S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరకోస్తాకు వర్ష సూచన

విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య దిశగా కదులుతుందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయని, గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

‘సాగర్’ భద్రత కట్టుదిట్టం

నాగార్జునసాగర్, జూలై 1: నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై రెండు రోజులుగా భద్రతను పెంచామని నాగార్జునసాగర్ డ్యాం భద్రత అధికారి రమణారెడ్డి తెలిపారు. హైద్రాబాద్‌లో ఉగ్రవాద సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో రాష్టవ్య్రాప్తంగా పోలీసుశాఖ ఇంటెలిజెన్స్ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ పర్యాటక కేంద్రం, బహళార్థ సాధక ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై నిఘాను పెంచారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ సాగర్ ప్రాజెక్టు పరిదిలోని ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద, సాగర్ ప్రధాన డ్యాంపైన, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాను పెంచామని, సిబ్బందిని అలర్ట్ చేశామని తెలిపారు.

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

నిజామాబాద్, జూలై 1: నిజామాబాద్ కేంద్రంగా గంజాయిని స్మగ్లింగ్ చేసే అంతర్రాష్ట్ర ముఠాను నిజామాబాద్ రూరల్ పోలీసులు గట్టి నిఘా వేసి చాకచక్యంగా అరెస్టు చేశారు. వారి వద్ద నుండి సుమారు 3కోట్ల రూపాయల విలువ చేసే శుద్ధి చేయబడిన ఎండు గంజాయి నిల్వలతో పాటు 7.12లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు పట్టుబడగా, వారిలో దేశ రాజధాని ఢిల్లీ నగరానికి చెందిన ఇద్దరితో పాటు వారికి నిజామాబాద్ కేంద్రంగా గంజాయిని సమకూరుస్తున్న వర్ని మండలం శ్రీనగర్ గ్రామ నివాసి శంకర్ ఉన్నారు.

కాళేశ్వరం కాల్వల పనుల్లో ముందడుగు

నల్లగొండ, జూలై 1: కరవు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా రైతాంగానికి ఒకవైపు డిండి ఎత్తిపోతలతో కృష్ణా నీరు, మరోవైపు ప్రాణహిత-చేవెళ్ల (కాళేశ్వరం) ప్రాజెక్టుతో గోదావరి జలాలను, ఇంకోవైపు మూసీ కాల్వల విస్తరణతో సాగునీటిని అందించాలన్న ప్రభుత్వం లక్ష్యం క్రమంగా ముందడుగు వేస్తోంది. దేవరకొండ, మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాలకు సాగునీరందించే డిండి ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ మరో వారం రోజుల్లో నిర్వహించనుండగా, మూసీ కాలువల విస్తరణలో భాగంగా బునాదిగాని, పిల్లాయిపల్లి కాల్వల పనులు కొనసాగుతున్నాయి.

తెరుచుకున్న బాబ్లీ గేట్లు

నిజామాబాద్, జూలై 1: గోదావరి నదిపై నిజామాబాద్ జిల్లా సరిహద్దున మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం పైకి లేపి దిగువ గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ వర్షాకాలం సీజన్ ముగింపు సమయమైన అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ ప్రాజెక్టు గేట్లను యథాతథంగా తెరిచి ఉంచనున్నారు. శుక్రవారం ఇరు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు, బాబ్లీ నీటి వాడకాన్ని పర్యవేక్షించేందుకు అత్యున్నత స్థాయిలో నియమించిన సిడబ్ల్యుసి కమిటీ ప్రతినిధుల సమక్షంలో 14గేట్లను పైకి ఎత్తి నీటిని వదిలారు.

రాష్ట్ర పండుగగా రంజాన్

విజయవాడ, జూలై 1: రంజాన్ పండుగ రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, ఐటి శాఖల మంత్రి డా.పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. స్థానిక చిట్టినగర్‌లోని ఈద్‌గాహ్ షాదీఖానాలో శుక్రవారం ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫాను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి అందజేవారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి జిల్లాలోను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారికంగా ఇఫ్తార్ విందును ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి వెల్లడించారు.

ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వారం వరకూ ఉత్తర్వులు ఇవ్వం

హైదరాబాద్, జూలై 1: తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే విషయమై వచ్చే వారం వరకు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయబోమని తెరాస సర్కారు హైకోర్టుకు తెలియజేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ, ఈ అంశంపై వచ్చే వారం వరకు తుది నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు.

కాటన్ బ్యారేజిపై దొంగలు పడ్డారు!

రాజమహేంద్రవరం, జూలై 1: తూర్పు గోదావరి జిల్లాలో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజిపై దొంగలు పడ్డారు. బ్యారేజీ నిర్వహణలో కీలకమైన బ్రేక్ కాయల్స్ మాయమయ్యాయి. ఒక్కొక్కటి సుమారు రూ.10 వేలు విలువచేసే మొత్తం 140 కాయల్స్ మాయమయ్యాయి. గేట్ల ఎత్తివేతలో ఈ బ్రేక్ కాయల్స్ కీలకంగా పనిచేస్తాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆలస్యంగా గుర్తించారు. బ్యారేజి గేట్లలో ఎంతో కీలకమైన బ్రేక్ కాయల్స్‌కే భద్రత లేదంటే ఇక బ్యారేజికి ఎంత భద్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిపై ఉన్న ఎంతో కీలకమైన ఈ బ్యారేజి నిర్వహణలో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది.

రాష్ట్రంలో భూగర్భ జలసిరి

విజయవాడ, జూలై 1: రాష్ట్రాన్ని సంపూర్ణ కరవు రహిత ప్రాంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన ‘నీరు-ప్రగతి’ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. గతంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు వేయిస్తే నీరుపడక, వర్షాలు కురవక, పంట పొలాలు ఎండిపోయి పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూగర్భ జలాల గురించి గతంలో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. దాంతో సాగునీరుతో పాటు మంచినీరు కూడా కరువైంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కరువు తాండవించింది. దాంతో అటువంటి ప్రాంతాల్లో వర్షాలు కురిస్తేనే అంతంత మాత్రంగా పంటలు పండేవి. వర్షం పడకపోతే పంటలు ఎండిపోయేవి.

వడివడిగా విమానయాన విస్తరణ

న్యూఢిల్లీ, జూలై 1: ప్రాంతీయ విమాన అనుసంధాన పథకాన్ని (ఆర్‌సిఎస్) కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆవిష్కరించింది. కొత్త పౌరవిమానయాన విధానంలో భాగంగా చిన్న పట్టణాలకు కూడా విమానయాన సేవలు అందాలనే ప్రభుత్వ యోచనకు అనుగుణంగా ఆర్‌సిఎస్‌ను తీసుకొచ్చారు. విమానయాన సంస్థలు, విమానాశ్రయాల నిర్వహణ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలతోసహా భాగస్వాములందరి అభిప్రాయాలను దీనిపై కేంద్రం సేకరిస్తోంది. మూడు వారాల్లోగా తమ అభిప్రాయాలను పంపాల్సిందిగా కేంద్రం కోరుతుండగా, దీనిపై ఆగస్టులో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 90 విమానాశ్రయాలను లక్ష్యంగా మోదీ సర్కారు నిర్దేశించుంది.

Pages