S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూతూ మంత్రంగా విచారణ

ఆర్మూర్, జూలై 1: ఆర్మూర్ పట్టణ నడిబొడ్డున హత్యకు గురైన తలారి సత్యం, చేపూర్ రవి కేసులో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణపై సిఐడి విచారణ తూతూ మంత్రంగా సాగుతోందని జెఎసి నాయకుడు, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాజారాం యాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆర్మూర్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో వినతిపత్రాల అనంతరం ఎస్సీ కమిషన్ స్పందించి విచారణకు ఆదేశించిందని, అయితే సిఐడి విచారణపై తమకు నమ్మకం లేదని, ఎమ్మెల్యేకు అనుకూలంగా నివేదికను తయారు చేస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు.

వర్షాలతో పొంగుతున్న వాగులు

కుభీర్, జూలై 1: గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలు ఊతమిచ్చినట్లయింది. తీవ్ర కరువు ప్రభావానికి మండే ఎండలు తోడుకావడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు వట్టిపోవడంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగినట్లు మండల వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు కుంటలు, చెరువులు నీటి కలను సంతరించుకోగా గత మూడేళ్ల తర్వాత కస్రా వాగు నిండుగా ప్రవహిస్తుంది. పలుచోట్ల వర్షపునీరు పంటచేనులలో మడుగులు కట్టాయి.

న్యాయమూర్తుల సస్పెన్షన్ ఎత్తివేయాలి

చెన్నూర్, జూలై 1: చెన్నూర్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెదెపా జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ మాట్లాడుతూ ప్రత్యేక హై కోర్టు కావాలని చేస్తున్న న్యాయమూర్తుల సమ్మెకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తెలిపారు. న్యాయమూర్తుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని ఆయన డిమండ్ చేశారు. ఇప్పటి వరకు సస్పెండ్ చేసిన న్యాయమూర్తులపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్నారు. ప్రత్యేక హై కోర్టు కావాలని ఉద్యమం చేస్తున్న న్యాయమూర్తులను సస్పెండ్ చేసి పుండు మీద కారం చల్లినట్లు ఈ ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆయన ఎద్దేవా చేశారు.

శ్రీరాంపూర్‌లో 100శాతం బొగ్గు ఉత్పత్తి

శ్రీరాంపూర్ రూరల్, జూలై 1: శ్రీరాంపూర్ డివిజన్‌లో జూన్ ముగింపు నాటికి 100శాతం బొగ్గు ఉత్పత్తి సాదించడం జరిగిందని శ్రీరాంపూర్ డీవైజీ ఎం (పర్సనల్) బీవీవీ ఎస్ ఎస్ ఎస్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 38.48 లక్షల టన్నులకు గాను, 38.43లక్షల టన్నులు సాదించినట్లు ఆయన తెలిపారు. డివిజన్‌లో ఆర్‌కె-7, ఆర్‌కె-8, ఎస్ ఆర్‌పి-3, ఓసిపి మినహా మిగతా అన్ని గనులు వందశాతం ఉత్పత్తి సాదించాయని తెలిపారు. ఆర్‌కె-5 గని 186శాతంతో ప్రథమ స్థానంలో ఉందన్నారు.

మండల ఏర్పాటులో అధికారుల తాత్సారం

భీమిని, జూలై 1: మండలంలోని కనె్నపెల్లి పంచాయతీని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కనె్నపెల్లి గ్రామానికి చెందిన యువకుడు అతిమేన సురేష్ (22) శుక్రవారం నాటి ట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలిపాడు. అధికారులు, నాయకులు మండల ఏర్పాటుపై స్పందించడం లేదని, నూతన మండల ఏర్పాటుకు ఎమ్మెల్యే, ఎంపిలు హామీ ఇస్తేనే ట్యాంకు పై నుంచి దిగుతానని భీష్మించుకు కూర్చున్నాడు. సమాచారం అందుకున్న మండల తహసిల్దార్ రాజన్న ఘటనా స్థలానికి వచ్చి యువకున్ని సముదాయించే ప్రయత్నం చేశారు.

సంఘ విద్రోహశక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్ రూరల్, జూలై 1: జిల్లా ప్రజలు సంఘ విద్రోహశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. వచ్చే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎస్పీ మాట్లాడుతూ పండగలను శాంతియుత వాతావరణంలో సామరస్యంగా జరుపుకోవాలని అన్నారు. సంఘవిద్రోహశక్తుల పట్ల పోలీసు అధికారులు నిఘా ఉంచాలని, జిల్లాలోని పోలీసు స్టేషన్లలో కుల, మత పెద్దలు, వివిధ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక శాంతి సంఘాలతో సమావేశమై ఆయా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేవిధంగా కృషి చేయాలని సూచించారు.

రెండేళ్ల తెరాస పాలనలో అభివృద్ది శూన్యం

ఆదిలాబాద్ టౌన్, జూలై 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ రెండేళ్ల పాలనలో అభివృద్ది చేసింది శూన్యమని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ అన్నారు. శుక్రవారం బిసి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన బిజెపి పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు రైతులకు రుణాలు అందించలేదన్నారు.

డ్రైవింగ్ లైసెన్సును పునరుద్ధరించుకున్న మంత్రి అల్లోల

నిర్మల్, జూలై 1: రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తన డ్రైవింగ్ లైసెన్సును శుక్రవారం పునరుద్దరించుకున్నారు. నిర్మల్‌లోని ఆర్టీఏ కార్యాలయానికి స్వయంగా వెళ్లి వివరాలను అధికారులకు అందజేశారు. సాధారణ పౌరుల మాదిరిగానే ఫోటో దిగి సంతకం చేసి లైసెన్సును రెన్యువల్ చేసుకున్నారు. అంతకుముందు మంత్రి కార్యాలయానికి చేరుకోగానే స్థానిక ఎంవి ఐ అజయ్‌కుమార్‌రెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. మంత్రి నేరుగా కార్యాలయానికి వెళ్లకుండా కాసేపు క్యూలో నిలబడి ఆదర్శంగా నిలిచారు.

బాసర ఆలయంలో మంత్రి అల్లోల పూజలు

బాసర, జూలై 1: జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని శుక్రవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డిలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వసతి గృహానికి చేరుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు మంగళవాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిచే ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహింపచేశారు. అనంతరం పట్టు వస్త్రాలతో మంత్రిని సన్మానించి అమ్మవారి ఫోటోను, ప్రసాదాన్ని అందజేశారు.

బెజ్జూరులో ఎడతెరిపి లేని వానలు

బెజ్జూరు, జూలై 1: మండలంలో ఐదు రోజులుగా ఎడతెరిపి లేని వానలు కురుస్తుండటంతో జన జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. బెజ్జూరు మండలంలోని కుష్నపల్లి, కుకుడ, బెజ్జూరు వాగులు వర్షాల వల్ల ఉప్పొంగాయి. కుష్నపల్లి, కుకుడ వాగులు ఉప్పొంగడంతో సుమారు 15 గ్రామాల ప్రజలకు రవాణా సంబంధాలు తెగిపోయాయి. బాహ్య ప్రపంచానికి దూరంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. వాగులపై వంతెనలు పూర్తి కాకపోవడంతో ఈ ప్రాంత వాసులు నడుములబంటి లోతు నీళ్లలో బెజ్జూరు మండలానికి చేరుకోవాల్సి వస్తోంది. ప్రతీ పనికి మండల కేంద్రానికి రాక తప్పదు.

Pages