కరీంనగర్

కేసీఆర్ గడీల, కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపూర్, నవంబర్ 18: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబ పాలన, గడిల పాలనకు స్వస్తి చెప్పాలని సిపిఐ హుస్నాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అమ్మనగుర్తి, గుండ్లపల్లి, నల్లరామయ్యపల్లి, గొడిశాల, గుజ్జులపల్లి తదితర గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులుగా ఉన్న విద్యార్థులను ఇంకా నిరుద్యోగంలోకి నెట్టి కుటుంబ పాలన నడిపిస్తూ కూతురు కవిత, కుమారుడు కేటిఆర్, అల్లుడు హరీష్ రావులతో తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందన్నారు. కంకి కొడవలి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని, తెలంగాణ అభివృద్ధి మహాకూటమికే సాధ్యమన్నారు. సైదాపూర్ మండలంలో ఇప్పటివరకు ఎన్ని డబుల్ బెడ్ రూంలు నిర్మించారని ప్రశ్నించారు. ఆయనతో పాటు మండల సిపిఐ కార్యదర్శి గుండేటి వాసుపేవ్, నాయకులు బత్తుల బాబు, కల్యాణ్, సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ పాలనలోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
* కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం

గంగాధర, నవంబర్ 18: గత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగి తెలంగాణ ప్రాంత బీడు భూములు సాగులోకి వచ్చాయని చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం మండలంలోని ఒద్యారం, ఆసంపల్లి, గర్షకుర్తి, కాచారం, గోపాలరావుపల్లి, మల్లాపూర్, మంగపేట గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆయన ప్రజలతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగినా చొప్పదండి నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తాను నారాయణపూర్ రిజర్వాయర్ నుండి కరీంనగర్ వరకు పాద యాత్ర చేయడంతోనే నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడంతో చొప్పదండి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ఈ ప్రాంతంలోని అసంపూర్తిగా ఉన్న కాలువల పనులు పూర్తి చేయడంతో పాటు ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడంతో పాటు కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి రూపాయల పింఛన్‌ను రెండు వేలు, 1500 పింఛన్‌ను మూడు వేలు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేయడం జరుగుతుందని ఆయన ప్రజలకు వివరించారు. ప్రచార కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రామిడి రాజిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, ఆయా గ్రామాల ఎంపిటిసిలు పురుమల్ల మనోహర్, చిప్ప లావణ్య-చక్రపాణి, కూనబోయిన సత్తయ్య, భట్టు లక్ష్మినారాయణ, మాజీ ఎంపిపి పడితపల్లి కిషన్, మాజీ జడ్పీటీసీ గునుకొండ బాబు, వైద రామానుజంతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.