S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ నెలాఖరుకు పుష్కర పనులు పూర్తిచేయాలి

గుంటూరు, జూలై 5: కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనులన్నింటినీ జూలై మాసాంతానికి పూర్తిచేయాలని కలెక్టర్ కాంతిలాల్ దండే ఆదేశించారు. పనుల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ దండే మాట్లాడుతూ పుష్కర నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం గుంటూరు జిల్లాకు 500 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ప్రధానంగా ఇరిగేషన్, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, మునిసిపల్ పరిపాలన శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయనున్నామన్నారు. యాత్రికులు పుష్కర స్నానం ఆచరించేందుకు ఇరిగేషన్ శాఖ ద్వారా 107 కోట్ల ఖర్చుతో 80 ఘాట్లు నిర్మిస్తున్నామని చెప్పారు.

మన్నవకే మార్కెట్ యార్డు

గుంటూరు, జూలై 5: గుంటూరు మార్కెట్‌యార్డు చైర్మన్ పదవికి మన్నవ సుబ్బారావుకు ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన్నవను చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియా సమక్షంలో వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు ఈ పదవిపై నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోయింది. డైరెక్టర్ల పదవులకు ఎమ్మెల్యేలు పేర్లను సూచించక పోవడంతో నియామకాల భర్తీ కొలిక్కిరావడం లేదు. మార్కెట్‌యార్డు చైర్మన్ పదవిని తన అనుచరుడైన వెన్నా సాంబశివారెడ్డికి ఇవ్వాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఇప్పటివరకు పట్టుపట్టారు. అయితే మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు మన్నవకు మద్దతిచ్చారు.

జిల్లా తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుమలత నియామకం

గుంటూరు (లీగల్), జూలై 5: గుంటూరు జిల్లాకు తొలిసారిగా మహిళా న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్ పలువురు న్యాయమూర్తులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో గుంటూరు జిల్లాకు ప్రధాన న్యాయమూర్తిగా సి సుమలతను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఆమె కర్నూలు జిల్లాకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. తొమ్మిదేళ్ల క్రితం న్యాయశాఖలో అడుగుపెట్టిన సుమలత తెనాలి మేజిస్ట్రేట్‌గా తొలి బాధ్యతలు చేపట్టారు. మేజిస్ట్రేట్‌గా కొనసాగుతూనే జిల్లా జడ్జి పోస్టులకు జరిగే పరీక్షలు రాసి జిల్లాస్థాయి న్యాయమూర్తిగా ఎదిగారు.

మూడేళ్లలో మహిళలకు ఉపాధి

ఇంద్రకీలాద్రి, జూన్ 5: మహిళా సాధికారితలో భాగంగా రాబోయే 3 సంవత్సరాల్లో ఔత్సాహికులైన మహిళలకు వృత్తి శిక్షణ ఇచ్చి ఆర్థిక చేయూత కల్పిస్తామని జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ పేర్కొన్నారు. మంగళవారం కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ పాలక మండలి ఎన్నికై రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా వార్షికోత్సవ సమావేశం ముత్యాలంపాడు పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్ పర్సన్ అనూరాధ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 12 వందల మంది మహిళలకు వృత్తి శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేశామన్నారు.

రహదారుల అభివృద్ధికి పెద్దపీట

కైకలూరు, జూలై 5: విభజన నేపథ్యంలో ఎపి అన్ని రంగాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేసిందని రాష్ట్ర రోడ్డు, రవాణా, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని సిఎన్నార్ గార్డెన్స్‌లో రోడ్లు భవనాల శాఖ పనుల అమలు తీరు, ప్రగతిపై మంగళవారం మంత్రి శిద్దా రాఘవరావు స్థానిక మంత్రి డా.కామినేనితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం చేయలేని సాహసోపేత నిర్ణయాలతో చంద్రబాబు రాష్ట్రాన్ని ముందంజలో నడిపిస్తున్నారని అన్నారు.

‘కృష్ణా’రైతులకు ‘గోదావరి’ జలాలు

నూజివీడు, జూలై 5: కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు సమృద్ధిగా లేకపోవటంతో కృష్ణాజలాలపై ఆశలు పెట్టుకున్న రైతున్నకు ప్రత్యామ్నాయ మార్గంగా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా రైతాంగానికి అందించేందుకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. బుధవారం ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడు పట్టిసీమ ప్రాజెక్టు వద్ద 28 పంపుల నుండి గోదావరి జలాలను కృష్ణాకు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి పోలవరం ప్రధాన కాలువ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. నూజివీడు మండలం 19వ కిమీ వద్ద కృష్ణాజిల్లాలోకి గోదావరి జలాలకు పల్లెర్లమూడి గ్రామం ముఖద్వారం కానుంది.

మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

మచిలీపట్నం, జూలై 5: మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర బడ్జెట్‌లో అత్యధికంగా రూ.710కోట్లు కేటాయించి వారి అభ్యున్నతికి పాటు పడుతున్నామని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని పలు మసీదుల మరమ్మతుల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.6.50లక్షల చెక్కులను మంగళవారం స్థానిక రాజుపేట షాదీఖానాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మసీదుల నిర్వాహకులకు అందజేశారు. అలాగే చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాను పంపిణీ చేశారు.

శరవేగంగా రాజధాని రోడ్లు

విజయవాడ, జూలై 5: అమరావతి రాజధాని వెలగపూడి వెళ్లే రహదారుల అభివృద్ధిపై విజయవాడ ఎపి సిఆర్‌డిఏ కార్యాలయంలో మంగళవారం ఎపి సిఆర్‌డిఎ ఇన్‌చార్జ్ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ సమీక్ష జరిపారు. కరకట్ట, ఉద్దండరాయునిపాలెం నుంచి ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ వరకు 2.4 కిలోమీటర్ల రోడ్డును రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయడానికి వెంటనే టెండర్లు పిలిచి త్వరితగతిన పనులు చేయాలని ఇన్‌చార్జ్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే వెలగపూడి రహదారి నిర్మాణ పనులు త్వరితంగా పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

జిల్లాను దేశంలోనే ఆదర్శంగా నిలపాలి

విజయవాడ, జూలై 5: ఆధార్‌తో అనుసంధానించిన పలు పథకాలను పైలెట్ ప్రాజెక్టులుగా అమలుచేసి దేశానికి కృష్ణా జిల్లా మార్గదర్శకంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ బాబు.ఏ అన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న నేషనల్ వర్క్ షాప్ ఆన్ ఆధార్ ఎనేబుల్డ్ అప్లికేషన్స్‌లో భాగంగా మంగళవారం కృష్ణా జిల్లా కలెక్టర్ న్యూ ఇనీషియేటివ్స్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ అనే అంశంపై ప్రసంగించారు. సాంకేతిక పరిఙ్ఞన ఫలితాలను ప్రజలకు ఉపయోగపడేలా చేయడం ప్రభుత్వ యంత్రాంగం కర్తవ్యమన్నారు. కచ్చితమైన లబ్ధిదారుని గుర్తించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖ ఎంతో విలువైన సమయాన్ని ఏటా కోల్పోతుందన్నారు.

చంద్రబాబు ఆటవిక పాలన

విజయవాడ, జూలై 5: విజయవాడ నగరం రాష్ట్ర రాజధాని అయినందుకు ఎంతో సంతోషిస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆటవిక పాలన సాగిస్తున్నారని సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు దోనేపూడి శంకర్, దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. జాతి నేతల జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రొటోకాల్, సమయపాలన పాటించకుండా ప్రజల్ని, ప్రతిపక్ష, రాజకీయ పార్టీల నేతల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ, వారి సహనాన్ని పరీక్షిస్తున్నారని ధ్వజమెత్తారు.

Pages