సంపాదకీయం

ఎదురు లేని ఉగ్ర మృగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్‌లోని సముద్ర తీర పట్టణం నైస్‌లో జిహాదీ ఉగ్రవాది గురువారం రాత్రి సృష్టించిన బీభత్సకాండ ఆత్మాహుతి ప్రక్రియ అంతర్జాతీయంగా విస్తరించిపోతుండడానికి మరో పాశవిక సాక్ష్యం. కేవలం ఒక ఉగ్రవాది ఎనబయి నలుగురిని హత్య చేయగలగడం ఆత్మాహుతి జిహాదీ ప్రక్రియ భయంకర స్వభావానికి నిదర్శనం. తమ జాతీయ దినోత్సవ కార్యక్రమాలలో ఆనందంగా నృత్యం చేస్తున్న వారిపై ఈ బీభత్సకారుడు ట్రక్కు-లారీ-తోలి ఢీకొట్టి చంపడం అభూతపూర్వ పాశవిక ఘటన. ఊహించని చోట దూకే తోడేలు వలె జిహాద్ బీభత్సం ఫ్రాన్స్‌లోని మారుమూల పట్టణంలోకి చొరబడిపోవడం ఆశ్చర్యకరం కాదు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలలోను, ఐరోపాలోని ఇతర ప్రాధాన్య ప్రదేశాలలోను గత కొన్ని నెలలుగా చొరబడుతున్న జిహాదీ తోడేళ్ల గురించి ఐరోపా ప్రభుత్వాలు అప్రమత్తంగానే ఉన్నాయి. అందువల్ల ఊహించని చోట జిహాదీ దుండగులు తోడేళ్లవలె దూకుతున్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జూన్ 29న దాడి చేసి నలబయి మందినిపైగా చంపిన జిహాదీ మూకలు ప్రపంచం దృష్టి ఈ ఘటన మీదనుంచి మళ్లక పూర్వమే బంగ్లాదేశ్‌లోకి చొరబడ్డాయి. బంగ్లాదేశ్‌లో జరిగిన బీభత్స కాండ జాకీర్ నాయిక్ అనే ప్రచ్ఛన్న హంతకుని ఉగ్రకృత్యాలను గురించి అంతర్జాతీయ ధ్యాస రగిలించింది. ఈ ముష్కరుని చర్యల గురించి చర్చలు జరిగిపోతుండిన సమయంలోనే మరోసారి బంగ్లాదేశ్‌లో జిహాదీ పిశాచాలు విరుచుకుని పడ్డాయి. మళ్లీ ఇరాక్‌లో పెద్దఎత్తున హింసాగ్ని జ్వాలలు చెలరేగాయి. మన కశ్మీర్ లోయ ప్రాంతంలో సైతం బీభత్స జ్వాలలు చల్లారడం లేదు. జాకిర్ నాయిక్ అనే ముంబయికి చెందిన ముష్కరుడు ఇరాక్ సిరియా మత రాజ్యం-ఐఎస్‌ఐఎస్-ముఠాలో కొత్త జిహాదీలను చేర్పించడంలో నిమగ్నమై ఉన్నాడు. మన దేశంనుండి వందలాది యువకులు అదృశ్యమై విదేశాలలోని ఐఎస్‌ఐఎస్-ఐసిస్-శిబిరాలలో అవతరిస్తున్నట్టు ప్రచారవౌతోంది. సౌదీ అరేబియాలో నక్కి ఉన్న జాకిర్ నాయిక్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వం ఎందుకని అరెస్టు చేయలేదన్న చర్చ కూడ కొనసాగుతోంది. ఇలా దృష్టి మళ్లిన సమయంలో ఫ్రాన్స్‌లోని నైస్‌లో మరోసారి దాడి జరిగిపోయింది. ఈ ప్రసిద్ధిలేని ప్రాంతంలో దుండగులు దాడులు జరుపుతారని ఫ్రాన్స్ ప్రభుత్వం కాని స్థానిక అధికారులు కానీ ఊహించి ఉండకపోవచ్చు! అందువల్ల ప్రసిద్ధ నగరాలలోవలె కట్టుదిట్టమైన భద్రత నెలకొని ఉండకపోవడం సహజం. కానీ దుండగుడు తన వాహనాన్ని రెండు కిలోమీటర్ల మేర జనంమీద నడుపుకుంటూ పోవడాన్ని పోలీసులు నిరోధించలేకపోవడమే విస్మయకరం. దుండగుడు ట్యునీసియా సంతతికి చెందిన ఫ్రాన్స్ పౌరుడేనట.
మధ్యధరా సముద్ర ప్రాంతం ఇలా ఏళ్ల తరబడి బీభత్స బడబానల జ్వాలలకు నిలయమైపోయింది. మధ్యధరా సముద్రం ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలకు మధ్యలో విస్తరించి ఉంది. మధ్యధరా, నల్ల సముద్రాలకు ఆనుకుని దక్షిణంగా విస్తరించి ఉన్న టర్కీ బీభత్స బంధంలో మరోసారి చిక్కుకుని ఉంది. టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్-గతంలో కాన్‌స్టాంట్ నోపుల్-ఆసియా ఐరోపా ఖండాల సంగమ స్థానంలో నెలకొని ఉంది. ఇరాక్ సిరియాలలో పుట్టిపగిలిన ఐఎస్‌ఐఎస్ జిహాదీలు ఉత్తరం విస్తరించి టర్కీలోని పశ్చిమంగా విస్తరించి ఈజిప్టు, లిబియా, ట్యునీసియాలో తిష్ఠవేసింది. మధ్యధరా సముద్రానికి దక్షిణంగా ట్యునీసియా లిబియా ఈజిప్టులు, ఉత్తరంగా ఫ్రాన్స్ ఇటలీలు నెలకొని ఉన్నాయి. అందువల్ల ట్యునీసియా సంతతివారు ఫ్రాన్స్‌లో జీవిస్తున్నారు. ఈ ట్యునీసియా సంతతివారిని ఐఎస్‌ఐఎస్ జిహాదీలుగా తీర్చిదిద్దింది. ఇలా మూడు ఖండాల సంగమ స్థలి అయిన మధ్యధరా సముద్రం జిహాదీలకు నిలయం కావడం శతాబ్దుల పూర్వం నాటి చరిత్రకు పునరావృత్తి! జిహాదీ బీభత్స కాండకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమరం ఆరంభం కాలేదు, ఈ ఉగ్రవాదం మాత్రం ఈ మూడు ఖండాలకు మాత్రమే కాక అమెరికా ఖండానికి కూడ విస్తరించడం ద్వారా అంతర్జాతీయ సమగ్ర వికృత రూపాన్ని సంతరించుకోగలిగింది.
ప్రాచీన నాగరికతలను సంస్కృతులను జాతులను ధ్వంసం చేసిన జిహాద్ క్రీస్తుశకం ఏడవ శతాబ్ది చివరినుంచి కొనసాగుతోంది. ఇస్లామేతర మతాలవారిని హతమారుస్తునే ఉంది. ఈ హత్యాకాండకు ఫ్రాన్స్‌లోని నైస్‌లో జరిగిన పాశవిక కాండ కొనసాగింపు మాత్రమే! మధ్యధరా సముద్రం శతాబ్దుల జిహాదీ పాశవిక కాండకు కొనసాగుతున్న సాక్ష్యం. ప్రాచీన పారశీక సంస్కృతిని క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్దిలో గ్రీకులు విధ్వంసం చేయడానికి కేంద్ర బిందువు కాన్‌స్టాంట్‌నోపెల్. బైజాంటియమ్ అన్న ప్రాచీన నామం కాన్‌స్టాంట్ నోపెల్‌గా మారడం విధ్వంస చరిత్రలో భాగం. గ్రీకు నాగరికతను ధ్వంసం చేసిన రోమన్లు ఇలా పేరు మార్చారు. బయజాంటీయ సామ్రాజ్యాన్ని 1453లో తురష్కులు ధ్వంసం చేయడం నగరం పేరును ఇస్తాంబుల్‌గా మార్చడం జిహాదీ చరిత్రలో భాగం! ఐఎస్‌ఐఎస్ ఈ చరిత్రను పునరావృత్తం చేస్తోంది. మధ్యధరా ప్రాంతం మరోసారి రక్తసిక్తం అవుతోంది. అరబ్ ఉప్పెన-అరబ్ స్ప్రింగ్ పేరుతో వివిధ పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలలో నియంతలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చెలరేగాయి. యెమెన్ ఈజిప్టు లిబియా ట్యునీసియాలలో నియంతలను జనం తొలగించారు. కానీ సిరియాలో మాత్రం విప్లవం విజయం సాధించలేదు. చైనా, రష్యా ప్రభుత్వాలు సిరియాలోని నియంతృత్వ వ్యవస్థను సమర్ధించడమే ఇందుకు కారణం. ఫలితంగా ఏళ్ల తరబడి సిరియాలో ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటుదారులకు మధ్య యుద్ధం సాగుతూనే ఉంది. ఇలా కల్లోల గ్రస్తమై ఉన్న సిరియాలోకి ఇరాక్‌నుండి ఐఎస్‌ఐఎస్ చొరబడింది. అక్కడినుండి టర్కీకి, ఐరోపాకు ఐఎస్‌ఐఎస్ వ్యాపించడానికి సిరియా అంతర్యుద్ధం ప్రధాన కారణం. నియంతృత్వ సిరియా ప్రభుత్వాన్ని సమర్ధించినందుకు రష్యా ప్రభుత్వం తరువాత నాలుక కరుచుకుంది. చైనా ప్రభుత్వం నాలుక కరుచుకోవడంలేదు. అంతర్జాతీయ జిహాదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమరం జరగకపోవడానికి ఇది ఒక కారణం ..
మరో ప్రధాన కారణం అంతర్జాతీయ జిహాదీ బీభత్స కాండకు సైద్ధాంతిక జన్మస్థానమైన సౌదీ అరేబియా ఆడుతున్న నాటకం! 2011లో ప్రజల తిరుగుబాటునుంచి తప్పించుకుని దేశంనుండి పారిపోయిన ట్యునీసియా అధ్యక్షుడు జినే అల్‌బితనే బెన్ అలీ ఒకటిన్నర టన్నుల బంగారాన్ని మోసుకుని సౌదీ అరేబియాకు చేరాడు. ఇప్పుడు మన దేశంనుండి పారిపోయిన జాకిర్ నాయిక్ సౌదీ అరేబియాలో భద్రంగా ఉన్నాడు. సౌదీ అరేబియా మనకు మిత్రదేశం, అంతకంటె అమెరికాకు మరింత గొప్ప మిత్రదేశం. అయినప్పటికీ జాకిర్ నాయిక్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వం అరెస్టు చేయదు. అమెరికాపై దాడులు జరిపించిన ఒసామా బిన్ లాడెన్‌ను, అల్ ఖాయిదా ముఠాను పెంచి పోషించింది సౌదీ అరేబియాలోని సంపన్నులు...2001లో అమెరికాపై అల్‌ఖాయిదా జరిపిన దాడికి సౌదీ అరేబియా సహకారం ఉందన్నది అమెరికా కాంగ్రెస్ ఇటీవల చేసిన నిర్ధారణ. అయితే ఈ విషయమై తమను వేధిస్తే తమ దేశంలోని దాదాపు యాబయి లక్షల కోట్ల రూపాయల విలువైన అమెరికన్ల ఆస్తులను జప్తు చేస్తామని అమ్మేస్తామని సౌదీ పాలకులు అమెరికాను బెదిరించారు. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు ఎవరు చేయాలి?