S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరిన వారికి కొంగుబంగారం

భోగము, మోక్షము రెండునూ కోరుకున్నవారికి లభింపచేయు స్వామి శ్రీ ఆంజనేయస్వామి.
అట్టి దివ్య మహిమాన్వితుడైన శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజించే సుదినమే హనుమజ్జయంతి. మంగళవారం, శనివారం ఆంజనేయునికి ప్రీతికరాలు. వైశాఖ బహుళ దశమి, పూర్వాబాద్ర నక్షత్రం వైధృతి యోగంలో ఆ స్వామి జన్మించినట్లు ‘‘పరాశర సంహిత’’లో కలదు.

- పీసపాటి నాగేశ్వరశర్మ

రాముడు, కృష్ణుడు ఆదర్శపురుషులు కారా?!

ఈ మధ్య విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా ఉన్న కొందరు పెద్దలే శ్రీరాముని, శ్రీకృష్ణుని గురించి అవాకులు చెవాకులు రువ్వుతున్నారు. శ్రీమద్రామాయణం, మహాభారతం చదివిన వారికి ఈ విమర్శలకు జవాబులు తెలుస్తాయి. కానీ ఈ కాలంలో ఆంగ్ల మాథ్యమంలో అధ్యయనం చేసిన వారికి సంస్కృత గ్రంథాలు చదివే తీరిక, అవకాశం ఉండడం అరుదు.
ఎనిమిది మంది భార్యలున్న శ్రీకృష్ణుని ఆదర్శపురుషుడిగా ఎలా కొలుస్తారో తెలియడం లేదని వీరి విమర్శ.
ఈనాడు హిందువులకు బహుభార్యా నిషేధ చట్టం ఉన్నా ముస్లింలకు లేదు. పూర్వం రాజులు చాలామంది భార్యలను స్వీకరించడం నాటి చట్టాలకు నిషిద్ధం కాదు. బహుభార్యలుంటే ఆదర్శ పురుషుడు కాదనే నియమం ఎక్కడుంది?

- చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ

ఫిలింక్విజ్ 86

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

హరిశ్చంద్ర (ఫ్లాష్‌బ్యాక్ @50)

కళ: టివియస్ శర్మ, వాలి
ఎడిటింగ్: తిలక్, వీరప్ప
కెమెరా: లక్ష్మణ్‌గోరె
నృత్యం: వెంపటి సత్యం
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాత: రాజ్యం
మేనేజింగ్ పార్టనర్: సివి కృష్ణమూర్తి.

-సివి మాణిక్యేశ్వరి

డిఫరెంట్-24

24 చిత్రం సాదా సీదా చిత్రాలకు భిన్నంగా సాగింది. మూడు పాత్రలలో సూర్య అభినయం బాగుంది. ఆత్రేయ పాత్రలో అతి క్రూరమైన నటన ప్రదర్శించాడు. తొట్రుపాటు లేకుండా సినిమాను విక్రమ్ బాగా నడిపించాడు. నిత్యామీనన్, సమంత హీరోయిన్లుగా సోసో. తిరు ఫొటోగ్రఫీ కట్టిపడేసింది. ఎఆర్ రెహమాన్ పాటలకన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. రొటీన్ సినిమాల మధ్య కొట్టుకుపోతున్న తెలుగు ప్రేక్షకులకు 24 చిత్రం ఎడారిలో ఒయాసిస్ లాంటిది. హేట్సాఫ్ సూర్య, విక్రమ్.
- కొవ్వూరి జగాశ్రీనివాసరెడ్డి, కొంకుదురు

ఉందా.. లేదా..!

ఏంటది? అన్న డౌటొస్తోంది కదూ! ఏం ఉందో.. ఏం లేదో తెలియాలంటే కొద్దిరోజులు
ఆగాలంటోంది అందాల అంకిత. బెంగళూరు నుంచి ఎగిరొచ్చిన
ఈ బ్యూటీ.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలే చేసింది. తెలుగు స్క్రీన్‌పై తొలిసారి హీరోయిన్‌గా ‘ఉందా.. లేదా’ అంటూ ఆసక్తి రేకెత్తిస్తోంది. పోస్టర్‌పై సిగ్గుల మొగ్గై.. సగం ముఖాన్ని చేత్తో కప్పుకొని సింపుల్‌గా కనిపిస్తుందని తక్కువ అంచనా వేసుకోనక్కర్లేదట. డాన్స్ తెలుసు. యాక్షన్ సీన్స్ చేయాలన్నా కరాటే తెలుసు.
అంతకుమించి.. నటనమీద మమకారపు రుచి తెలుసు. అందుకే ఈ బెంగళూరు బ్యూటీ -వీక్షకుల మనస్సుల్ని

పెళ్లయినాగానీ..

అందాల నటి ప్రియమణి ఓ ఇంటిది కాబోతోంది. తనకు మూడేళ్లనుంచి పరిచయమున్న, ఈవెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం చేస్తున్న ముస్త్ఫరాజ్‌తో పెళ్లికి సిద్ధమైంది
ప్రియమణి. ఈనెల 27న బెంగుళూరులో దగ్గరి బంధువుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిందంటూ

ట్రేడ్ టాక్

బ్రహ్మోత్సవం దెబ్బకు పెద్ద హీరోల సినిమాలన్నీ వెనక్కి తగ్గేసరికి ఈవారం సరైన సినిమాలు విడుదలకు వెనుకాడాయి. ఈవారం విశాల్ కథానాయకుడుగా ‘రాయుడు’, హాస్యనటులతో రూపొందించిన ‘వినోదం 100 శాతం’, హారర్ జోనర్‌లో

గుర్తుకొస్తున్నాయి..

కాలం మారింది. మారుతోన్న కాలానుగుణంగా సినిమా విషయంలో సౌకర్యం పెరిగింది కానీ, సంతోషం కలగడం లేదు. ఎల్లలు దాటిన టెక్నాలజీతో ఆధునికత పెరిగింది కానీ, ఆనందానుభూతులు మిగలడం లేదు. మా చిన్నప్పుడు... అంటూ చెప్పుకునే సినిమా కబుర్లలో వినిపించే ఆప్యాయత.. ఇప్పటి స్క్రీన్ ముందు కూర్చున్నపుడు కనిపించటం లేదు. నిజమే.. కాలం మారింది. మారుతోన్న కాలానికి అనుగుణంగా సినిమా వేగంగా మారిపోతోంది. కానీ, మాలాంటి తరం మాత్రం అప్పటి సినిమా తెర వద్దే ఆగిపోయంది. ఆ ముచ్చట్లలోనే ఆనందం పొందుతోంది. టూరింగ్ టాకీస్ నుంచి మల్టీప్లెక్స్‌కు సినిమా వచ్చేసినా -మేం మాత్రం ఇంకా అక్కడే ఉండిపోయామన్న ఫీలింగే చాలా చాలా బావుంది.

-సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ

రాజ్యసభకు సుజనా, సురేష్ ప్రభు, టిజి పేర్లు ఖరారు!

విజయవాడ: ఎపి నుంచి రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఎట్టకేలకు టిడిపి ఖరారు చేసినట్లు తెలిసింది. టిడిపికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, పార్టీ నాయకుడు టిజి వెంకటేష్‌లను బరిలో నింపాలని నిర్ణయించారు. ఒక సీటును తమకు కేటాయించాలని మిత్ర పక్షమైన బిజెపి విజ్ఞప్తిని టిడిపి అధినేత చంద్రబాబు అంగీకరించారు. కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభకు పంపుతారు. నాలుగో స్థానానికి పోటీ చేసే విషయమై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఎంతమంది వైకాపా ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తారో సరిగా అంచనా వేసుకుని నాలుగో సీటుపై ఓ నిర్ణయం తీసుకుంటారు. వైకాపా తరఫున ఇప్పటికే విజయసాయి రెడ్డి నామినేషన్ వేశారు.

Pages