S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

28వ డివిజన్‌లో దోమలపై యుద్ధం

పాతబస్తీ, సెప్టెంబర్ 24: దోమలపై యుద్ధం - పరిసరాల పరిశుభ్రత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు 28వ డివిజన్ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ఆధ్వర్యంలో స్థానిక భవానీపురం మోడల్ రైతుబజార్‌లో శానిటేషన్ సిబ్బందితో కలిసి అక్కడ నిలిచిన వర్షపు నీరు, చెత్త చెదారం శనివారం తొలగించారు. వనం - మనం కార్యక్రమంలో భాగంగా రైతుబజార్ రహదారి వెంట మొక్కలు నాటటం జరిగింది. దోమల నివారణకై స్థానిక హెచ్‌బి కాలనీ శ్రీ మోహన్‌లాల్ చంద్ర బాషూ సాబూ మెమోరియల్ మున్సిపల్ స్కూల్ పిల్లలు, ఉపాధ్యాయులతో కలిసి హెచ్‌బి కాలనీ ప్రాంతంలో నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

సాయినాథునికి రంగవల్లులతో దీపాలంకరణ

విజయవాడ, సెప్టెంబర్ 24: సాయిపథం (షిరిడి) నిర్వహణలో సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్, సద్గురు సాయినాథుని శరత్‌బాబుజీ ఆశీస్సులతో గవర్నర్‌పేట, ఐవి ప్యాలెస్‌లో జరుగుతున్న సాయిబాబా ద్వితీయ నామ సప్తాహ మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. శనివారం సాయంత్రం సాయిబాబా భక్తులు రంగవల్లుతో సాయినాథునికి దీపాలంకరణ చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఎంబిఎ విద్యార్థి మృతి

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 24: రోడ్డు ప్రమాదంలో యాష్ లారీ ఢీకొని ఎంబిఎ విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం నిమ్రా కాలేజీ ఎదురుగా జరిగింది. పోలీసుల కథనం ప్రకారం నోవా ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబిఎ రెండవ సంవత్సరం చదువుతున్న భూభత్తుల రమేష్ (23) చాట్రాయి మండలం చీపురగూడెం గ్రామానికి చెందిన విద్యార్థి కాలేజీ నుంచి ఇబ్రహీంపట్నం వస్తుండగా నిమ్రా ఇంజనీరింగ్ గేటు ఎదుట బూడిద చెరువు నుండి బూడిద ఎగుమతి చేసుకుని వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. శవాన్ని శవపరీక్షకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దోమలపై దండయాత్ర

పటమట, సెప్టెంబర్ 24: పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఎమ్మెల్యే గద్దె అన్నారు. 12వ డివిజన్‌లో దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రతపై శనివారం జరిగిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుదల, ఔట్ ఫాల్ డ్రైయిన్లు, సైడ్ డ్రైయిన్లలో పూడికలను తొలిగించి, మురుగునీరు సక్రమంగా పారేందుకు కృషి చేయాలని అన్నారు. డ్రైయిన్లలో చెత్తా చెదారం వేయకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొత్త రమాదేవి, ముమ్మనేని ప్రసాద్, చలసాని రమణ తదితరులు పాల్గొన్నారు.

చంద్రయ్య కాల్వలో యువకుడి గల్లంతు

గుడివాడ, సెప్టెంబర్ 24: ప్రమాదవశాత్తూ చంద్రయ్య కాల్వలో పడి యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పెదఎరుకపాడు వార్పు రోడ్డులో ఉంటున్న పఠాన్ బిస్మిలా ల(23) తాపీ కార్మికుడిగా పనిచేస్తున్నా డు. శుక్రవారం రాత్రి కార్మికనగర్లోని తల్లిదండ్రులు పఠాన్ మరదసా, నజీమాల ఇంటికి వచ్చి వెళ్తూ స్నేహితుడితో కలిసి చంద్రయ్య కాల్వ వద్ద మాట్లాడుతున్నాడు. ప్రమాదవశాత్తూ కాలు జారిన బిస్మిల్లా కాల్వలో పడిపోయాడు. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో బిస్మిల్లా కొట్టుకుపోయాడు. స్నేహితుడు శ్రీకాంత్ కాల్వలోకి దూకి రక్షించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు.

అన్నీ అనుమానాలే..!

మచిలీపట్నం, సెప్టెంబర్ 24: బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌పై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. భూములిచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మెరుగ్గా ఉన్నప్పటికీ అది అసలైన రైతులకు అందుతుందా? లేదా? అనేది సందేహాస్పదంగా మారింది. బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ ఏర్పాటుకు 33వేల 327 ఎకరాల భూములను సమీకరించేందుకు ఐదురోజుల క్రితం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) అధికారులు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో నోటిఫికేషన్ ప్రతులు పెట్టారు.

ప్రజల భాగస్వామ్యంతోనే దోమల నిర్మూలన సాధ్యం

మచిలీపట్నం, సెప్టెంబర్ 24: ప్రజల భాగస్వామ్యంతోనే దోమలను నిర్మూలించగలమని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘వనం-మనం’ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ ప్రధాన పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో దోమల వల్ల వచ్చే వ్యాధులను అరికట్టగలమన్నారు. దోమల వల్ల వచ్చే వ్యాధులపై ప్రజలు అవగాహన పొందాలన్నారు. అప్పుడే వాటిని ఎదుర్కోగలమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు దోమల నివారణపై ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.

నాలుగు కాళ్ల కోడిపిల్ల!

కలిదిండి, సెప్టెంబర్ 24: కలిదిండిలో నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపిల్ల అందరినీ ఆకట్టుకుంటోంది. కోడిపిల్లకు నాలుగు కాళ్లు ఉండటం దసరా మహోత్సవాలకు శుభసూచకమని కొందరు అంటుంటే.. అబ్బెబ్బే ఇది అశుభమని మరికొందరు పెదవి విరుస్తున్నారు. నీళ్లులేక జన్యు సంబంధ లోపం వల్ల ఇలా జరిగి వుంటుందని నిపుణులు చెపుతు న్నారు. ఏదిఏమైనా కోడిపిల్లకు నాలు గు కాళ్లుండటాన్ని అంతా విచిత్రంగా చూస్తున్నారు. దీనిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

రొయ్యల ఫ్యాక్టరీ వ్యర్థాలపై రైతుల ఆందోళన

కృత్తివెన్ను, సెప్టెంబర్ 24: మండల పరిధిలోని చెరుకుమిల్లి వ్యవసాయ భూముల్లో ఇటీవల నిర్మించిన రొయ్యల ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న వ్యర్థాల కారణంగా పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని మునిపెడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు శనివారం 216ఎ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ నుండి రొయ్యలను కడిగిన నీటిని వ్యవసాయ డ్రైన్‌లో విడుదల చేయటంతో పంట పొలాల్లో సారం తగ్గి దిగుబడులపై గణనీయమైన ప్రభావం చూపుతోందన్నారు. గతంలో అనేకసార్లు ఈ సమస్యపై ఆందోళనకు దిగినా పట్టించుకున్న నాథులే కరవయ్యారని విమర్శించారు. అలాగే దోమలు విపరీతంగా పెరిగిపోవటంతో విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఏర్పడిందన్నారు.

నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

అవనిగడ్డ, సెప్టెంబర్ 24: కృష్ణానదికి వరద వస్తున్నందున నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ ఆసియా నాయక్ సూచించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి కృష్ణానదిలోకి లక్షా 40వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారని, పులిగడ్డ అక్విడక్టుకు ఇప్పటికే వరద నీరు చేరిందన్నారు. కృష్ణా నదీ గర్భంలోని ఎడ్లలంక గ్రామానికి వెళ్ళిన తహశీల్దార్ అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. మండలంలోని పులిగడ్డ, దక్షిణ చిరువోల్లంక, వేకనూరు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నదిలో సగానికి పైగా వరద నీరు చేరినందున పుష్కర ఘాట్ల వద్దకు వెళ్ళవద్దని కోరారు.

Pages