S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలుఅంశాలపై అమెరికాలోఅధ్యయనం

హైదరాబాద్, మే 30: పోలీసు శాఖలో మరిన్ని మార్పులు తెచ్చేందుకుగానూ స్టడీ టూర్‌పై విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన నగర కమిషనర్ మహేందర్ రెడ్డిని తెలంగాణ పోలీసు అధికారుల సంఘం హైదరాబాద్ శాఖ ప్రతినిధులు సత్కరించి అభినందించారు. నగర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్‌రెడ్డి, నగర పోలీసు కో ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు పి.మాధవరెడ్డి, బి.అప్పల్‌సూరి, కోశాధికారి బి.శ్రీనివాసరెడ్డి, సభ్యులు ఎం.రఘురామరాజు, కె.జనార్దన్‌రెడ్డిలతో కూడిన బృందం సోమవారం బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయంలో మహేందర్‌రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.

రాష్ట్రంలోనే రాజేంద్రనగర్‌కు మంచి గుర్తింపు

రాజేంద్రనగర్, మే 30: అంతర్జాతీయ స్థాయిలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి గుర్తింపు ఉందని, అదే స్థాయిలో అభివృద్ధిలో తీర్చిదిద్దుతూ ముందుకు దూసుకెళ్తున్నానని ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లో రూ.1.93 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు పనులు, సివరేజ్ పైపులైన్ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్‌కు అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని, అన్ని సంస్థలు నెలకొని ఉన్నాయని స్థాయిలో అభివృద్ధి చేయడానికి పోటీ పడి పని చేస్తున్నానన్నారు.

తెరాసలో మహిళలకు ప్రాధాన్యత

అల్వాల్, మే 30: తెరాసలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామనీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌లో నామినేటెడ్ కో- ఆప్షన్ సభ్యురాలిగా నియమితులైన గొట్టిముక్కల జ్యోతిని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో కల్సి సన్మానించారు.

స్వర్గం హృదయంలోనే ఉందనుకుంటే జీవితమే ఆనందం

హైదరాబాద్, మే 30: మనిషి చనిపోయాక స్వర్గానికి వెళ్ళాలనుకుంటాడు కానీ ఆ స్వర్గం నీ హృదయంలోనే ఉందనుకుంటే జీవితమంతా ఆనందం మానవాళి అభ్యున్నతికి కృషి చేస్తే కలిగే ఆనందమే హృదయానందం. బుద్ధుడు, పూలె, అంబేద్కర్‌లు మానవాళి కోసం జీవితాలను త్యాగం చేసారు అని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా సోమవారం ఉదయం రవీంద్రభారతిలో జీవన సాఫల్య పురస్కారాలు, సేవారత్న పురస్కారాల ప్రదానోత్సవానికి స్వామిగౌడ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.

తెలుగు సంస్కృతి చాటిచెప్పే ‘్భరతీయం’

హైదరాబాద్, మే 30: తెలుగువారు ఏ రాష్ట్రంలో వున్నా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు మార్చిపోకుండా తలుగునేలపై కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నందులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె.వి.రమణాచారి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కళారాధనలో భాగంగా సోమవారం సాయంత్రం రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణంలో మూడురోజుల ‘్భరతీయం’ కార్యక్రమాన్ని కెవి రమణాచారి ప్రారంభించారు.

సంగీతంలో డిప్లొమా పరీక్షలు వాయిదా

హైదరాబాద్, మే 30: తెలుగు విశ్వవిద్యాలయం జూన్ 2, 3, 4 తేదీలలో నిర్వహించాల్సిన సంగీతం డిప్లొమా పరీక్షలు వాయిదా వేసామని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షలు జూన్ 13, 14, 15 తేదీలలో జరుగుతాయని విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని తెలుగు విశ్వవిద్యాలయం తెలిపింది.

పాతబస్తీలో రంజాన్ ఏర్పాట్ల సమీక్ష

హైదరాబాద్, మే 30: రంజాన్ మాసం సందర్భంగా జలమండలి పరంగా చేపడుతున్న ఏర్పాట్లలో భాగంగా బోర్డు మెయింటనెన్స్ విభాగం డైరెక్టర్ జి.రామేశ్వరరావు పాతబస్తీలోని పలు ప్రాంతాలను సోమవారం సందర్శించి చేపడుతున్న, చేపట్టనున్న పనులను సంబంధిత అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఇందులో భాగంగా పాతబస్తీలో ప్రధానమైన చార్మినార్, మక్కామసీదుతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో దాదాపు 180 మసీదుల వద్ద జలమండలిపరంగా ఎండి దానాకిశోర్ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తాండూర్‌లో అవినీతి రాజ్యం

తాండూరు, మే 30: తాండూరు మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుందని విపక్ష పార్టీలైన కాంగ్రెస్, టిడిపి, బిజెపి సభ్యులతో పాటు అధికార భాగస్వామ్యపక్షమైన ఎంఐఎం పార్టీ సభ్యులు సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. 18 అంశాలతో కూడిన ఎజెండా అంశాలలో 18వ అంశం మినహా 17 అంశాలను కౌన్సిల్ సమావేశంలో సభ్యులు వాగ్వివాదాల మధ్య ఆమోదించారు.

మహిళపై అత్యాచారం

రాజేంద్రనగర్, మే 30: నగరశివారులోని పాతబస్తీ పహడీషరీఫ్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అత్యాచార దృశ్యాలు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. ఆమె వద్దనున్న సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను అపహరించినట్టు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులు అహ్మద్ జాసిమ్ లతీఫ్‌ఖాన్, సయ్యద్ ఇమ్రాన్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పహడీషరీఫ్ పోలీసులు తెలిపారు.

సత్వరమే పెండింగ్ కేసుల పరిష్కారం

వికారాబాద్, మే 30: పెండింగ్‌లో ఉన్న కేసులు, వారెంటు కేసులను సత్వరమే పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా ఎస్పీ బి.నవీన్‌కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదిదారుడితో మర్యాదగా మాట్లాడాలని, కావాల్సిన న్యాయాన్ని చట్టపరిధిలో సత్వరమే అందించాలని స్పష్టం చేశారు.

Pages