S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరొకరి నిష్క్రమణ

కాటమరాయుడంటే మాటలా? కోపం వస్తే ఎవరికైనా కాటు తప్పన్నట్లుగా సాగుతోంది కాటమరాయుడు సినిమా పరిస్థితి. తాజాగా ఈ సినిమా యూనిట్ నుండి మరొకరికి కాటమరాయుడు దెబ్బపడిందని టాలీవుడ్ భోగట్టా. తొలుత ఈ చిత్రానికి దర్శకుడు ఎస్.జె.సూర్యను అనుకున్నారు. అనుకోకుండా తమిళంలో వచ్చిన భారీ ఆఫర్లతో ఆయన పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాత కిషోర్ పార్థసాని (డాలీ) రంగంపైకి వచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. పవన్‌కల్యాణ్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేస్తున్న సౌందర్యరాజన్ పక్కకు తప్పుకున్నారు.

తరుణ్ లవ్‌స్టోరీ

తరుణ్, ఓవియా జంటగా రామ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రమేష్ గోపి దర్శకత్వంలో ఎస్.వి.ప్రకాష్ రూపొందిస్తున్న చిత్రం ‘ఇది నా లవ్‌స్టోరీ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలుపుతూ లడక్, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని, మూడు పాత్రలలో తరుణ్ నటన ఈ చిత్రానికి ప్రాణంగా నిలుస్తుందని అన్నారు. లవర్ బాయ్‌గా తరుణ్‌కు ఉన్న ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా ఓ అందమైన ప్రేమకథను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా రూపొందించామని అన్నారు.

సునీల్ గోల్డే!

సునీల్, సుష్మారాజ్, రీచాపనయ్ ప్రధాన తారాగణంగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వీరు పోట్ల దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర రూపొందిస్తున్న చిత్రం ‘ఈడు గోల్డ్‌ఎహే’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని, వచ్చేనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలోని పాటలను ఒక్కొక్క పట్నంలో ఒక్కొక్క పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ.. మణిశర్మ తనయుడు సాగర్ ఎం.శర్మ ఈ చిత్రానికి మంచి బాణీలను అందించారని, ఈ ఆల్బమ్‌లోని తొలి పాటను ఈనెల 21న హైదరాబాద్‌లో విడుదల చేశామన్నారు.

క్వాంటికో-2 ప్రచారంలో ప్రియాంక

అమెరికాలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘క్వాంటికొ’ 2 సీజన్ ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బిజీగా ఉంది. ఈ సీరియల్‌లో ప్రియాంక కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది తొలి సిరీస్‌లో నటించి మెప్పించిన ప్రియాంక రెండో సీజన్‌లోనూ నటించింది. ప్రస్తుతం అమెరికాలో తోటి నటుడు బ్లెయిర్ అండర్‌వుడ్‌తో కలసి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. కాగా ఆమె ఈనెల 26న భారత్‌లో క్వాంటికో-2 ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. క్వాంటికోతో అమెరికన్ సినీ ప్రపంచానికి పరిచయమైన ప్రియాంక ‘బేవాచ్’ సినిమాలో నటిస్తూ హాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది.

సుడిగాలిలో దెయ్యం

వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, ప్రాచీ అధికారి, కులకర్ణి మమత ప్రధాన తారాగణంగా శివపార్వతి క్రియేషన్స్ పతాకంపై రమేష్ అంకం దర్శకత్వంలో చెట్టిపల్లి వెంకటేష్ గౌడ్, బిరాధర్ మల్లేష్ యాదవ్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం సుడిగాలి. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. దర్శకుడు సుడిగాలి చిత్ర కథను చక్కగా రాసుకున్నారని, కథకు తగిన విధంగానే టైటిల్‌ను ఖరారు చేశామని అన్నారు. ఆర్టిస్టులందరూ కొత్తవాళ్లైనా చక్కగా నటిస్తున్నారని, చిన్న సినిమాగా రూపొందిస్తున్నా పెద్ద అంచనాలు చిత్రంపై ఉన్నాయని తెలిపారు.

ముక్కోణపు ప్రేమలో డాన్

సుబ్బు కథానాయకుడిగా అభి సుబ్రహ్మణ్యం క్రియేషన్స్ పతాకంపై శ్రీకృష్ణ గొర్లె దర్శకత్వంలో శివపురం సురేంద్రకుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘రజని ద డాన్’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఏ సంబంధం లేని హీరోకి అనుకోకుండా ఓ బంధం ఏర్పడితే అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. ఆ పరిణామాలు ఎలా సాగాయి అన్న కథనంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందిస్తున్నామని తెలిపారు.

బ్రహ్మాండ నాయకుడు బాబా

గురుసాయిబాబా ఇంటర్నేషనల్ పతాకంపై మిలింద్ గునాజీ సాయిబాబాగా నటించిన చిత్రం ‘బ్రహ్మాండ నాయక్ సాయిబాబా’. సత్యప్రకాష్ దూబె దర్శకత్వంలో నార్సింగ్ ఎం.షిండే, సత్యప్రకాష్ దూబె తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి, హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సత్యప్రకాష్ దూబె మాట్లాడుతూ, శ్రీ షిరిడీ సాయిబాబా మహిమల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం సాయిబాబా మీద భక్తితో రూపొందించానని, ప్రస్తుత యువతరానికి ఆయన మహిమలను తెలియజేయడమే ఈ చిత్రంలో ప్రధాన ఇతివృత్తమని ఆయన అన్నారు.

కాశ్మీర్ ఎన్నటికీ మాదే : అమిత్‌షా

కోజికోడ్:కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లోనే ఉంటుందని, తమనుండి ఆ ప్రాంతాన్ని ఎవరూ విడదీయలేరని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. కాశ్మీర్‌పై ఎవరు కలలుగన్నా అవి కల్లలే అవుతాయన్నారు. ఉరీ సంఘటనకు పాల్పడిన ఉగ్రవాదుల మూకను పెంచి పోషించినది పాకిస్తానేనని సూటిగా విమర్శించారు. ఉరీ సంఘటనకు బాధ్యులైన వారికి బుద్ధి చెప్పాల్సిందేనని అన్నారు. ఈ మేరకు బిజెపి తీర్మానం ఆమోదించింది. బిజెపి నేత దీన్‌దయార్ శతజయంతి సందర్భంగా కోజికోడ్‌లో జరుగుతున్న సమావేశాల ముగింపు కార్యక్రమంలో అమిత్‌షా మాట్లాడారు.

సైన్యం సత్తా చూపిస్తాం

న్యూఢిల్లి:కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లను దేశం మరచిపోదని, దాడులకు పాల్పడినవారిని వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆదివారం మన్‌కీబాత్‌లో భాగంగా రేడియోలో ఆయన ఉరీ సంఘటనపై మాట్లాడారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్నవారిపై సైన్యం తగిన సమయంలో జవాబు చెబుతుందని, సత్తా చాటుతుందని, మన సైన్యం తెగువపై అందరూ నమ్మకముంచాలని ఆయన పిలుపునిచ్చారు.

మిడ్‌మానేరు కట్టకు ప్రమాదం

కరీంనగర్:జిల్లాలోని జలకళతో ఉట్టిపడుతున్న మిడ్‌మానేరు ప్రాజెక్టు కట్ట కోతకు గురవడంతో అందరూ భయం గుప్పిట్లో చిక్కుకున్నారు. రుద్రవరం, కుదురుపాక, కందికట్కూరు ప్రాంతాలకు ముప్పు ఏర్పడటంతో అధికారులు వెంటనే స్పందించి కట్ట కోతకు గురవుతున్న చోట ఇసుకబస్తాలతో అడ్డుకట్ట వేస్తున్నారు.

Pages