S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగ్గుమన్న జనగామ

వరంగల్/ మహబూబ్‌నగర్, జూలై 1: దసరానాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో సర్కారు కసరత్తు చేస్తుంటే, ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జిల్లాలు ఏర్పాటు తగదంటూ నిరసనలు మొదలయ్యాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా కొద్దిరోజులుగా సాగుతున్న నిరసనలు శుక్రవారం హింసాత్మక సంఘటనలుగా మారాయి. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మొదలైన ప్రత్యక్ష ఆందోళనలు మిగతా జిల్లాల్లోనూ సెగపెంచి ప్రత్యక్ష కార్యాచరణకు మార్గం వేస్తున్నాయి. ఇప్పటివరకూ జనగామ జిల్లా ఏర్పాటు ఖాయమనుకుంటున్న తరుణంలో, యాదాద్రి జిల్లాలో కలిపే అవకాశం ఉందన్న సమాచారంతో శుక్రవారం జనగామ భగ్గుమంది.

ప్రజోద్యమంగా హరిత హారం

హైదరాబాద్, జూలై 1: హరితహారం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజోద్యమంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో విద్యార్థి నుంచి సిఎం వరకు అందరూ పాల్గొనాలన్నారు. సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో హరితహారంపై సిఎం సమీక్ష నిర్వహించారు. ఈనెల 8నుంచి రెండు వారాల పాటు రాష్టవ్య్రాప్తంగా హరిత హారాన్ని ప్రజోద్యమంగా విస్తృతంగా నిర్వహించాలని సిఎం సూచించారు.

వౌలిక వసతులకు పదివేల కోట్లు

హైదరాబాద్, జూలై 1: తెలంగాణలో వౌలిక వసతుల ప్రాజెక్టులకు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టెందుకు మలేసియా ప్రభుత్వానికి చెందిన కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డ్(సిఐడిబి) సంసిద్ధత వ్యక్తం చేసింది. మలేషియా పర్యటనలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు శుక్రవారం పలు కీలక సంస్థలతో సమావేశం అయ్యారు. సిఐడిబి సిఇఓ అబ్దుల్ లతీఫ్ హిటామ్‌తో సమావేశం అయ్యారు. బోర్డు వద్ద ఉన్న ఫండింగ్‌ను పలు దేశాల్లోని ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు లతీఫ్ సుముఖత వ్యక్తం చేశారు.

గవర్నర్‌తో సిజె భేటీ

హైదరాబాద్, జూలై 1: హైకోర్టు విభజన, న్యాయాధికారుల ఆప్షన్లను నిరసిస్తూ సాగుతోన్న తెలంగాణ న్యాయ పోరాటం కొత్తమలుపు తిరిగింది. హైకోర్టు విభజనపై జరుగుతున్న ఆందోళన అంశంలో చొరవ తీసుకోవడం లేదనే విమర్శలకు తెరదించే ప్రయత్నం గవర్నర్ నుంచి మొదలైంది. 11మంది న్యాయాధికారులు, 9మంది న్యాయ సిబ్బందిని హైకోర్టు సస్పెన్షన్ చేయడం, ఇందిరాపార్కు వద్ద శుక్రవారం న్యాయవాదుల నిర్వహించిన ‘చలో హైదరాబాద్’ ధర్నా నేపథ్యంలో శుక్రవారం రాత్రి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే, తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు.

త్వరలో ఉమ్మడి పౌర స్మృతి?

న్యూఢిల్లీ, జూలై 1: స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటిసారి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశ ప్రజలు అందరికీ ఒకే చట్టం అమలు చేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ఎన్డీయే సిద్ధం కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశంపై సూచనలు కోరుతూ కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ జాతీయ లా కమిషన్ చైర్మన్ బిఎస్ చౌహాన్‌కు లేఖ రాశారు. లా కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్నది బిజెపి యోచన.

స్వచ్ఛ్భారత్ వైపు అడుగు ముందుకు

ఇందూర్, జూలై 1: స్వచ్ఛ భారత్‌లో భాగంగా నిజామాబాద్‌ను సంపూర్ణ పారిశుద్ధ్య జిల్లాగా రూపొందించేందుకు చేపట్టిన చర్యలు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయ సంఘాలు, ఉద్యోగులు సమష్టిగా గ్రామ పంచాయతీలను యూనిట్లుగా తీసుకుని ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వాటి వినియోగం పట్ల కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరీ చేస్తున్న 12వేల విలువ చేసే యూనిట్‌తోనే నిర్ణీత కొలతలలో మరుగుదొడ్డి నిర్మాణంతో పాటు స్నానపు గదులను కూడా మంజూరీ చేయడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన కుటుంబాలు స్వచ్ఛ్భారత్ అమలులో భాగస్వాములవుతున్నాయి.

శ్రీరాంసాగర్‌లోకి స్వల్పంగా ఇన్‌ఫ్లో

బాల్కొండ, జూలై 1: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి 2వేల క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలోని నిజామాబాద్, నాందేడ్, ఆదిలాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షం కారణంగా వరదనీరు వచ్చి చేరడంతో శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 1046.80అడుగులు 4.92టిఎంసిలకు చేరుకుందని ప్రాజెక్టు ఎఇ మోహన్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు 90టిఎంసిలు కాగా, గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1056.00అడుగులు 10.80టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు.

’ముసలమ్మ‘ ఇక మూలనపడినట్లేనా..?

మోర్తాడ్, జూలై 1: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రిపుల్ ఆర్ పథకంలో మంజూరు పొందిన మోర్తాడ్ ములసమ్మ చెరువుకు మహర్దశ పట్టే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ముసల్మను ట్రిపుల్ ఆర్‌లో ఎంపిక చేసి దాదాపు కోటీ 35లక్షల రూపాయల వరకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ నిధులు మాత్రం విడుదల కాలేదు. పరిపాలన పరమైన అనుమతులు కూడా రానట్లు అధికారవర్గాల సమాచారం. గతంలో ఈ పథకం కింద పనులను పూర్తి చేసుకున్న చెరువుల యొక్క తుది నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి అందకపోవడం వల్లే మలి విడత జాబితాలో ఎంపికైన చెరువులకు మంజూరీ ఇచ్చినప్పటికీ, నిధులు మాత్రం విడుదల చేయకపోవడం వల్ల పనుల యోగం పట్టడం లేదు.

వర్ని, కోటగిరి మండలాలు నిజామాబాద్‌లోనే

కోటగిరి, జూలై 1: జిల్లాల పునర్ విభజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ, బీర్కూర్ మండలాలు కామారెడ్డి జిల్లాలో కలుపుతుండగా, కోటగిరి, వర్ని మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కోటగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మండల మైనార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, వర్ని, కోటగిరి మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు.

గిడ్డంగులను పరిశీలించిన మార్కెటింగ్ శాఖ డైరెక్టర్

భిక్కనూరు, జూలై 1: మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో 3కోట్లతో నిర్మిస్తున్న గిడ్డంగుల నిర్మాణాన్ని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం పరిశీలించారు. గిడ్డంగి నిర్మాణ పనులు ఏ విధంగా సాగుతున్నాయని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎఎంసి చైర్మన్ అమృత్‌రెడ్డి మాట్లాడుతూ, 3కోట్ల రూపాయలతో ఇటీవలే నిర్మాణం చేపట్టామని, త్వరలోనే పూర్తిస్థాయి మార్కెట్ యార్డును ఏర్పాటు చేసేందుకు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారన్నారు. మార్కెట్ యార్డు నిర్మాణం కోసం తీర్మానం చేశామని వివరించారు.

Pages