కరీంనగర్

ముంపు గ్రామాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్గటూరు, జూలై 12: ముంపు పునరావాస కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా తరలివెళ్లమంటే అక్కడికి వెళ్లి ఎలా నివసిస్తామని మంగళవారం ఉండెడ గ్రామాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ శ్రీ దేవసేనను ఉండెడ ముంపు బాధితులు మొరపెట్టుకున్నారు. పునరావాస కాలనీలో రోడ్లు నిర్మించి, విద్యుత్ స్థంభాలు భిగిస్తే వాటిని దొంగలు ఎత్తుకెళ్లారు. పునరావాస కాలనీల్లో పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు తదితర భయంకరంగా పెరిగాయని, ఉన్నఫలంగా వెళ్లమంటే ఎలా నివసిస్తామని జెసిని ప్రశ్నించారు. పెద్దపల్లి ఆర్‌ఢిఓ ముంపు కాలనీకి కనీస సౌకర్యాలు కల్పించలేదని ప్రజలు ఆరోపించారు. సౌకర్యాలు కల్పించడంతో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, అన్ని సౌకర్యాలు కల్పిస్తే మేము వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు. వారం రోజుల్లో పది ప్లాట్లకు సంబంధించిన స్థలాన్ని చదును చేసి ఇండ్లు నిర్మించుకునేలా చేస్తామని, అక్కడే దై ఇఇ అధికారిని పిలిచి పునరావాస కాలనీలో పిచ్చి మొక్కలను తొలగించి కనీస సౌకర్యం కల్పిస్తామని జెసి ఆదేశాలు ఇచ్చారు. ఉండెడ పునరాస కాలనీలో సందర్శించి జెసి స్కూల్‌లో చెట్లు నాటారు. తాళ్లకొత్తపేట, చెగ్యాం, ముక్కట్రావుపేట, కోటిలింగాల ముంపు గ్రామాలకు ముంపు ఉన్నదని, తొందరలో ఖాళీ చేసి పునరావాస కాలనీకి వెళ్లాలని, ఇప్పటికే 142 టిఎంసిల నీరు నిలువ ఉందని, ఇంకా 37 టిఎంసిల నీరు గోదావరిలో చేరుతుందని, వీలైనంత త్వరలోనే గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస కాలనీకి తరలివెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కృష్ణవేణి, వివిధ గ్రామాల సర్పంఛ్‌లు, ఎంపిటిసిలు, గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.