ప్రకాశం

మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, నవంబర్ 15: మహిళలు చేతి వృత్తులపై నైపుణ్యాన్ని పెంపొందించుకుని తద్వారా ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని ఎమ్మెల్యే పోతుల రామారావు అన్నారు. గురువారం పట్టణంలోని 2వ వార్డులో ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనార్టీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టిందన్నారు. మైనార్టీలకు అనుభవం ఉన్న వృత్తిలో స్థిరపడేందుకు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కుట్టుశిక్షణ వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం వార్డులోని టీడీపీ నాయకులు ఎమ్మెల్యే పోతుల రామారావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె ఆదెన్న, వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ షేక్ సలాం, మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ జమీల్‌బాషా, నాయకులు ఉన్నం వీరాస్వామి, చిలకపాటి మధు, రఫీ, వార్డులోని నాయకులు ముసలయ్య, కల్యాణ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
పురపాలకశాఖ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పోతుల రామారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలో జరుగుతున్న పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్ కె అనూష, ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిని త్వరగ పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. పనులు పూర్తికాక గతంలో కూడా నిధులు వెనక్కి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. పనులు చేపట్టని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టి తిరిగి టెండర్లు పిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె ఆదెన్న, నాయకులు ఉన్నం వీరాస్వామి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మెన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.