S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓసి బొగ్గుగనిలో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

సత్తుపల్లి, ఆగస్టు 30 : గత రెండేళ్ళ క్రితం సత్తుపల్లి జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిలో జరిగిన అవినీతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సింగరేణి బొగ్గుగనుల హెచ్‌ఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. మంగళవారం సత్తుపల్లిలో హెచ్‌ఎంఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో షేప్ నిధులు ఖర్చు పెట్టల్సి ఉండగా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోద్బలంతో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

వ్యవసాయ మోటార్ పంపుసెట్లకు అమర్చిన స్టార్టర్‌లను తొలగించండి

సత్తుపల్లి, ఆగస్టు 30 : రైతులు వ్యవసాయ మోటార్‌పంపు సెట్లకు అమర్చిన స్టార్టర్‌లను వెంటనే తొలగించాలని సత్తుపల్లి విద్యుత్‌శాఖ ఏడి జీవన్‌కుమార్ రైతులను కోరారు. మంగళవారం సత్తుపల్లి విద్యుత్‌శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి, వ్యవసాయానికి 9గంటల విద్యుత్ సరఫరా అందిస్తుందని ఇందుకోసమై ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి రూ.

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

ఖమ్మం(కల్చరల్), ఆగస్టు 30: వచ్చే నెల 2వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్‌టియు, ఐఎన్‌టియుసి, టిఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు, టిఆర్‌ఎస్‌కెయు నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, పోటు ప్రసాద్, రామయ్య, కొత్త సీతారాములు వెంకట నారాయణ, పోటు సత్యనారాయణ, కాసాని నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ దేశ రక్షణకు, కార్మికుల రక్షణకు సెప్టెంబర్ 2న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్మిక చట్టాలను సవరించి కార్పొరేటు సంస్థలకు బానిసలను చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందన్నారు.

టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో ర్యాలీ

ఖానాపురం హవేలి, ఆగస్టు 30: అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో వచ్చే నెల 2వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ అధ్యక్షులు జిఎస్ ప్రసాద్, నగర అధ్యక్ష, వల్లోజి శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఉద్యోగులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంట్రిబ్యూటరి పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయటంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

తిరంగా యాత్రను జయప్రదం చేయండి

సత్తుపల్లి, ఆగస్టు 30: 70 స్వా తంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రను సత్తుపల్లిలో కూడా జయప్రదం చేయా లని బిజెపి మాజీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి కోరారు. మంగళవారం సత్తుపల్లిలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 17 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని బిజెవైఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న తిరంగా యాత్రలో మోటార్‌సైకిల్ ర్యాలీ, 10న అన్ని విద్యాసంస్థలు, స్వచ్ఛంధసంస్థల ఆధ్వర్యంలో పాదయాత్ర, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.

సిఎంకు కృతజ్ఞతలు

ఖానాపురం హవేలి, ఆగస్టు 30: భద్రాద్రి జిల్లాగా కొత్తగూడెంను ప్రకటించటం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును మంగళవారం హైదరాబాద్‌లో కలిసిన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు.

1,2 తేదీల్లో వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఆగస్టు 30: సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని, రైతులు ఈ రెండు రోజులు తమ సరుకులు తీసుకరావద్దని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పాలకుర్తి ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో వర్ష బీభత్సం

అచ్చంపేట/ సత్తెనపల్లి/ మాచవరం/ నకరికల్లు, ఆగస్టు 30: గత నాలుగురోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. రోడ్లన్నీ జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని గ్రామాలు ఏకంగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయ. సత్తెనపల్లిలో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. ఆయా మండలాల్లో దాదాపు వెయ్యమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

టీడీపీ నేత దారుణ హత్య

గుంటూరు, ఆగస్టు 30: తెలుగుదేశం పార్టీ బిసిసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు యేమినేని వెంకటేశ్వరరావు(40) దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం వేకువజామున గుంటూరు రూరల్ పరిధిలోని ఓబులనాయుడుపాలెంలో ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న వెంకటేశ్వరరావును గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో నరికారు. రక్తపు మడుగులో పడివున్న వెంకటేశ్వరరావును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. వెంకటేశ్వరరావు గత కొంతకాలంగా స్థానిక రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

‘రియల్’ మోసాలు

గుంటూరు, ఆగస్టు 30: జిల్లాలో రియల్ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. మాఫియా ధాటికి సొంత ఇంటి కల యేమోకానీ... కూడబెట్టిన సొమ్ము తిరిగిరాదేమోననే ఆందోళన బాధితులలో వ్యక్తమవుతోంది. ఒకే ఆస్తికి రెండు రిజిస్ట్రేషన్ల చట్టానికి ప్రభుత్వం సవరణలుచేసి అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్నా భూ మాఫియా చెలరేగిపోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు లెక్కకు మిక్కిలి రిజిస్ట్రేషన్లు.. కోర్టు వ్యాజ్యాలతో అసలు యజమానులను విసుగెత్తేలాచేసి ఆపై రెగ్యులరైజ్ చేయించుకుంటున్నట్లు తేలింది.

Pages