S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిడుగుపాటుకు గురైన బచ్చుపేట వేంకటేశ్వరస్వామి ఆలయం

మచిలీపట్నం, మే 29: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ప్రసిద్ధిగాంచిన బచ్చుపేట శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంపై ఆదివారం తెల్లవారుజామున పిడుగు పడింది. పిడుగుపాటుకు ఆలయ గాలి గోపురం స్వల్పంగా ధ్వంసమైంది. శనివారం అర్ధరాత్రి పట్టణంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారు జామున 5 గంటల సమయంలో ఆలయ గాలి గోపురంపై పడిన పిడుగుపాటు పట్టణ వాసులను ఉలికిపాటుకు గురి చేసింది. పిడుగు ధాటికి గాలి గోపురం స్వల్పంగా ధ్వంసమై 100 మీటర్ల దూరంలో శకలాలు పడ్డాయి. తెల్లవారుజామున పిడుగు పడటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోడంతో ఆలయ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

నున్న మార్కెట్ నుంచి రూ.45.43కోట్ల మామిడి ఎగుమతి

విజయవాడ రూరల్, మే 29: ఆసియాఖండంలోకెల్లా అతి పెద్ద మామిడి మార్కెట్‌గా పేరొందిన నున్న మామిడి మార్కెట్ నుంచి రూ.45కోట్ల 43లక్షల రూపాయల విలువైన మామిడి కాయలు ఎగుమతులు పొరుగు రాష్ట్రాలకు జరిగాయి. గత సీజన్‌తో పోల్చితే సగానికి సగం పైగా ఎగమతులు తగ్గాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో పూత, పిందె దశల్లో తెగళ్లు సోకటంతో మామిడి దిగుబడి సగానికి సగం పైగా పడిపోయింది. జిల్లాలోని 27 మండలాల్లోని గ్రామాల్లోని మామిడి తోటల నుంచి నున్న మామడి మార్కెట్‌కు ట్రాక్టర్లపై రైతులు, వ్యాపారస్థులు తీసుకొస్తారు.

ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేయాలి

విజయవాడ, మే 29: పుష్కరాల పనులను మరింత వేగవంతంగా చేయడంతోపాటు 24 గంటలు పనిచెయ్యాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అర్ధరాత్రి జరుగుతున్న పుష్కర పనుల పరిశీలనలో భాగంగా శనివారం రాత్రి 11.15 నిమిషాల నుండి ఆదివారం తెల్లవారుఝామున 2.15 నిమిషాల వరకు జిల్లా కలెక్టర్ బాబు.ఎ మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్‌తో కలిసి విస్తృతంగా పర్యటించారు. కృష్ణలంక జాతీయ రహదారి ఫైర్ స్టేషన్ వద్ద జరుగుతున్న సబ్‌వే (అండర్ వెహికల్ పాస్) వివిధ దశల్లో జరుగుతున్న పనులను పరిశీలించి నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులకు, సోమా కంపెనీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

ఎయిర్‌పోర్టులో షాకు ఘనస్వాగతం

శంషాబాద్, మే 29: ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఘనస్వాగతం లభించింది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు తదితరులు పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి నగరం వరకు పెద్ద హూర్డింగ్‌లు, బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటుచేయడంతో అంతా కాషాయరంగుగా మారింది.
అవినీతిలో కూరుకుపోయిన యుపిఎ: అమిత్‌షా విమర్శ

గిరిజన తండాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్, మే 29: ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక బంజారా సంస్కృతిని కాపాడుతూ తండాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం వుంటుందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. పొట్టకూటి కోసం వలసిపోతున్న బంజారా గిరిజనులను తిరిగి రప్పించామని, కుటుంబ భారం మోయలేక శరీర అవయవాలను అమ్ముకుంటున్న గిరిజనులకు ధైర్యం చెప్పి సహకారం అందిస్తున్నామని, గిరిజనుల డిమాండ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్తానని స్వామిగౌడ్ హామీ ఇచ్చారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆదివారం ఉదయం రవీంద్రభారతిలో జరిగిన బంజారా భేరికి స్వామిగౌడ్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

నాణ్యతా ప్రమాణాలతో విద్యనందించాలి: కడియం

వనస్థలిపురం, మే 29: ప్రభుత్వానికి ప్రైవేటు విద్యా సంస్థలపై ఎలాంటి కక్ష సాధింపు ఆలోచనలు లేవని, విద్యాశాఖ నిబంధనలకు లోబడి తమ పాఠశాలలను నడిపించాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. రాష్ట్ర ప్రైవేటు గుర్తింపు పాఠశాలల యజమానుల సంక్షేమ సంఘం (టిఆర్‌ఎస్‌ఎంఎ) సర్వసభ్య సమావేశం ఆదివారంనాడు ఎల్.బి.నగర్ నియోజకవర్గం పరిధిలోని నాగోల్ శుభం కనె్వన్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడుతూ ఆరు దశాబ్దాల కాలంలో అమరవీరుల త్యాగఫలం, టిఆర్‌ఎస్ రథసారథి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.

మాయదారి బిచ్చగాళ్లు

హైదరాబాద్, మే 29: మహానగరంలో నిన్నమొన్నటి వరకు దాదాపు అన్ని రకాల నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తున్న ముఠాలు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే! ఇపుడు తాజాగా మనకు నగరంలో నిత్యం రద్ధీగా ఉండే జంక్షన్లు, ప్రార్థన మందిరాల వద్ధ యాచకులుగా కన్పించే వారిలో సుమారు 95 శాతం బిచ్చగాళ్లు మాయదారి, నకిలీ బిచ్చగాళ్లేనని తెల్చింది జిహెచ్‌ఎంసి, నగర ట్రాఫిక్ పోలీసులు, పలు స్వచ్ఛంద సంస్థల సమష్టి అధ్యయన నివేదికలు. కొద్దిరోజుల క్రితం నగరంలోని దాదాపు బిజీ జంక్షన్లలో ఈ రెండు విభాగాలకు చెందిన అధికారులు నిర్వహించిన అధ్యయనంలో మరెన్నో ఆసక్తికరమైన వివరాలు వెలుగుచూశాయి.

ఆడపిల్లలు, మహిళలకు అండగా భరోసా

హైదరాబాద్, మే 29: జంట కమిషనరేట్ల పరిధిలోని మహిళలకు, ఆడపిల్లలకు అండగా నిలుస్తున్న భరోసా కేంద్రానికి మంచి స్పందన లభిస్తోంది. నెల రోజుల క్రితం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రానికి పోలీసు స్టేషన్లకు వచ్చే తీవ్రమైన కేసులే కాకుండా బాధితులు నేరుగా ఈ కేంద్రానికి వస్తున్నారు. ఇప్పటికే నగర ట్రాఫిక్ కంట్రోల్ రూం సమీపంలోని హాకా భవన్‌లోని భరోసా కేంద్రానికి మూడు వారాల్లోనే 105 కేసులు నమోదయ్యాయి. వీటిలో పది అత్యాచార కేసులున్నాయి. ఈ భరోసా కేంద్రాన్ని మొత్తం 22 మంది సిబ్బంది నిర్వహిస్తుండగా వీరిలో 14 మంది కౌనె్సలర్లు ఉన్నారు.

చేప ప్రసాదానికి ప్రభుత్వం సహకరించడం సరికాదు

ఖైరతాబాద్, మే 29: ఎలాంటి శాస్ర్తియత లేకుండా కొనసాగుతున్న చేపప్రసాద పంపిణీలో ప్రభుత్వం భాగస్వామ్యం కావడం సరికాదని చర్చావేదికలో పలువురు వక్తలు అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జన చైతన్య వేదిక, జన విజ్ఞాన వేదికల ఆధ్వర్యంలో ‘చేప ప్రసాదం శాస్ర్తియతపై చర్చావేదిక’ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి, విఎల్‌ఎన్ శాస్ర్తీ, రాంమోహన్‌రావు, టివి.రావులతో పాటు పలువురు మాట్లాడుతూ, హైకోర్టుకు ప్రసాదమని చెప్పి సామాన్య ప్రజలకు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు.

అక్రమార్కుల తిష్ట

సికింద్రాబాద్, మే 29: స్వచ్ఛమైన పాలను సరఫరా చేసే విజయ పాలడైరీలో అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోయాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల తరబడి అక్రమంగా తిష్టవేయడంతో పాటు సంస్థలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌లకు అధికారులు సైతం కొమ్ముకాస్తున్నారు. వ్యవస్థలో ఉన్న లొసుగులను అవపోసన పట్టిన అధికారులు తమకు అనుకూలంగా అమ్యామ్యాలు చెల్లిస్తున్న కేవలం నలుగురు కాంట్రాక్టర్‌లు లాలాపేట్‌లోని విజయ డైరీలో పదిలంగా ఉండే విధంగా స్వయంగా చర్యలు తీసుకుంటున్నారని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు.

Pages