Others
మార్గళి గీతాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 7 January 2020
తిరుప్పావై మూలానికి తెలుగు
*
- ఆసూరి మరింగంటి శేషగిరాచార్య
8886976760
*
1. పరమాత్ముడు పవళించిన
భవ్యమైన మృదుతల్పము
పంచముఖ గుత్తిదివ్వె
పంచసుగుణ తత్త్వబోధి
2. మదేభపు దంతాలతో
మలచినట్టి సుందరమగు,
కోడులుగల మంచముపై
గోవిందుడు పవళించెను
3. నీళా! నీ వల్లభుడిని
నిమిషమైన వీడవేల?
మాకు గూడ స్వామి తోడ
మాటలాడు సమయమిమ్ము
4. నిన్ను మేము వినుతింతుము
కన్నయ్యను కన్నులార
సేవింతుమని వ్రేతలు
సవినయముగా ప్రార్థించిరి
5. వెంటనే సుఖశయనుండౌ
వేణుగాన లోలునితో,
విన్నపాలు చెప్పుకొనుచు
సన్నుతించి రివ్విధమున.
6. నీరజాక్ష! నీళమ్మయు
నెరిగెను మా మనోరథము,
మాకును మీ దివ్యమైన
మరులుగొలుపు రూపు జూపు.
ఇంకా ఉంది