S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చ చొక్కాలకే సంక్షేమ పథకాలు పరిమితం!

విజయనగరం, ఆగస్టు 30: రెండేళ్ల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పచ్చచొక్కాలకే పరిమితం అవుతున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో ప్రజలకు లెక్కకు మించి హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా ప్రజలను దగా చేశారని విమర్శించారు. విజయనగరం పట్టణంలోని తోటపాలెం బాలాజీనగర్‌లో నిర్మించే జిల్లా కాంగ్రెస్ కార్యాలయ భవనానికి ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి

విజయనగరం, ఆగస్టు 30: జిల్లాలోని గిరిజన, మైదాన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ మృణాళిని జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి మలేరియా వ్యాధి నియంత్రణపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని తెలిపారు. మంగళవారం ఆనందగజపతి ఆటోరియంలో వైద్యఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, బిసి, ఎస్టీ, ఎస్సీ సంక్షేమశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మృణాళిని మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, డయేరియా సీజనల్ వ్యాధుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

జిల్లా పోలీసులను సన్మానించిన ఒడిశా పోలీసు అధికారులు

విజయనగరం, ఆగస్టు 30: ఒడిశా రాష్ట్రంలో కార్మిక శాఖకు చెందిన ఇఎస్‌ఐ విభాగంలో కోట్లాది రూపాయల కుంభకోణంలో నిందితుడైన అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మోతీలాల్‌గౌడ్ అరెస్టులో సహకరించిన జిల్లా పోలీసు అధికారులను, సిబ్బందిని ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేసి సన్మానించారు. తప్పించుకుని తిరుగుతున్న మోతీలాల్ గౌడ్ విజయనగరం జిల్లాలో ఉన్నట్లు సమాచారం అందడంతో ఇటీవల ఒడిశా ఆర్థిక నేరనిరోధక విభాగం ఐజి అరుణ్ బోత్రా నాయకత్వంలో పోలీసు బృందం విజయనగరానికి వచ్చింది.

మా లాయర్ చూసుకుంటారు!

విజయవాడ, ఆగస్టు 30: ఓటుకు నోటు కేసు విషయమై ఎక్కువగా మాట్లాడ్డానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. మంగళవారం కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఓటుకు నోటు కేసు విషయమై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. క్లుప్తంగా సమాధానం చెప్పారు. ఏసిబి ఈ కేసును వచ్చే నెల 29లోగా విచారించాలని ఆదేశించింది కదా? అని ప్రశ్నించగా, ‘అందులో ఏముంది? మీరు చదివారా? ఏం చేస్తారు? అంతా మా లాయర్ చూసుకుంటారు.’ అని సమాధానం చెప్పి విలేఖరుల సమావేశాన్ని ముగించారు.

వైన్‌షాపులను మూసివేయాలని మహిళల బైఠాయింపు

విజయనగరం (్ఫర్టు), ఆగస్టు 30: పట్టణం నడిబొడ్డులో శాంతినగర్‌కు వెళ్లే బీసెంట్ స్కూల్ రోడ్డులో ఉన్న రెండు వైన్‌షాపులను మూసివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం రోడ్డుపై మహిళలు బైఠాయించారు. గుడి,బడి ఉన్న ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ షాపులను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఈ షాపులను తక్షణమే మూసివేయాలని వారు డిమాండ్ చేశారు. షాపుల ముందు ధర్నా చేసిన మహిళలు సుమారు మూడు గంటల సేపు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం 160ఎకరాల భూమిని అప్పగించిన రైతులు

విజయనగరం, ఆగస్టు 30: రాష్ట్రప్రభుత్వం భోగాపురం మండలంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కౌలువాడ గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్‌ను కలుసుకుని వారికి సంబంధించిన 160ఎకరాల భూమిని అప్పగించేందుకు అంగీకార పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివేక్ మాట్లాడుతూ మొదటి దశలో 1362ఎకరాల ప్రైవేటు భూమికి డిక్లరేషన్ జారీచేశామని చెప్పారు. ఇప్పటివరకు 900 ఎకరాలు అప్పగించేందుకు రైతులు అంగీకార పత్రాలు అందజేశారన్నారు.

డిఎంఅండ్‌హెచ్‌ఓ సేవలు ప్రశంసనీయం

విజయనగరం (పూల్‌బాగ్), ఆగస్టు 30: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ శారద విధి నిర్వహణలో చేసిన సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర గృహనిర్మాణ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని అన్నారు. మంగళవారం ఆనందగజపతి ఆడిటోరియంలో మంత్రి వివిధ శాఖలపై సమీక్ష జరిపిన సందర్భంగా బుధవారం పదవీ విరమణ చేస్తున్న డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ శారదను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పిహెచ్‌సి సేవలను మెరుగుపరచి రాష్టస్థ్రాయిలో మొదటి స్థానం జిల్లాకు దక్కటానికి కృషి చేసిన శారదను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వైద్యసేవలు అందించటం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

సెప్టెంబర్ 23 నుండి పైడిమాంబ దీక్షలు

విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 30: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవంలో భాగంగా భక్తులు చేపట్టే పైడిమాంబ దీక్షలు సెప్టెంబర్ 23వతేదీన ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి భానురాజా అన్నారు. మంగళవారం పైడితల్లి అమ్మవారి కల్యాణ మండపంలో పైడిమాంబ దీక్షల వివరాలను వెల్లడించారు. 23న చదురుగుడి వద్ద పైడిమాంబ మండల దీక్షలు అమ్మవారి సన్నిధిలో ప్రారంభమవుతాయని చెప్పారు. పైడిమాంబ దీక్షాధారుల పీఠం చదురుగుడి ఎదురుగా ఉన్న అన్నదాన ప్రసాదశాల వద్ద ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

పరశురాంపేట కూడలిలో వ్యక్తి దారుణ హత్య

రాజాం, ఆగస్టు 30: మండలంలోని గురవాం గ్రామ సమీపం, పరశురాంపేట కూడలిలో రేగిడి మండలం బూరాడకు చెందిన గులివిందల సత్యం(47) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మృతుడు రేగిడి మండలం బూరాడకు చెందినవాడిగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే బూరాడ గ్రామానికి చెందిన సత్యం మద్యానికి బానిసై ప్రతిరోజూ మద్యం కోసం బెల్ట్ షాపులను ఆశ్రయించేవాడని, అదే క్రమంలో పరశురాంపేట కూడలిలో ఉన్న బెల్ట్‌షాపులో సోమవారం సాయంత్రం మద్యం సేవించేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఎప్పుడూ ఇదే విధంగా జరగడంతో కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు.

జన్మభూమి కమిటీల జగడం!

శ్రీకాకుళం: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం వీటి పెత్తనాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించి రాజ్యాంగేతర శక్తులను ప్రోత్సహిస్తుందన్న అపవాదు లేకపోలేదు. రెండేళ్లుగా జన్మభూమి కమిటీ సభ్యులు కనుసన్నలల్లో రేషనకార్డులు, పింఛన్లు, నీరు-చెట్టు పనులు చంద్రన్నబాట వంటి కార్యక్రమాలు వడ్డన సాగిస్తున్న విషయం తెలిసిందే. చైతన్యంలో ముందు వరుసలో ఉన్న శ్రీకాకుళం తమ్ముళ్లు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఆత్మాభిమానం దెబ్బతింటే అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారింది.

Pages