శ్రీకృష్ణ లీలారింఛోళి

శ్రీకృష్ణ లీలాఠింఛోళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రూర వరద గోవింద
ఏను కంసుని పనుపున నేగుచుంటి
శౌరి ఏమనునో ? యంచు సంశయించి
కుందుచున్ తన్ను జేరు నక్రూరుగాంచి
కౌగిలించిన వనమాలి కంజలింతు
భావం: శ్రీకృష్ణుణ్ణి ధనుర్యాగానికి ఆహ్వానించి మధురకు తీసుకొని రావలసినదిగా అక్రూరుణ్ణి పంపించాడు కంసుడు. నేను కంసుని పంపున వెళ్లుతున్నాను. నన్ను చూసి శ్రీకృష్ణుడేమంటాడో ఏమో అంటూ పరమభక్తి తో బలరామకృష్ణుల చేరి సేవించిన అక్రూరుని పరమాదరంతో కౌగిలించుకొని ఆదరించాడు శ్రీకృష్ణ పరమాత్మ అట్టి దయాశరధియైన వనమాలికి నమస్సులు.
వేణు మాధవున్ మము వీడి వెడలుమంచు
బ్రహ్మ దయలేక నేరీతి వ్రాసినాడో
పరమ కల్యాణియైన శ్రీ వాణి యైన
చింత జేసియు చెలినైన చెప్పలేదొ
భావం: శ్రీకృష్ణుడు బృందావనాన్ని వీడి మధురకు వెళ్లుతున్నాడనే విషయం గోపికలకు తెలిసింది. శ్రీకృష్ణుని నుండి వియోగాన్ని భరించలేక బ్రహ్మ ఇలా ఎందుకు వ్రాశాడా అని గోపికలు అనుకున్నారట. ఆయన అర్థాంగియైన వాణికూడా చెవిలో నైనా ఎందుకు చెప్పలేదోనని భావించారట.

- డి.వి.ఎమ్. సత్యనారాయణ 9885846949