S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంద్రీనీవా పనులు వేగవంతం చేయండి

అనంతపురం సిటీ, జూలై 2: జిల్లాను సస్యశ్యామలంగా చేయడానికి హంద్రీనీవా ప్రాజెక్టును పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కోన శశిధర్ అధికారులను, ఏజెన్సీలను ఆదేశించారు. శనివారం స్థానిక రెవిన్యూ భవన్‌లో హంద్రీనీవా పనులు పురోగతి, భూసేకరణ పనులపై హంద్రీనీవా ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబందించి ప్యాకేజీల వారిగా జరుగుతున్న పనులు, పెండింగ్‌లో ఉన్న భూసేకరణపై సమీక్షించారు. స్ట్రక్చర్లు, అండర్ టనె్నల్స్, అక్విడెన్సుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

తలుపుల, జూలై 2: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని రాష్ట్ర బిజెవైఎం అధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన మండల బిజెపి కార్యకర్తల సమావేశానికి ఆయనతోపాటు దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలుపుల గంగాధర్, బిజెపి నాయకులు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్రమోదీ 42 సంక్షేమ పథకాలను నూతనంగా అమలుచేశారన్నారు.

ఆర్ట్స్ కళాశాల మైదానం ప్రహరీ మార్కింగ్‌కు యత్నం..

అనంతపురంటౌన్, జూలై 2: నగరంలోని ఆర్ట్స్ కాలేజీ ఎదురుగానున్న గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శనివారం కార్పొరేషన్ అధికారులు మార్కింగ్ ఇవ్వటానికి యత్నించటంతో అధ్యాపక బృందం అడ్డుతగిలారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌ను ఇకపై ఎంతమాత్రమూ అన్యాక్రాంతం కానివ్వబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే కాలేజీ మైదానంలో విద్యుత్ సబ్ స్టేషన్, చేపల మార్కెట్ కోసం ఆక్రమించటంతో విలువైన ఆస్తులను కోల్పోయామని అన్నారు. ఇకపై కాలేజీ ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వటానికి అనుమతించమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలో కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహంతో కాంపౌండ్‌వాల్ కూల్చివేయటం పెనుదుమారం సృష్టించింది.

అభివృద్ధిలో భాగస్వాములవుదాం

యాడికి, జూలై 2 : గ్రామాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరం భాగస్వాములవుదామని ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని రాయలచెరువులో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం, ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగా స్థానిక బస్టాండ్ సమీపంలోని సులభ్‌కాంపెక్స్‌ను ప్రారంభించారు. అనంతరం నగరూరు రహదారిని పరిశీలించారు. తర్వాత అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలోని సర్వే నెంబర్ 258లోని 90 సెంట్ల విస్తీర్ణంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి దాదాపు రూ. 75 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

కొరియర్ సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోండి

పుట్టపర్తి, జూలై 2: ఆర్‌టిసి రవాణా కొరియర్ సర్వీసును సద్వినియోగపరుచుకోవాలని పుట్టపర్తి డిపో మేనేజర్ రమణయ్య పిలుపునిచ్చారు. శనివారం పుట్టపర్తి ఆర్‌టిసి బస్టాండులో ఆర్‌టిసి కార్గో కొరియర్ సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ అతి తక్కువ ఖ ర్చుతో వినియోగదారులకు వస్తు రవా ణా సదుపాయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సుదూర ప్రాంతాలకు సైతం తక్కువ డబ్బుతో తమతమ వస్తువులను రవాణా చేసే వీలును ఆర్‌టిసి సంస్థ కల్పించిందన్నారు.

పోయా.. మోసం...!

గుంతకల్లు, జూలై 2 : బ్యాంకు అధికారులమంటూ ఫోన్ చేసి ఎటిఎం నెంబర్ చెప్పించుకుని ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకున్న ఘటన గుంతకల్లు పట్టణంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని తిలక్‌నగర్‌లో నివాసం ఉంటున్న జి వెంకటనారాయణకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరస్థుడు విడుతల వారీగా రూ.42323 నగదు డ్రా చేసుకున్నాడు. రైల్వే స్టోర్ కీపర్‌గా పని చేసి పదవీ విరమణ పొందిన జి వెంకటరమణ తనకు వచ్చిన నగదును బ్యాంకు ఖాతాలో నిల్వ చేసుకున్నాడు. అయితే నెల కిందట ఓ వ్యక్తి బ్యాంకు అధికారిని అంటూ నమ్మబలికి ఎటిఎం కార్డుపై ఉన్న చివరి నాలుగు నెంబర్లు చెప్పాలని కోరాడు.

చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ మృతి

బుక్కరాయసముద్రం, జూలై 2: అనంతపురం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న జగనాథ్(53) అనే ఖైదీ శనివారం తెల్లవారుజామున జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయంపై స్థానిక జిల్లా జైలు సూపరింటెండెంట్ నాగేశ్వర్‌డ్డిని వివరణ కోరగా వివరాలు ఈ విధంగా వున్నాయి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

అగళి, జూలై 2 : మండలంలోని నరసాంబూదిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనిరుధ్ (22) మృతి చెందాడు. మధూడికి చెందిన అనిరుధ్ పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగానే నరసాంబూదిలో పూలు కట్టించేందుకు శనివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వస్తుండగా బస్టాండ్‌లో మలుపు వద్ద టిప్పర్ ఢీకొంది. దీంతో అనిరుధ్ అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు టిప్పర్ అద్దాలు ధ్వంసం చేశారు. కాగా ఘటనపై ఎస్సై ఆంజనేయ వీడియో చిత్రీకరిస్తుండగా రెచ్చిపోయిన స్థానికులు, బంధువులు పోలీసు జీపు అద్దాలను సైతం పగులగొట్టారు.

హోటల్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. వ్యక్తి మృతి

తాడిపత్రి, జూలై 2: మండల పరిధిలోని బోగసముద్రం (బుగ్గ)గ్రామం సమీమంలో శనివారం హోటల్‌లోకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో శ్రీనివాసులు(35) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయలపాలైనారు. రూరల్ ఎస్సై నారాయణరెడ్డి తెలిపిన వివరాల మేరకు గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసులు గతంలో అల్ట్రాటెక్ కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేసేవాడని, కాంట్రాక్టర్ తొలగించడంతో నాపరాయి పరిశ్రమలో పాలీష్ పట్టేవాడని తెలిపారు. సాయంత్రం టీ తాగేందుకు హోటల్‌కు వెళ్లగా వేగంగా వెళ్తున్న టాక్ట్రర్ హోటల్‌లోకి దూసుకెళ్ళగా శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈసారైనా కలిసొచ్చేనా..!

కరీంనగర్, జూలై 3: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరుసగా రెండేళ్లు తీవ్రనష్టాలు చవిచూసిన జిల్లా రైతాంగం ఈ ఖరీఫ్‌పైనే గంపెడాశలు పెట్టుకుంది. రుతుపవనాలు ప్రవేశించి పక్క జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే, జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో లేకుండా నామమాత్రంగానే వర్షం పడుతోంది. అడపదడపా కురుస్తున్న వర్షాలతో పత్తి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తేనే మిగితా పంటలకు ఆశాజనకంగా ఉంటుంది. జూన్ మాసం గడిచిపోగా, ఇక మిగిలింది జూలై మాత్రమే. జూలైలో వర్షాలు కురవకపోతే మళ్లీ పాత పరిస్థితులే.

Pages