S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ పిజి ఇసెట్ ఫలితాల వెల్లడి

హైదరాబాద్, జూన్ 16: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ పిజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పిజి ఇసెట్ ఫలితాలను ఉస్మానియా యూనివర్శిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి గురువారం ఉదయం విడుదల చేశారు.

ప్రతి కుటుంబానికి రూ.లక్ష బీమా

విజయవాడ, జూన్ 16: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జీవితాల్లో మార్పులు తెచ్చి వారి సర్వతోముఖాభివృద్ధికై ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశంలో మరిన్ని వైద్య విద్యాలయాల స్థాపనకు కేంద్రం కృషి చేస్తోందని ప్రతీ కుటుంబానికి రూ.లక్ష బీమా కల్పిస్తామని ఆయన తెలిపారు. వెంకయ్యనాయుడు నాలుగోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా విజయవాడకు విచ్చేసిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని గురువారం సందర్శించారు.

అవకతవకలుంటే నిధులు ఆపేస్తాం

పనాజీ, జూన్ 16: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ విద్యుదీకరణ పథకాలు, పట్టణాల్లో విద్యుత్ వౌలిక సదుపాయాల ఆధునీకరణ వంటి వాటికి సంబంధించి కేటాయించిన నిధుల వినియోగంలో అక్రమాలు జరిగితే సదరు రాష్ట్రాలకు నిధులు నిలిపివేస్తామని ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ హెచ్చరించారు.

తెలియకుండా మాట్లాడొద్దు

హైదరాబాద్, జూన్ 16: కేంద్రప్రభుత్వం ఏం చేస్తోందో, ఎలా చేస్తోందో వివిధ అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు ఎలా చేరువ చేస్తోందో తెలుసుకోకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సరికాదని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ఇవన్నీ తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై నిజాలను తెలుసుకోవాలని కెటిఆర్‌కు ఆయన సూచించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను ప్రయోగిస్తూ ప్రతి అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆయన అన్నారు. రెడియల్ కోడ్ కోసం కేంద్రం సానుకూలంగా స్పందించిందని అన్నారు. దీని కోసం 80 కోట్ల రూపాయిలు కేటాయించిన విషయం తెలుసుకోవాలని అన్నారు.

నో ఫ్లైజోన్ చేయలేం

న్యూఢిల్లీ, జూన్ 16: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల కొండల క్షేత్ర ప్రాంతాన్ని నో ఫ్లైజోన్ చేయలేమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. ఆయన గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలో ఈ విషయం తెలిపారు. కోట్లాది మంది భక్తుల కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల ప్రాంతాన్ని నో ఫ్లైజోన్‌గా ప్రకటించాలని కోరుతూ తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండల పై నుండి విమానాలు ప్రయాణం చేయటం అభిలషణీయం కాదని రాష్ట్ర ప్రభుత్వం తమ లేఖలో పేర్కొన్నది.

కుక్కలకు కు.ని

కర్నూలు, జూన్ 16: కుక్కల బారి నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలన్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఎట్టకేలకు అమలులోకి వచ్చాయి. తొలివిడతగా కర్నూలు నగరపాలకసంస్థ, నంద్యాల పురపాలక సంఘంలో సుమారు 14 వేల కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సలు నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం కర్నూలులో ఈ ప్రక్రియను ప్రారంభించారు. వీధికుక్కల బారినపడి తీవ్ర గాయాలైన వారే కాకుండా ప్రాణాలు కోల్పోయిన వారూ ఉండటంతో ప్రభుత్వం కుక్కలపై దృష్టి సారించింది. అయితే జంతుప్రేమికుల విన్నపం మేరకు మధ్యేమార్గంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్తచ్రికిత్సలు చేయాలని హైకోర్టు ఏడాది క్రితం ఆదేశాలు జారీ చేసింది.

చైతన్య పింగళికి బాల సాహితీ పురస్కారం

న్యూఢిల్లీ, జూన్ 16:బాల, యువ సాహిత్య పురస్కారాల విజేతలను కేంద్ర సాహిత్య అకాడమీ గురువారం ప్రకటించింది. 2016 సంవత్సరానికి తెలుగు సాహిత్యంలో చైతన్య పింగళి రచించిన ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ చిన్న కథలకు యువ సాహిత్య పురస్కారం లభించిది. ఆలపాటి వెంకట సుబ్బారాపు రచించిన ‘స్వర్ణపుష్పాలు’ కవిత్వానికి బాల సాహిత్య పురస్కారం లభించింది. నవంబర్ 14న బాలల దినోత్సవంనాడు బాల సాహిత్య పురస్కారాన్ని, జనవరి 1న యువ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.

నిత్యజీవితంలో అణుఇంధనం

హైదరాబాద్, జూన్ 16: నిత్యజీవితంలో ప్రతి అంశానికీ అణుఇంధనంతో ముడిపడి ఉంటుందని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ చైర్మన్, సిఇఓ జి కళ్యాణకృష్ణన్ వ్యాఖ్యానించారు. ఎంపి చారి 9వ స్మారక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ హైథరాబాద్ రీజనల్ సెంటర్ నిర్వహించింది. న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎన్ సాయిబాబా స్మారక ఉపన్యాసం ఇస్తూ సాధారణ మనిషికి సైతం ఏన్నో విషయాల్లో అణుఇంధన అభివృద్ధి వల్ల మేలు జరుగుతుందని చెప్పారు.

మళ్లీ నష్టాల్లో మార్కెట్లు

ముంబయి, జూన్ 16: బుధవారం ఒకరోజు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి నష్టాలతో ముగిశాయి. మరిన్ని ఉద్దీపకాలను ప్రకటించడానికి బ్యాంక్ ఆఫ్ జపాన్ నిరాకరించడం, అమెరికా ఆర్థిక వృద్ధి అంచనాలను ఫెడరల్ రిజర్వ్ తగ్గించువడం, ఐరోపా కూటమినుంచి బ్రిటన్ వైదొలగడంపై త్వరలో జరగనున్న రెఫరెండం భయాలులాంటి పలు అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ప్రారంభంనుంచి భారీనష్టాల మధ్య సాగాయి. ఒక దశలో 400 పాయింట్ల దాకా పడిపోయిన బిఎస్‌ఇ సెనె్సక్స్ చివర్లో ఎంపిక చేసిన స్టాక్స్‌లో కొనుగోళ్లతో కొంత కోలుకున్నప్పటికీ 201 పాయింట్ల నష్టంతో 26,525.46 పాయింట్ల వద్ద ముగిసింది.

ఫిక్కి-ఐఫా గ్లోబల్ ఫోరం మీట్‌కు స్పెయన్ వెళ్లనున్న కెటిఆర్

హైదరాబాద్, జూన్ 16: స్పెయిన్‌లో ఈనెల 24న జరిగే ఫిక్కి-ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరం సమావేశానికి తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావును ఆహ్వానించారు. ఈ సమావేశాల్లో జరిగే ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొనాలని ఫిక్కీ నిర్వాహక బృందం కెటిఆర్‌ను కోరింది. ‘సినర్జీస్ ఇన్ ఐటి, స్మార్ట్‌సిటీ, టూరిజం ప్రమోషన్’ అనే అంశంపై ప్రసంగించాలని ఆయనను ఆహ్వానించారు. ఐఫా సినిమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ప్రపంచంలోని వివిధ నగరాల్లో ప్రతి సంవత్సరం జరగుతున్న విషయం తెలిసిందే. ఈసారి స్పెయిన్ లోని మాడ్రిడ్‌లో జరిగే ఈ అవార్డుల కార్యక్రమంలో ప్రతి ఏడాది నిర్వహించినట్టుగానే బిజినెస్ ఫోరమ్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

Pages