సంపాదకీయం

వల్లభ విగ్రహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముత్కర్ష సంస్కారాలకు సజీవ రూపంగా భారత జాతీయ చరిత్రను సముజ్వలం చేసిన సర్దార్ వల్లభ భాయి పటేల్ పార్ధివ శరీర పరిత్యాగం చేసి అరవై ఎనిమిదేళ్లు అయింది. 1950 డిసెంబర్ పదిహేనవ తేదీన ఆయన భౌతిక జీవన యాత్ర పరిసమాప్తమైంది. డెబ్బయి ఐదేళ్లు జీవించిన ఆ మహనీయుడు సాధించిన విజయం సజీవంగా ఉంది, అజరామరంగా కొనసాగనుంది. ఈ విజయం బ్రిటన్ విముక్త భారత ప్రాదేశిక సమగ్రత, ఈ విజయం భారత జాతీయ సమైక్య తత్త్వం. శతాబ్దులు కొనసాగిన విదేశీయ బర్బర జాతుల బీభత్స దురాక్రమణ ఫలితంగా ఈ ప్రాదేశిక సమగ్రత ముక్కలైంది, సనాతన జాతీయ ఏకత భగ్నమైంది. క్రీస్తుశకం 712లో మహమ్మద్ బిన్ కాసిమ్ అనే అరబ్బీ బీభత్సకారుడు ప్రారంభించిన ఈ దురాక్రమణకు ‘బ్రిటన్’ చొరబాటు పరాకాష్ఠ. బ్రిటన్ దురాక్రమణ ముగిసే నాటికి ‘అఖండ భారత్’లోని సగానికి పైగా భూ భాగం దేశం నుండి విడిపోయింది. అవశేష భారత్ మిగిలింది. అవశేష భారత్ ఆరువందల స్వతంత్ర దేశాలుగా ముక్కలు చెక్కలు కాకుండా నిరోధించిన కారణజన్ముడు సర్దార్ వల్లభ భాయి పటేల్, భరతమాత వజ్రాల బిడ్డడు. విదేశీయ దురాక్రమణ ఫలితంగా అడుగంటిన ప్రాదేశిక సమగ్రతను, జాతీయ సమైక్య సంస్కృతిని పునరుద్ధరించినవాడు సర్దార్ పటేల్! 1875 అక్టోబర్ ముప్పయి ఒకటవ తేదీన గుజరాత్‌లోని నడియార్‌లో పటేల్ జన్మించే నాటికి భారతదేశం బ్రిటన్ ముష్కరుల బందిఖానా.. ఈ బందిఖానా నుండి సనాతన జాతికి విముక్తిని కలిగించడానికి జరిగిన సంఘర్షణ వల్లభుని జీవన ప్రస్థానం.. ఆయన జీవనం మాతృదేశ మమకార సంస్కారాన్ని ప్రస్ఫుటింపచేసిన మాధ్యమం! కుటుంబాన్ని వంశాన్ని పవిత్ర వంతం చేయగలవాడు, కన్నతల్లిని కృతార్థురాలిని చేయగలిగినవాడు, మాతృభూమిని మరింత సౌభాగ్యవతిని చేయగలిగినవాడు నిజమైన కుమారుడు.. ‘‘కులం పవిత్రం జననీ కృతార్థా వసుంధరా పుణ్యవతీ చ తేన...!’’ భరతమాతకు అలాంటి ఆనందదాయకుడైన కుమారుడు వల్లభుడు, ఋషితుల్యుడు! ఒక్కొక్క సంస్కారానికి లేదా అనేక సంస్కారాలకు సజీవ విగ్రహాలుగా భరత మాతృదేవి గృహ ప్రాంగణంలో నడయాడిన వరాల బిడ్డలు సనాతన జాతీయ చరిత్రలో వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అలాంటి సంస్కార విగ్రహాల సజీవ స్మృతుల పరంపరకు చెందినవాడు వల్లభ మంత్రి.. బ్రిటన్ విముక్త భారతదేశానికి మొదటి ఉప ప్రధానమంత్రి.. గోరక్షక సంస్కారానికి దిలీపుడు, యదుకుల కృష్ణుడు వంటివారు సజీవ విగ్రహాలు, రఘురాముడు ధర్మానికి విగ్రహవంతుడు! హరిశ్చంద్రుడు సత్య స్వభావానికి స్వరూపుడు. ఆదిశంకరాచార్యుడు సాంస్కృతిక సమైక్య పునరుద్ధారకుడు. ఛత్రపతి శివాజీ సర్వమత సమభావ సమారాధకుడు. వివేకానందస్వామి దాస్యాంధకారంలో ఉదయించిన విజ్ఞాన చంద్రుడు. వీరందరూ, ఇలాంటివారు మరెందరో స్మృతి పథంలో చెఱగని స్ఫూర్తి విగ్రహాలు.. ఈ సజీవ విగ్రహాల సరసన నిలచినవాడు సర్దార్ పటేల్! ఆయన సమగ్రతకు విగ్రహం, సమైక్య సంస్కారానికి సజీవ చిహ్నం! నర్మదా సరోవర సమీపంలో ఆవిష్కృతం ఔతున్న ఆయన విగ్రహం అంబరాన్ని చుంబిస్తున్న భారత మాతృ సౌశీల్య పతాకం..
బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశాన్ని రెండు రకాలుగా ‘‘పాలించారు’’. యాబయి ఐదు శాతం భూమి 1947 వరకు వారి ప్రత్యక్ష పాలనలో కొనసాగింది. ఈ భూ భాగంపై దేశంలోని డెబ్బయి నాలుగు శాతం ప్రజలు నివసించారు. ఈ ‘ప్రత్యక్ష పాలన’లోని దేశాన్ని బ్రిటన్ తస్కరులు ‘ప్రాంతాలు’- ప్రావినె్సస్-గా విభజించారు. కొన్ని ‘ప్రాంతాల’కు ‘ప్రెసిడెన్సీ’లని కూడ పేరుపెట్టారు. మిగిలిన నలబయి ఐదు శాతం భూ భాగంలో దేశంలోని ఇరవై శాతం జనం జీవించారు. ఈ నలబయి ఐదు శాతం భూమి దాదాపు ఐదు వందల డెబ్బయి ఐదు చిన్న, పెద్ద ‘సంస్థానాలు’-స్టేట్స్-గా విభక్తమై ఉండేది. ఈ ‘సంస్థానాల’ను ఈ దేశంలో పుట్టిపెరిగిన వారు పాలించారు. వీరందరూ బ్రిటన్ ప్రభుత్వం వారి ‘పరమోన్నత అధికార’- పారవౌంటసీ- పరిధికి లోబడి పెత్తనం సాగించారు. ఈ సంస్థానాలలో మైసూరు, జమ్మూ కశ్మీర్ వంటి అతి పెద్ద ‘సంస్థానాలు’ ఉండేవి. ఒకే గ్రామానికి పరిమితమైన బుల్లిబుల్లి ‘సంస్థానాలు’ కూడ ఉండేవి. ‘హైదరాబాద్’ అతి పెద్ద సంస్థానాలలో ఒకటి! నిష్క్రమించిన బ్రిటన్ ముష్కరులు దేశమంతటా విభజన చిచ్చును రగిల్చిపోయారు. ఆ చిచ్చును చల్లార్చిన సమైక్య భావ పర్జన్యుడు వల్లభుడు.. బ్రిటన్ ప్రభుత్వం చేసిన నిర్ధారణ మేరకు ‘సంస్థానాల’ పాలకులు తమ సంస్థానాలను యథాతథంగా కొనసాగించవచ్చు. ఇందుకుగాను వారు భారత ప్రభుత్వంతో- లేదా పాకిస్తాన్ ప్రాంతంలోని వారు పాకిస్తాన్ ప్రభుత్వంతో- యథాతథ స్థితి- స్టాండ్ స్టిల్- ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి! లేదా ‘సంస్థానాల’ ప్రభువులు తమ సంస్థానాలను భారత్‌లో విలీనం చేయవచ్చు...
ఇది భారతదేశాన్ని దాదాపు ఆరువందల దేశాలుగా విడగొట్టడానికి బ్రిటన్‌వారు పన్నిన విష పన్నాగం! భారతదేశం సమైక్యమయినట్టయితే, భరతమాత మళ్లీ విశ్వగురువుగా విరాజిల్లగలదన్నది బ్రిటన్ మూకల భయం. భారతదేశం ఆర్థికశక్తిగా, ఆయుధ శక్తిగా ఎదగ గలదన్నది వారి భయం. అందువల్లనే పాకిస్తాన్‌ను విడగొట్టి పక్కలో బల్లెంగా మార్చారు. సంస్థానాలు స్వతంత్ర దేశాలుగా మారితే మన దేశం ఎలా ఉండేదన్నది స్పష్టం.. పటేల్ ఈ పన్నాగాన్ని వమ్ముచేశాడు, అపర చాణక్యుని వలె ‘‘సామ దాన భేద దండోపాయాలను’’ ప్రయోగించి 1947 ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి - మూడు తప్ప- సంస్థానాలనన్నింటినీ దేశంలో విలీనం చేయగలిగాడు. జునాగఢ్ సంస్థానంలోని ప్రజలు దేశంలో విలీనం కావాలన్న ఉద్యమం చేశారు. భారత ప్రభుత్వం ఈ ఉద్యమానికి మద్దతునిచ్చింది. ప్రబల సంఘర్షణ తరువాత ‘జునాగఢ్’ జిహాదీల బీభత్సపాలన నుండి విముక్తమైంది. సర్దార్ పటేల్ జమ్మూ కశ్మీర్ సంస్థానం పాలకుడైన హరిసింగ్‌ను కూడ చర్చల తరువాత ఒప్పించగలిగాడు. ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం’ సర్ సంఘ చాలక్- అధ్యక్షుడు- మాధవ సదాశివ గోళ్వల్కర్‌ను పటేల్ జమ్మూ కశ్మీర్‌కు పంపించాడు. గోళ్వల్కర్ హరిసింగ్‌కు నచ్చచెప్పాడు. ఈ కృషి ఫలితంగా 1947 అక్టోబర్ 26న జమ్మూ కశ్మీర్ కూడ దేశంలో విలీనమైంది. హైదరాబాద్ సంస్థానం అధిపతి ‘నిజాం’ పాకిస్తాన్‌తో చర్చలు జరిపాడు, ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయడానికి యత్నించాడు. భారతదేశం మధ్యలో ‘హైదరాబాద్’ను మరో స్వతంత్ర దేశంగా, మరో పాకిస్తాన్‌లాగా రూపొందించ యత్నించాడు. అందువల్ల పోలీసు చర్యను జరిపించడం ద్వారా సర్దార్ పటేల్ ఈ దేశద్రోహపు కుట్రను భగ్నం చేశాడు. 1948 సెప్టెంబర్‌లో హైదరాబాద్ విముక్తమైంది. భారత్ ప్రాదేశిక సమగ్రత సంపూర్ణ రూపం ధరించింది..
పటేల్ త్యాగానికి ప్రతీక, వనంలో పటేల్ ఇంగ్లాండకు వెళ్లి ‘బారిస్టర్’ కావాలని భావించాడు. అనుమతి వచ్చింది. కానీ పటేల్ ఈ అవకాశాన్ని తన అన్న అయిన విఠల్‌భాయ్ పటేల్‌కు కలిగించాడు. విఠల్ భాయి ఇంగ్లాండు వెళ్లి వచ్చేవరకు ఉమ్మడి కుటుంబాన్ని తానే సంరక్షించాడు. అన్న తిరిగి వచ్చిన తరువాతనే వల్లభుడు తాను ‘బారిస్టర్’- న్యాయవాది- పరీక్ష కోసం ఇంగ్లాండు వెళ్లి వచ్చాడు. యదుకుల కృష్ణుడు బలరాముడిని సంభావించినట్టు అన్నను సమ్మానించిన సంస్కార హృదయుడు వల్లభుడు. 1946లో ‘రాజ్యాంగ పరిషత్’ ఏర్పడిన తరువాత సర్దార్ పటేల్ ప్రధానమంత్రి కావాలని ‘్భరత జాతీయ కాంగ్రెస్’లోని అత్యధిక ప్రతినిధులు, ప్రాంతీయ సంఘాల వారు, కార్యకర్తలు తీర్మానం చేశారు. కానీ మహాత్మాగాంధీ మాటను మన్నించి ప్రధానమంత్రి పదవిని- పార్టీ మద్దతు కాని, ప్రజల మద్దతు కాని లేని జవహర్‌లాల్ నెహ్రూకు అప్పగించిన త్యాగశీలి పటేల్.. ‘‘త్యాగము వల్లనే అమృతత్వము సిద్ధిస్తుంది’’ అన్న సనాతన సంస్కారానికి సజీవ ఆకృతి వల్లభ భాయి పటేల్..
నర్మదా నదీ తీరంలో సర్దార్ సరోవర సమీపంలో పటేల్ సమున్నత విగ్రహాన్ని నెలకొల్పడానికి గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయం! ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన ఈ విగ్రహం భారత జాతీయ సమైక్య చిహ్నం.. ప్రాదేశిక సమగ్రతా పరిరక్షణకు నిరంతర ప్రేరకం! భారత ప్రజల అంతరంగానికి శాశ్వత ప్రతిరూపం ఈ ‘సమైక్య విగ్రహం’.