S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదా‘వర్రి’

విశాఖపట్నం, జూలై 3: దేశ, విదేశాల్లో ఉగ్రవాదుల చర్యలు పేట్రేగిపోతున్నాయి. దీంతో ఏ క్షణంలో ఎటువంటి సంఘటనలు తలెత్తుతాయో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు పోలీసు వర్గాలను సైతం కలవరపరుస్తున్నాయి. అందువల్ల ముందస్తు చర్యలతోనే వీటిని సమర్ధవంతంగా ఎదుర్కోగలమనే ఆలోచనతో పటిష్ఠ భద్రతాచర్యలు చేపడుతున్నాయి. ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలో హైఅలెర్ట్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జన సామర్ధ్యం అధికంగా ఉండే విమానాశ్రయాలు, ముఖ్యమైన రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్‌కాంప్లెక్స్‌ల వద్ద పటిష్ఠ భద్రత నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా విశాఖ రైల్వేస్టేషన్‌లో అన్నివిధాలా నిఘాను కట్టుదిట్టడం చేశారు.

జిల్లాలో నీటిపారుదల రంగానికి అధిక నిధులు

నెల్లూరు టౌన్, జూలై 3: గతంలో ఎన్నడూ లేని విధంగా నీటిపారుదల రంగానికి టిడిపి ప్రభుత్వం అత్యధిక నిధులను కేటాయించిందని జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆదివారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం టిడిపి జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శిద్దా రాఘవరావు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందన్నారు.

విత్తన ధాన్యం కొరత తీరేనా ?

ఆత్మకూరు, జూలై 3: వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిస్తే, జిల్లాలో విత్తన ధాన్యం అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ ముందస్తు జాగ్రత్తలు అస్పష్టం. ఎప్పటి మాదిరిగా ఘోర వైఫల్యం చెందే పరిస్థితులు ఈ ఏడాది కూడా పునరావృతమవుతాయా లేక పరిస్థితుల్లో ఏమైనా మార్పులు ఉంటాయా అనేది వ్యవసాయశాఖనుద్దేశించి రైతాంగం నుంచి వినవస్తున్న విజ్ఞప్తి. రెండేళ్ల క్రితం యూరియా కోసం జిల్లా రైతాంగం నానా అగచాట్లు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం సవరించిన నూతన విధానంతో యూరియాకు అలాంటి అవస్థలు ఉండే పరిస్థితుల్లేవు. యూరియా ఇతర అవసరాలకు తరలిపోకుండా పటిష్టవంతమైన చర్యలకు శ్రీకారం చుట్టారు.

కష్టాల్లో టెక్స్‌టైల్స్ పరిశ్రమ!

ఆదోని, జూలై 3: రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయటానికి విదేశాల్లో పర్యటనలు చేస్తూ విదేశీ సంస్థలను దేశంలోకి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్న నేతలు రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలను తెరిపించడానికి తీసుకున్న చర్యలు శూన్యమనే చెప్పవచ్చు. నేతల చిన్న చూపుచేస్తున్న వాటిలో టెక్స్‌టైల్స్ పరిశ్రమ ఒక్కటి. ఇప్పుడు టెక్స్‌టైల్స్ పరిశ్రమ ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటోంది. విదేశీ పరిశ్రమల పోటీకి తట్టుకోలేక కొన్ని నూలు మిల్లులు మూతపడ్డాయి. మరికొన్ని ఆధునీకరణ చేయకపోవడం వల్ల మూతపడడంతో వేల కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆదోని పట్టణం ఒకప్పుడు టెక్స్‌టైల్స్ పరిశ్రమకు పెట్టింది పేరుగా ఉండేది.

నిండు గోదారి

రాజమహేంద్రవరం, జూలై 2: గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం వద్ద గంట గంటకూ నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. శనివారం రాత్రి కాటన్ బ్యారేజ్ వద్ద 8.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. 1,24,255 క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి విడుదల చేశారు. బ్యారేజ్ దిగువ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో కాటన్ బ్యారేజ్ నుండి డెల్టా కాలువలకు నీటి సరఫరా బాగా తగ్గించారు.

ఎర్రచందనం దొంగ రవాణాకు సహకరిస్తే కఠిన శిక్షలు

తిరుపతి, జూలై 2: ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాలో సహకరించిన వారికి, పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు తప్పవని ఆ దిశగా చట్టాలు రూపొందించడం జరిగిందని, వీటిపై ప్రతి అధికారి అవగాహన పెంచుకోవాలని రాయలసీమ డి ఐజి ప్రభాకర్‌రావు, అర్బన్ ఎస్పీ జయలక్ష్మిలు అన్నారు. సవరించిన ఎర్రచందనం అక్రమరవాణాల చట్టాలపై పోలీస్, అటవీశాఖ అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమం శనివారం స్థానిక మహిళా విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో సదస్సు నిర్వహించారు.

గండి దేవస్థానం అభివృద్ధికి కృషి

చక్రాయపేట, జూలై 2: జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీ గండి వీరాంజనేయస్వామి సహాయ కమిషనర్‌గా పట్టెం గురుప్రసాద్ సోమవారం పదవీబాధ్యతలు చేపట్టారు. తొలుతగా దేవస్థాన సిబ్బంది పట్టెం గురుప్రసాద్‌కు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతంలో దేవస్థానానికి ఇన్‌ఛార్జిగా పనిచేస్తుండేవారని, ప్రస్తుతం రెగ్యులర్ సహాయ కమిషనర్‌గా నివేదికలు అందాయని, పదవీ బాధ్యతలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. అదే విధంగా ప్రస్తుతం దాతల సహకారంతో రూ.65 లక్షలు పలు రకాల పనులతో పాటు అంజన్న గర్భగుడి, మంటపానికి దాదాపు రూ.10 కోట్లతో ప్రతిపాదనలు దేవాదాయ శాఖకు పంపనున్నట్లు వారు పేర్కొన్నారు.

అభివృద్ధి చేయండి.. అండగా ఉంటాం..

పెనుకొండ, జూలై 2 : ప్రభుత్వంతోపాటు స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. మండల పరిధిలోని గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయలేదని, ఆర్టీసీ డిపో ప్రారంభం, కొండపై లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం, కొండపై విద్యుత్ సమస్యలు తీర్చలేదన్నారు.

నగరంలో ముమ్మర తనిఖీలు

అనంతపురం సిటీ, జూలై 2: దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఉగ్రవాదుల కదలికలు జిల్లాలో ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు నగరంలో శనివారం నుండి ముమ్మర తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రవాదుల కార్యకలాపాలు తీవ్రంగా ఉన్నట్లు ఇంటిలిజెన్సీ సమాచారంతో జిల్లాలో కూడా పలుచోట్ల పోలీసులు తనిఖీలను చేపట్టారు. జిల్లా కేంద్రంలో కొంతమంది ఉగ్రవాదులు తలదాచుకుని ఇక్కడ నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు నగరంలోని అన్ని వీధులు, లాడ్జిలు, బస్టాండ్లు, వెహికల్స్‌ను తనిఖీలు చేపట్టారు.

నిద్దరోతున్న నిఘా!

అనంతపురం, జూలై 2 : జిల్లావ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యం అక్రమ విక్రయాలు, ఎమ్మార్పీకి మించి అధిక ధరలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ శాఖ నిద్రమత్తులో జోగుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది. జిల్లాలో అనంతపురం, పెనుకొండ ఎక్సైజ్ (యూనిట్లు) ఉన్నాయి. వీటి పరిధిలో 238 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో అనంతపురం పరిధిలో 140, పెనుకొండ పరిధిలో 98 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఇష్టారాజ్యంగా బెల్టుషాపుల నిర్వహణ, అధిక ధరలకు మద్యం విక్రయించడం పరిపాటిగా మారింది. ఏడాది కాలంలో అధిక ధరలకు సంబంధించి కేసులు జిల్లా మొత్తం 25 లోపే నమోదు చేయడం విశేషం.

Pages