Others

మందహాసమే మహాస్త్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లలోకము లొక్క ఇల్లై
వర్ణ్భేదములెల్ల కల్లై
సమాజ హితమే సర్వుల మతమై
విశ్వమానవ కళ్యాణం జరగాలని ఆకాంక్షించినవారిలో అగ్రగణ్యుడు మన గాంధీజీ.
వెన్నపూసామనసు, కన్నతల్లి ప్రేమ, పండండి మోముపై బ్రహ్మ తేజస్సు అను బసవరాజు అప్పారావుగారి వర్ణనలో బాపూజీ గొప్పతనాన్ని తేటతెల్లంజేశారు. ప్రస్తుత ప్రపంచంలో గాంధీజీ పేరు తెలియని ప్రదేశం లేదనుట అతిశయోక్తి కాదు. తన యొక్క విశిష్టమైన ఆలోచనలతో ప్రపంచానికే మార్గదర్శనం చేసిన మహనీయుడు. అట్టి యుగకర్త మన భారతీయుడు కావడం మనకు గర్వకారణం.
సత్యం, అహింసలు ఆయుధాలుగా భారతదేశానికి స్వాతంత్య్రం సముపార్జించుటయేగాక విశ్వ మానవతా వాదాన్ని ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేసిన ఒక అద్భుత శక్తి మన గాంధీజీ. ఉప్పుసత్యాగ్రహమైనా, శాసనోల్లంఘనమైనా, క్విట్ ఇండియా ఉద్యమమైనా ఏదైనా శాంతియుతమే. సర్వులకు అది సమ్మతమే. అందుకే ఆయన జాతిపిత. అందుకే ఆయన శాంతిదూత. అందుకే ఆయన మహాత్ముడైనాడు.
ఎంత పుణ్యంబు చేసెనో ఈ ధరిత్రి బాపూజీకి జన్మనిచ్చి ఎంత సంరంభమందెనో ఈ భరతావని గాంధీజీ తన బిడ్డడని22 అని కవుల వర్ణన ప్రత్యక్షర సత్యమే.
చకచక నడిస్తేను జగతి కంపించేను
పలుకు పలికితేను బ్రహ్మవాక్కేను22- అను వర్ణన గాంధీజీ కర్మవరత్వమును, బ్రహ్మర్షిత్వమును చక్కగా ధ్వనింపజేస్తుంది.
గాంధేయవాదమంటే గాంధీజీ చూపిన మార్గం. సర్వ, శుభలక్షణాల సమ్మిళిత మార్గం. ప్రపంచ శాంతి సాధనకు గాంధేయవాదమే శ్రీరామరక్ష. మద్యం, మగువ, మాంసం ముట్టనని ప్రమాణం చేసి విదేశీ చదువులకు వెళ్లిన గాంధీ ఆ మాటకు కట్టుబడ్డాడంటే అది అతని నిగ్రహశక్తిని విశదపరుస్తుంది.
నేటి ప్రపంచం సంకుచితమయియంది. అవినీతి ఆకాశం అంచులు చేరింది. సత్యం, అహింసా స్థానంలో అసత్యం, హింసలు జోరుగా చెలామణి అవుతున్నాయి. ఆధునిక ప్రపంచంలో మంచి చెడుముందు వెలవెలబోతుంది. 70 సంవత్సరాల స్వాతంత్య్ర భారతం కూడా ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది. అవినీతి, అరాచకాలు, జాతి వైషమ్యాలతో అభివృద్ధి సాధించలేకపోతుంది. ఇక ప్రపంచ దేశాలయితే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే కొరియా దేశాలు, ఇరాన్, పాకిస్తాన్‌లలో నిత్య బాంబుదాడులు, ఎడతెగని పాలస్తీనా, ఇజ్రాయేల్ దేశాల యుద్ధ పోకడలు, భారత్-పాక్‌లమధ్య కాశ్మీరం చిచ్చు, అన్ని దేశాలను గుప్పెట్లో పెట్టుకోవాలన్న అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచం నలుమూలలా సంక్షోభమయమే. పతనవౌతున్న నైతిక విలువలు, ప్రజల సంక్షేమం పట్టని ప్రభుత్వాలు, మద్య, మాంస సేవనంతో అసాంఘిక కార్యకలాపాలు, అకారణ హత్యలు, అత్యాచారాలతో మానవతావాదం నశించిపోతోంది. ప్రపంచం పతనం అంచులకు చేరుకుంది.
ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ప్రపంచానికి వౌనమే నినాదంగా, మందహాసమే మహాస్త్రంగా, సహనమే కవచంగా, శాంతియే ప్రవచనంగా మహాత్ముడు చూపిన బాటను ఆదర్శంగా తీసుకోవలసిన ఆవశ్యకత ఉన్నది.
ప్రస్తుత తరుణంలో 3అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నీ మెలగవలెనోయ్2 అన్న గురజాడ సూక్తి ఆదర్శమవ్వాలి. ప్రతివానిలోను భగవంతుని చూస్తూ సాటివారి పట్ల సానుభూతి కలిగి ఉండటమే వివేకానందుడు మనకు నేర్పిన మానవత. 3మంచి గంధం లాంటి మానవత్వం మనకున్న ఒకే ఒక అలంకారం2 అను భావన ప్రస్ఫుటమవ్వాలి. 3జీవితం కరిగిపోయే మంచు - అందులోని ఆనందం అందరికీ పంచు2 అను సూత్రం మానవాళి అలవర్చుకోవాలి.
జయ గాంధీ దేవా మంగళం జయ మంగళంబునకు సత్యాగ్రహశ్రమతాపసా శాంతి స్వభావ మానసా22- ఈ సకల ప్రపంచం గాంధేయవాదాన్ని అనుసరిస్తూ శాంతి, సామరస్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

-మద్ది పుల్లారావు 9951287113