ప్రకాశం

అగ్రిగోల్డ్ బాధితుల నిరసన ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, నవంబర్ 17 : అగ్రిగోల్డ్ బాధితులు నిరసన ర్యాలీ చేపట్టి అగ్రిగోల్డ్ ఎండి అవ్యారు వెంకటేశ్వర్లు దిష్టి బొమ్మను దగ్థం చేశారు. హాయ్‌లాండ్ ఆస్తి అగ్రిగోల్డ్ గ్రూపునకు చెందినది కాదంటూ ఎండి కోర్టుకు తెలియజేయడంతో అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దర్శి నియోజక వర్గ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ఇప్పటివరకు పెదవి విప్పని ప్రజా ప్రతినిధులా ..వౌనం వీడండి... మా ప్రాణాలను కాపాడండి అంటూ బ్యారన్‌ను ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. నియోజకవర్గంలోని వేలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని, ప్రజా ప్రతినిదులు అగ్రిగోల్డ్ బాధితుల కుటుంబాలను బాధితులుగా కాకపోయినా ఓటర్లుగా గుర్తించాలని మా సమస్యల పరిష్కారానికి మీ మద్దతు తెలియజేయాలని, రేపటి మీ భవిష్యత్తుకు మా మద్దతు కావాలో..వద్దో.. మీరే నిర్ణయించుకోవాలని అగ్రిగోల్డ్ బాధితులు ప్రజా ప్రితినిధులను హెచ్చరిస్తూ నిరసన చేపట్టారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం గడియార స్థంభం సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ఎండి అవ్యారు వెంకటేశ్వర్లు దిష్టి బొమ్మను దగ్థం చేశారు. బెయిల్‌పై బయట తిరుగుతున్న అగ్రిగోల్డ్ యాజమాన్య బెయిల్‌ను రద్దు చేసి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.