహ్మ, మేకల ఆంజనేయులు, గుండప్ప పాల్గొన్నారు.