S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలెక్టర్ సుడిగాలి పర్యటన

చోడవరం, సెప్టెంబర్ 24: జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం మండలంలో సుడిగాలి పర్యటన జరిపి వరద ధాటికి కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డు, కల్వర్టులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలను పరిశీలించి అక్కడి పరిస్థితులపై ఆరాతీశారు. ఉపాధ్యాయులు, గ్రామరెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గవరవరం, వెంకన్నపాలెం గ్రామాల్లోని పారిశుద్ధ్యం లోపించడం, ఎక్కడికక్కడ చెత్తాచెదారాలు దర్శనమివ్వడం, రోడ్లపై నీరు నిలిచి ఉండటంతో ఆయా సిబ్బంది పనితీరు పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసారు.

మేయర్ పీఠం కోసం పార్టీల వ్యూహాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 24: జివిఎంసి ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలోగా ఎన్నికల తంతు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు జివిఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అంతర్గత కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని వైకాపా అధినేత జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలను ఆదేశించారు. అంతేకాదు., జివిఎంసిలో జెండా పాతేయడానికి టిడిపి, వైకాపాలు అంతర్గత వ్యూహాలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి.

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోలేరా?

చోడవరం, సెప్టెంబర్ 24: జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ శనివారం మండలంలోని వివిధ పాఠశాలలను, గవరవరం పిహెచ్‌సిని సందర్సించారు. వైద్య, ఉపాధ్యాయ సిబ్బంది పనితీరు పట్ల అసహనం వ్యక్తంచేశారు. ప్రధానంగా వెంకన్నపాలెం, గవరవరం ప్రాథమిక పాఠశాలల్లో లోపించిన పారిశుద్ధ్యంపై ఆయన సంబంధిత ఉపాధ్యాయ సిబ్బందిని నిలదీశారు. ప్రస్తుతం వర్షాల సీజన్ కావడంతో జిల్లా వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు నిర్వహిస్తున్నప్పటికీ పాఠశాలలకు సమీపంలోనే చెత్తాచెదారాలు పేరుకుపోవడం,పాఠశాలల్లో తుప్పలను తొలగించకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

రోగులను భయబ్రాంతులకు గురి చేయొద్దు

రావికమతం, సెప్టెంబర్ 24: వ్యాధి నిర్ధారణ కాకుండా డెంగ్యూ జ్వరమని రోగులను భయబ్రాంతులకు గురి చేసే వైద్యులు, మెడికల్ ల్యాబ్‌లపై చర్యలు తప్పవని డి. ఎం. అండ్.హెచ్. ఓ.జి.సరోజిని హెచ్చరించారు. మండలంలో రావికమతం, గర్నికం గ్రామాల్లో డెంగ్యూ జ్వరం సోకి నయం అయిన వారి ఇళ్ళకు డి.ఎం.అండ్.హెచ్. ఓ. శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పగటిపూట కుట్టే ఎలీషియా దోమ వలన డెంగ్యూ సోకుతుందన్నారు. ఈదోమలు నిల్వ ఉన్న నీటిలో నివశిస్తాయన్నారు. ఈదృస్ట్యా ప్రతీ ఇంట్లోనూ పాత్రలు, బకెట్లు, సీసాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పలకాలన్నారు.

మేయర్ పీఠం కోసం పార్టీల వ్యూహాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 24: జివిఎంసి ఎన్నికలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలోగా ఎన్నికల తంతు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు జివిఎంసి ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అంతర్గత కసరత్తు మొదలుపెట్టాయి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని వైకాపా అధినేత జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ వర్గాలను ఆదేశించారు. అంతేకాదు., జివిఎంసిలో జెండా పాతేయడానికి టిడిపి, వైకాపాలు అంతర్గత వ్యూహాలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి.

దోమలపై దండయాత్ర: కలెక్టర్

నరసన్నపేట, సెప్టెంబర్ 24: దోమల నివారణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు అయితే పరిశుభ్రత పాటించగలిగితే దోమలపై దండయాత్ర చేసినట్టే అని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. శనివారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన దోమలపై దండయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయని వాటిని నాశనం చేసే అధికారం ఏ ఒక్కరికీ లేదని వివరించారు.

శ్రీసిటీని సందర్శించిన ఆధార్ చైర్మన్

తడ, సెప్టెంబర్ 24: ఆధార్ వ్యవస్థ పర్యవేక్షణ సాధికార సంస్థ యూనిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎ సత్యనారాయణ శనివారం శ్రీసిటీని సందర్శించారు. ఈయనకు శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికి శ్రీసిటి వద్ద వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతి గురించి వివరించారు. అనంతరం చైర్మన్ సత్యనారాయణ శ్రీసిటీలోని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసిటీ ఓ ఆద్భుతమైన ప్రాజెక్టు అని అన్నారు. శ్రీసిటీ అభివృద్ధికి కృషి చేస్తున్న వారిని ప్రశంసించారు. మేకిన్ ఇండియా సాధించే దిశగా ప్రతిబింబించేలా శ్రీసిటీలో అన్ని వసతులున్నాయన్నారు.

ఆరోగ్యకర సమాజం నిర్మిద్దాం

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 24:ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో భాగంగా ప్రతిఒక్కరూ తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు దోమల నిర్మూలనలో భాగస్వాములు కావాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత’లో భాగంగా శనివారం నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులతో కలెక్టరేట్ నుంచి డిఎస్‌ఎ స్టేడియం వరకూ భారీ ర్యాలీ చేపట్టి, అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహించారు.

అప్రమత్తం

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 24: ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక టిటిడిసిలో జిల్లాలో కురిసిన అకాల వర్షాల వల్ల ఏర్పడిన నష్టంపై కలెక్టర్ లోకేష్‌కుమార్‌తోపాటు అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ వర్షాల వల్ల మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఏ ఒక్కరు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళరాదన్నారు. వర్షాల వల్ల ఏర్పడిన తాత్కాలిక ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం

అమరావతి, సెప్టెంబర్ 24: అల్పపీడన ప్రభావంతో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సాయంత్రం పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలోని క్రోసూరు, అమరావతి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. క్రోసూరు మండలంలోని పీసపాడు వద్ద పొలాలను ముంచెత్తిన వాగును, అందుకూరు వాగులను పరిశీలించారు. అలాగే క్రోసూరు నుండి మార్గమధ్యలో విప్పర్ల, విప్పర్ల, ఊటుకూరు, బయ్యవరం వాగులను రోడ్‌షో ద్వారా పరిశీలించి పంటనష్టాన్ని పరిశీలించారు.

Pages