S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమిత్‌షా చెప్పేవన్నీ అవాస్తవాలే

న్యూఢిల్లీ, జూన్ 16: తెలంగాణకు కేంద్ర చేసిన సహాయం విషయంలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా అవాస్తవాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాల చారి విమర్శించారు. ఢిల్లీలో గురువారం వేణుగోపాలాచారి విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి అదనంగా కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆరోపించారు. కేంద్రం నుండి తెలంగాణకు రూ 96 వేల కోట్లు మంజూరు చేశామని చేప్పడం అవాస్తమని, అలాగే అమిత్ షా చెప్పేదే వాస్తవం అయితే కేంద్రం తెలంగాణకు ఇప్పటివరకు విడుదల చేసిన నిధులపై శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

స్మార్ట్ సిటీగా కరీంనగర్!

న్యూఢిల్లీ, జూన్ 16: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీల పథకం జాబితాలో కరీంనగర్‌కు స్థానం లభించింది. కరీంనగర్ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ఎంపీ వినోద్‌కుమార్ గురువారం ఇక్కడ పిలుపునిచ్చారు. ఆకర్షణీయ నగరాల (స్మార్ట్‌సిటీ) జాబితాలోకరీంనగర్‌కు స్థానం లభించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వెళ్లేవారు వెళ్లిపొండి

ఆదిలాబాద్, జూన్ 16: పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించి బేరసారాలు, ప్రలోభాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, టిఆర్‌ఎస్ కుటిల రాజకీయాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం సాగిస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. గురువారం మహారాష్టల్రోని యవత్‌మాల్ జిల్లాలో జరిగే రైతు సదస్సులో పాల్గొనేందుకు వెళ్తూ దిగ్విజయ్‌సింగ్ ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సాగుతున్న వలసల పరంపరపై ఘాటుగా స్పందించారు.

కాళేశ్వరంలో వరుణ యాగం

మహదేవపూర్, జూన్ 16: కరీంనగర్ మహదేవపూర్ మండ లంలో జిల్లా త్రివేణి సంగమమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో గురువారం వరుణ యాగం నిర్వహించారు. మూడు నదుల సంగమమంలోని గోదావరి జలాలను కలశాల ద్వారా స్వామివారి ఆలయానికి తీసుకువచ్చి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక జలాభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆలయ ఈఓ హరిప్రకాష్ అన్నారు. ఈ యాగ హోమ ప్రధాన ఉద్దేశం వర్షాలు బాగా కురిసి, తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని తెలిపారు.

కాంట్రాక్టుల కోసం కాదు... అభివృద్ధి కోసమే!

నల్లగొండ, జూన్ 16: కాంట్రాక్టుల కోసమే తాము టిఆర్‌ఎస్‌లో చేరామంటూ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఎంపి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విమర్శించడం పూర్తి అవాస్తవమని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావు ఖండించారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుత్తా మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న నేతల్లో అనేకమంది టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు చేస్తున్నారని మరి వారి సంగతేమిటో దిగ్విజయ్ చెప్పాలని నిలదీశారు.

స్టే ఉండగా ఎలా తొలగిస్తారు?

తాడేపల్లి, జూన్ 16: రహదారుల విస్తరణ కోసం రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలోని సుమారు 20 ఇళ్ళు తొలగించే విషయంలో అధికారులకు, స్థానికులకు మధ్య వివాదం నెలకొంది. గత రెండు వారాలుగా రహదారుల వెడల్పుకు రోడ్డు పక్కనే ఉన్న నివాసాలకు అధికారులు మార్కింగ్ చేశారు. కొద్ది రోజుల క్రితం వరకూ రెవెన్యూ, ఆర్ అండ్ బి, అధికారులు, ప్రత్యేక సర్వేయర్ల బృందం ఉండవల్లిలోని ప్రధాన రహదారి వెంట సర్వేలు నిర్వహించడాన్ని ప్రశ్నించగా గ్రామకంఠాలు తేల్చేవిషయమని చెప్పిన విషయం విదితమే. అధికారుల చర్యలను సవాలు చేస్తూ బాధితులు కోర్టును ఆశ్రయించి, కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ని ఫ్లెక్సీల రూపంలో తమ ఇళ్ల ముందు బాధితులు ఏర్పాటు చేశారు.

ఎన్నికల హామీలు అమలు చేయంచండి

విశాఖపట్నం, జూన్ 16: వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు అమలు జరిగేలా చూడాలని కాంగ్రెస్ నేత, సామాజిక కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు రాష్టప్రతి, కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రాలను పంపనున్నట్లు వెల్లడించారు. విశాఖలో గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుడూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అమలు సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత వాటి అమలు గురించి మరిచిపోతున్నారన్నారు.

సంస్థాగతంగా మరింత పుష్టి

గుంటూరు, జూన్ 16: తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కసరత్తు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లోగా పార్టీ మండల, గ్రామ, బూత్ కమిటీల స్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. జిల్లాల వారీ పరిశీలకులను నియమించి నెలవారీ సమీక్షా సమావేశాలు నిర్వహించడంతో పాటు అందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అందించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించారు.

ఏపి మాకు ప్రత్యేకం

నెల్లూరు, జూన్ 16: రెండేళ్ల పాటు ఎటువంటి అవినీతి మరక అంటకుండా పాలన అందించడమే ఎన్ డి ఏ ప్రభుత్వ తొలి విజయంగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ డి ఏ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎటువంటి అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు ఎదుర్కోలేదని, సమర్థవంతమైన పారదర్శక పరిపాలన ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో వౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందులో భాగంగా రహదారులు, రైల్వేలకు బడ్జెట్‌లో రూ.1,25,000 కోట్ల నిధులు వెచ్చించామన్నారు. గతంలో రోజుకు దేశంలో 7 కి.మీ.

తూ.గో.లో కొనసాగుతున్న ఉద్రిక్తత

రాజమహేంద్రవరం, జూన్ 16: ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత రోజు రోజుకు పెరుగుతోంది. దీక్ష ప్రారంభం నుండీ నిషేధాజ్ఞల పేరుతో పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకుంటున్నా, మెల్లమెల్లగా వాటి ఉల్లంఘటనలు పెరుగుతున్నాయి. తమ నాయకుడిని చూడడానికి వెళ్ళనీయకుండా పోలీసులు నిరోధించడం అన్యాయమని, కనీసం టివీల ద్వారానైనా ముద్రగడను తమకు చూపించాలని కిర్లంపూడి మండలంలోని సింహాద్రిపురం మహిళలు గురువారం రోడ్డుపై బైఠాయించారు. తమకు రెండు గంటలలోగా ముద్రగడను టివీల్లో చూపకపోతే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని భారీ సంఖ్యలో మహిళలు పురుగుల మందుల డబ్బాలతో ఆందోళనలో పాల్గొన్నారు.

Pages