మహబూబ్‌నగర్

కార్మికులను మభ్యపెడుతున్న టిఎంయు నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, ఏప్రిల్ 19: కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా నామమాత్రపుదీక్షలు, సమావేశాలు చేస్తూ కార్మికులను మభ్యపెడుతున్న టిఎంయు రాష్ట్ర కార్యదర్శి ఆశ్వధామరెడ్డి తన వైఖరి మార్చుకోవాలని ఆర్టిసి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజు రెడ్డి హితవు పలికారు. మంగళవారం టి ఎన్ జి ఓ భవన్‌లో జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సకల జనుల సమ్మెలో కార్మికులకు మేలు జరుగుతుందని నమ్మరని నేడు రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. అక్రమ రవాణ అరికట్టడం వల్ల ఆర్టిసికి రూ.500కోట్లు లాభం చేకూరుతుందని అన్నారు. సీమాంద్ర బస్సులను వెంటనే రద్దు చేయాలని బైపర్‌కేషన్ చేయాలని రిటైర్డు అయిన కార్మికులకు ఏరియల్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఆర్టిసి భవన్ ముందు సమ్మె చేయడం జరుగుతుందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ప్రేమ్‌కుమార్, హైమద్ అలీ, రాఘవరెడ్డి, నారాయణ, జిల్లా కార్యదర్శి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.