S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెంటిమెంటుతో కాలం గడుపుతున్న కేసిఆర్ సర్కార్

మేడ్చల్, జూలై 5: కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ సెంటిమెంటును రెచ్చగొడుతూ కేసిఆర్ సర్కార్ కాలం గడుపుతోందని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి కె.హరిప్రసాద్ విమర్శించారు. మేడ్చల్ సిఐటియు 4వ మహాసభ పట్టణంలోని నవభారత్ ఫంక్షన్ హల్‌లో మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతూ కెసిఆర్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.

ఫిర్యాదులు రాకుండా గ్రామీణ ఉపాధి హామీ పనులు చేపట్టాలి

వికారాబాద్, జూలై 5: మండలంలో చేపడుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై ఫిర్యాదులు రాకుండా చేపట్టాలని వికారాబాద్ మండల పరిషత్ అధ్యక్షురాలు ఎస్.్భగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం ఉపాధి హమీ భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన పదో రౌండు ఉపాధి హామీపనుల సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆమె మాట్లాడుతూ రైతు కూలీలకు అన్యాయం జరగకుండా ఉపాధి హమీ పనులు సాగాలని సూచించారు. గత ఏడాది హరితహారంలో నాటాల్సిన మొక్కలు ఎండిపోయాయని అది పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు.

విశ్వనగరానికి మేయర్ రామ్మోహన్ కృషి

కుషాయిగూడ, జూలై 5: తెలంగాణ విద్యార్ధి ఉద్యమనికి రథసారథి, గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్ జన్మదిన వేడుకలను కాప్రా సర్కిల్ పరిధిలోని హెచ్‌బికాలనీ అనాథ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. చర్లపల్లి టిఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీనియర్ నాయకుడు శివకుమార్‌గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్ధి ఉద్యమానికి రథసారధిగా నిలిచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన రామ్మోహాన్ ఏన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. గ్రేటర్ మేయర్‌గా హైదరాబాద్‌ని విశ్వనగరాన్ని ప్రపంచ స్ధాయికి తీసుకరావడానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.

మైనార్టీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట

సికింద్రాబాద్, జూలై 5: మైనార్టీల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖామాత్యులు టి.పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని ఆయన కార్యాలయంలో పేద ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు మసీదుల పరిధిలో ఇప్పటి వరకు 5200మంది ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. మైనార్టీలను ఆదుకోవాలని వారికి ఆర్థికంగా ఎదగడానికి చేయూత నివ్వాలన్న లక్ష్యంతో సిఎం కెసిఆర్‌లో ఎన్నో వినూత్న పధకాలను ప్రవేశపెట్టి వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

న్యాయశాఖ ఉద్యోగుల సమ్మె విరమణ

ఖైరతాబాద్, జూలై 5: హైకోర్టు విభజన, ఏపి న్యాయమూర్తుల ఆప్షన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న న్యాయశాఖ ఉద్యోగులు తమ సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, తెలంగాణ అధ్యక్షులు జగన్నాథం మాట్లాడారు. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు చెప్పారు. ఆప్షన్స్‌కు అవకాశం ఇస్తే తెలంగాణ న్యాయమూర్తులకు, న్యాయశాఖ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని తాము మొదటి నుంచి చెబుతూ వచ్చామన్నారు.

ఈదురు గాలులు.. వర్షం

హైదరాబాద్, జూలై 5: మహానగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై పలు చోట్ల చిరుజల్లులు కురుస్తూనే, ఉన్నట్టుండి మధ్యాహ్నం మూడున్న గంటల ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు కూడా వీయటంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఇందిపార్కు, ఆదర్శ్‌నగర్, రెడ్‌హిల్స్ తదితర ప్రాంతాల్లో పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. మంగళవారం రాత్రి వరకు కూడా నగరంలోని పలు చోట్ల చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.

పొంచి ఉన్న వ్యాధులు

హైదరాబాద్, జూలై 5: పాలకుల నిర్లక్ష్యం, సంబంధిత అధికారుల అలసత్వం కారణంగా మహానగరాన్ని డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటి ప్రాణాంతక వ్యాధులు వణికిస్తున్నాయి. తరుచూ కురుస్తున్న వర్షం, సక్రమంగా సాగని పారిశుద్ధ్య పనుల కారణంగా వ్యాధుల భయంతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే స్వల్ప అనారోగ్య లక్షణాలతో ప్రజలు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఉదయం సమయంలో ఫీవర్ ఆసుపత్రిలో రోజుకన్నా రెండింతల సంఖ్యలో రావటంతో వారికి వైద్యం అందించలేక వైద్యులు ఇబ్బందులు పాలవుతున్నారు. అసలే ప్రభుత్వాసుపత్రి, ఆపై అంతంతమాత్రంగా సౌకర్యాలుండటంతో రోగులు అవస్థల పాలవుతున్నారు.

కలుషిత నీరు తాగి 138 మందికి అస్వస్థత

హైదరాబాద్/ సికిందరాబాద్, జూలై 5: సికిందరాబాద్ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో విషాదం చోటుచేసుకుంది. కలుషిత నీరు తాగి 138 మంది అస్వస్థకు గురయ్యారు. వీరిలో 40 మంది చిన్నారులు ఉన్నారు. అయితే వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో లాలాగూడ రైల్వే ఆసుపత్రికి తరలించారు. కాలాపానీతో మరో భోలక్‌పూర్ కాకముందే అధికారులు కళ్లు తెరవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గత సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన జలమండలి అధికారులు నీటి సరఫరాపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో సమస్యలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

నిట్‌లో హరితహారం

వరంగల్, జూలై 5: భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించే బాధ్యత నేటి యువతపై ఉందని వరంగల్ నగర పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు అన్నారు. మంగళవారం కాజీపేట పోలీసు సహకారంతో ఎన్‌ఐటి ప్రాంగణంలో హరితహార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పిలుపుమేరకు వరంగల్ ఎన్‌ఐటి విభాగం అధ్వర్యంలో వెయ్యి మొక్కలను నాటే ప్రణాళికను రూపొందించారు. ఈ కార్యక్రమానికి సిపి సుధీర్‌బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలి మామిడి మొక్కను నాటి కార్యిక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎంజిఎంలో మెరుగైన వైద్యసేవలు

వరంగల్, జూలై 5: ఎంజిఎం ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చే రోగులకు డాక్టర్లు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. మంగళవారం ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ చాంబర్‌లో ఆసుపత్రిలో వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లతో వౌలిక వసతులు, సిబ్బంది పనితీరు, వైద్య సేవలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పారిశుద్ధ్యం నిర్వహిస్తున్న ఆల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పనితీరు సంతృప్తికరంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసే పని సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Pages