S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనుల్ని నిరంతరం పర్యవేక్షించాలి

విజయవాడ (కార్పొరేషన్), మే 30: నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో ఎటువంటి నాణ్యతా లోపం లేకుండా నిరంతర పర్యవేక్షణ జరపాలని నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ విఎంసి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. నగర పర్యటనలో భాగంగా 29వ డివిజన్ లోని ఊర్మిళా సుబ్బారావునగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. మెయిన్ రోడ్డు డ్రైయిన్ నిర్మాణం అనంతరం డ్రైయిన్‌కు రోడ్డుకు మధ్యగల మార్జిన్ స్థలాల్లో మట్టిని నింపకుండా గోతుల మయంగా ఉండటాన్ని గుర్తించిన ఆయన తక్షణమే మట్టిని నింపాలన్నారు.

పోలీసు స్వాధీనం చేసుకున్న వాహనాల వేలం

విజయవాడ (క్రైం), మే 30: పోలీసు స్వాధీనంలో ఉన్న ఆచూకీ తెలియని వాహనాలను సోమవారం వేలం ప్రక్రియ ముగిసింది. పోలీసు కమిషనరేట్ పరిథిలో స్వాధీనం చేసుకున్న 244 మోటారు వాహనాలను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల నుంచి బందరురోడ్డు సిటి ఆర్మ్‌డ్ రిజర్వు గ్రౌండ్స్‌లో నిర్వహించారు. డిసిపి జివిజి అశోక్‌కుమార్ ఆధ్వర్యాన వేలం నిర్వహించారు. సుమారు 200 మంది పాటదారులు వేలంలో పాల్గొన్నారు. ఈవేలం పాటలో వాహనాలను వేలం వేయగా ప్రభుత్వానికి 9లక్షల 13వేల రూపాయలు ఆదాయం సమకూరింది.

ఫెస్‌బుక్ నకిలీ అకౌంట్లతో యువతులకు వేధింపులు

విజయవాడ (క్రైం), మే 30: ఫెస్‌బుక్ నకిలీ అకౌంట్లతో మహిళలను వేధింపులకు గురి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబర్ పోలీసింగ్ సెల్ కటకటాల వెనక్కు నెట్టింది. సదరు యువతులకు అసభ్యకర మెసేజ్‌లు, నగ్న చిత్రాలు పోస్టు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితుల ఫిర్యాదుల మేరకు సత్యనారాయణపురం, పెనమలూరు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ తరహా నేరాలకు కట్టడి చేసేందుకు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ఆదేశాలతో ఈ ‘సైబర్ పోలీసింగ్ సెల్’ వింగ్ ఏర్పాటైంది.

2న నవనిర్మాణ దీక్ష

విజయవాడ (క్రైం), మే 30: రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో రెండో నవ నిర్మాణ దీక్షకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇందుకోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 2వ తేదీన బెంజిసర్కిల్ వద్ద జరిగే నవ నిర్మాణ దీక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా కల్పించే దిశగా సంకల్పించిన ఈనవ నిర్మాణ దీక్ష రెండో ఏడాది జరుపుకుంటోంది. కాగా.. ఈకార్యక్రమానికి భారీగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు తరలిరానున్నారు.

అన్న క్యాంటిన్ తరహాలో ఆటోనగర్‌లో ప్రత్యేక క్యాంటిన్

విజయవాడ, మే 30: స్వాతంత్య్రం వచ్చి 67ఏళ్లు దాటుతున్నా విజయవాడ నగరం అభివృద్ధిపరంగా అడుగు ముందుకేయలేదు. అధికారంలోకి ఏనాటికైనా రాగలమనే నమ్మకం వారిలో లేకపోయినా కేవలం తమ స్వప్రయోజనాల కోసం కమ్యూనిస్టులు సంకుచిత భావాలతో అభివృద్ధిని అడ్డుకుంటూ నిత్యం ధర్నాలు, ఆందోళనలతో విజయవాడ నగరాన్ని నాశనం చేశారంటూ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) నిప్పులు చెరిగారు. 2000 సంవత్సరం జూన్‌లో బెంగుళూరులో శ్రీమాన్ మధు పండిట్ దాస ఆధ్వర్యంలో స్థాపించబడిన అక్షయపాత్ర నాడు కేవలం ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో 1500 మంది పిల్లలకు మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది.

క్రికెట్ స్టేడియాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఇబ్రహీంపట్నం, మే 30: క్రికెట్ ప్రాంగణం అన్ని సౌకర్యాలతో నిర్మించటం జరిగిందని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మండలంలోని మూలపాడులో సుమారు రూ.17 కోట్లతో అత్యాధునిక ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియంను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ చల్లని వాతావరణంలో క్రీడాకారులకు ఎంతో ఆనందం కలుగుతుందని వివరించారు. నూతన రాష్ట్రానికి ఇది అత్యధిక అధునాతనంగా ఉందని వివరించారు.

పుష్కరాలకు రెవెన్యూ, పోలీసుల శాఖల మధ్య సమన్వయమే కీలకం

పాతబస్తీ, మే 30: నవ్యాంధ్ర రాష్ట్రంలో రానున్న పుష్కరాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా సవ్యంగా నిర్వహించి శభాష్ అనిపించుకోవాలని అధికారులు సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది. పుష్కర స్నాన ఘాట్స్, పుష్కర నగర్ తదితరాల సౌకర్యాలు కల్పనకు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నారు. అయితే ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తరువాత గతంలో ఎన్నడూలేని విధంగా నదిలో నీరు తగ్గాయి. దాంతో గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలాంటి తరుణంలో నదిలో నీటి నిలువలు ఎంత ఉంటాయో అంతా దైవాదీనంపై ఆధారపడింది.

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్ పరీక్షలకు 172 మంది విద్యార్థుల గైర్హాజర్

హైదరాబాద్, మే 30: ఇంటర్మీడియట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా సోమవారం ఉదయం ఇంటర్మీడియెట్ ఫస్టియర్ జియాలజి, హోమ్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ అండ్ బ్రిడ్జ్ కోర్సెస్ మధ్యాహ్నం ఇంటర్ సెకండియర్ జియాలజి, హోమ్‌సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ అండ్ బ్రిడ్జ్ కోర్సెస్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు ఆర్‌ఐఓ మరియు కన్వినర్ ఎ.రవికుమార్ తెలిపారు.ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 418 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 246 మంది పరీక్షలు వ్రాశారని, 172 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.

నాలాలు కబ్జా చేస్తే ఖబర్దార్

శేరిలింగంపల్లి, మే 30: నాలాలు కబ్జా చేస్తే ఎంతటివారైనా వదిలిపెట్టమని నగర మేయర్ బొంతు రాంమోహన్ హెచ్చరించారు. శేరిలింగంపల్లి సర్కిల్ 12 పరిధిలోని దీప్తిశ్రీనగర్ వద్ద జాతీయ రహదారిపై నాలా మళ్ళింపు ఫిర్యాదుపై సోమవారం మేయర్ పరిశీలించారు. నాలా మళ్ళింపువల్ల పరిసర కాలనీలు వరద ముంపుకు గురవుతాయని చందానగర్ కార్పొరేటర్ బొబ్బనవతరెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ కార్పొరేటర్ మేక రమేశ్, వెస్ట్‌జోన్ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకెళ్ళారు. తిరుమల ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ బిల్డర్ ప్రకాశ్ చౌదరి దాదాపు మూడెకరాల్లో మల్టీఫ్లెక్స్ మాల్ నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవాలకుఏర్పాట్లు

హైదరాబాద్, మే 30: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో జూన్ 2న వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఆయా శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా సక్రమంగా నిర్వర్తించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టరు రాహుల్ బొజ్జా ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో రాష్ట్ర అవతర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు.

Pages