మహబూబ్‌నగర్

జిల్లాల చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, అక్టోబర్ 1: రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ముసాయిదా ప్రకటించి వాటికి సంబందించిన అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియకు స్వీకారం చుట్టినప్పటి నుండి జిల్లాలో గద్వాల జిల్లా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆందోళన బాటపట్టారు. గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలని గద్వాల జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయని ప్రజలతో కలిసి జిల్లా సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం మొదలై కాంగ్రెస్ వర్సెస్ టిఆర్‌ఎస్ అనే విధంగా రాజకీయ మాటల వేడి పుట్టింది. కాగా గద్వాల జిల్లా సాధన కోసం ఎమ్మెల్యే డికె అరుణ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. శనివారం హైదరాబాద్‌లో గాంధీభవన్ వేదికగా గద్వాల జిల్లా ఎర్పాటు చేసేందుకు తన ఎమ్మెల్యే పదవి అడ్డంకిగా ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్యే డికె అరుణ తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ద్వారా స్పీకర్‌కు అందేలా రాజీనామా చేశారు. దాంతో ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. జిల్లాలో ఎవరినోట విన్న డికె అరుణ రాజీనామా అస్త్రంపైనే జోరుగా చర్చ. అయితే రాజీనామా చేస్తున్నట్లు ఆమే ప్రకటించిన నేపథ్యంలో గద్వాలలో జెఎసి నాయకులు డికె అరుణ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే డికె అరుణ రాజీనామా ఓ డ్రామా అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు టిఆర్‌ఎస్ నాయకులు మహబూబ్‌నగర్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు ఆరోపించారు. ఇందుకు ధీటుగా కాంగ్రెస్ నాయకులు సైతం టిఆర్‌ఎస్ నాయకుల వాఖ్యలపై మండిపడ్డారు. అయితే గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ మాత్రం గద్వాల జిల్లా కావాలంటూ రాజీనామా అస్త్రం ప్రయోగించడంతో తెరాస నాయకులు ఇరకాటంలో పడ్డారు. ప్రభుత్వం ఇప్పటికే వనపర్తి జిల్లాపై అంతా కసరత్తు చేస్తున్న నేపథ్యంలో డికె అరుణ రాజీనామా రాజకీయ దూమారాన్ని లేపింది. ప్రతిపాదిత వనపర్తి జిల్లాలో తమను కలపొదంటూ గద్వాల వాసులు ఆందోళన బాటపట్టి గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలంటూ రోడ్లపైకి జనం రావడంతో ఉద్యమం ఉద్ధృతమైంది. అయితే మొదటి నుండి ఎమ్మెల్యే డికె అరుణ మాత్రం గద్వాల జిల్లా చేయాలంటూ బీచ్‌పల్లి ఆంజనేయస్వామి దేవాలయం యజ్ఞం నిర్వహించడమే కాకుండా అలంపూరు నుండి యాత్రను నిర్వహించి ప్రజల్లో గద్వాల జిల్లా కోసం మరింత తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. గద్వాలలో గత నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు గద్వాల బంద్ జరిగింది. మూడు రోజుల బంద్ గద్వాల చర్రితలోనే నిలిచిపోయింది. అయితే గత రెండు మూడురోజుల నుండి మాత్రం టిర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం మొదలుకావడంతో ఎమ్మెల్యే డికె అరుణ ఓ అడుగుముందకు వేసి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడంతో టిఆర్‌ఎస్ నాయకులు ఇరకాటంలో పడ్డారని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. ఏదిఏమైనా గద్వాల జిల్లా కోసం జరుగుతున్న ఆందోళనలు, రాజీనామా అస్త్రాలు రాజకీయ దూమారం రేపింది.

పాలమూరు-రంగారెడ్డి
ఎత్తిపోతలకు అడ్డుపడొద్దు
* కలెక్టర్ శ్రీదేవి
కొల్లాపూర్, అక్టోబర్ 1: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు అడ్డుపడవద్దని కలెక్టర్ శ్రీదేవి రైతులను కోరారు. శనివారం మండలంలోని ఎల్లూరు పంచాయతీ పరిధిలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపుహౌస్, అంజనగిరి, బోడబండ, సున్నపుతండా, నార్లాపూర్ తదితర గ్రామాల మీదుగా పిఆర్‌ఎల్‌ఐ పథకం పనులను కలెక్టర్ శ్రీదేవి పరిశీలించారు. ఆయా గ్రామాల రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం న్యాయపరంగా నష్టపరిహారం ఇస్తుందని, వివాదాల కారణంగా ఆగిపోయిన వాటిని కూడా త్వరలో పరిష్కరించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంజనీరింగ్, రెవెన్యూ, అటవీ, కాంట్రాక్టు ఏజెన్సీల సమన్వయంతో పనులు వేగవంతంగా చేయాలని కోరారు. ఆయా శాఖల మధ్య అవగాహనలేక పనులు ఆలస్యంగా జరగడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు కలెక్టర్‌తో మాట్లాడుతూ రికార్డుపరంగా ఉన్న భూములకంటే పొరంబోకు భూములను సాగు చేసుకుంటున్నామని, అట్టి భూములకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. కలెక్టర్ వెంట డిఎఫ్‌ఒ పద్మజారాణి, ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, రేంజర్ కృష్ణయ్య, ఇఇ విజయ్‌కుమార్, దేవిప్రవీణ్, తహశీల్దార్ పార్థసారథి తదితరులు ఉన్నారు. అనంతరం పట్టణంలోని కెఎల్‌ఐ అతిథిగృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.