S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేదరికమే నా కులం

తిరుపతి, మే 29: ‘పేదరికం నా కులం.. నా మతం. పేదరికం ఎక్కడుంటే నేను అక్కడుంటా. పేదరిక నిర్మూలనే నా లక్ష్యం, సంకల్పం’ అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రోజులపాటు సాగిన టిడిపి మహానాడు ముగింపు సభలో ఆయన గంటకు పైగా ఉద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్, వైకాపాలపై విమర్శలతో విరుచుకుపడ్డ బాబు కెసిఆర్‌పై పెదవి విప్పకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయాన్ని వివరించారు. విదేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ పరిశ్రమలు ఎలా ముందుకు వస్తున్నాయో వివరించారు.

ఆ పాపాలు నేను చేయలేను

దావణగెరె (కర్నాటక), మే 29: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్ల కాలంలో 700కు పైగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వీటిలో కొన్ని పథకాలు అమలులోకి రాకపోయినా, చేపట్టిన ప్రయత్నాలు సఫలం కాకపోయినా ‘ఎట్టి పరిస్థితుల్లోనూ దేశాన్ని తప్పుడు పథంలో ముందుకు వెళ్లనివ్వను’ అని ఉద్ఘాటించారు. అభివృద్ధి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడిక్కడ ఓ భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ఈ రెండేళ్ల కాలంలో తన ప్రభుత్వ పనితీరును వివరించడంతోపాటు విమర్శలనూ తిప్పికొట్టారు.

ఏటా ప్రోగ్రెస్ రిపోర్ట్

హైదరాబాద్, మే 29: తమ పాలనపై ప్రతి ఏటా ప్రోగ్రెస్ రిపోర్ట్‌తో ప్రజల ముందుకు వస్తామని, అదే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లకొకసారి మాత్రమే ప్రజల ముందుకు వెళ్లేదని బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కాంగ్రెస్ నేతలంతా 10 జన్‌పథ్ చుట్టూనే తిరిగేవారని ఆయన విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన యుపిఎ పాలనకు, ఇప్పటి ఎన్డీయే పాలనకు పోలికే లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ళ పాలనపై బిజెపి దేశవ్యాప్తంగా చేపట్టిన ‘వికాస్ పర్వ్’లో భాగంగా అమిత్ షా ఆదివారం ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

కొరవడిన మహా జోష్!

తిరుపతి, మే 29: తిరుపతి మహానాడు మూడు రోజుల ముచ్చట ఆదివారంతో ముగిసింది. యథావిధిగా చంద్రబాబునాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని.. దానిని మరో మార్గం పట్టించేందుకు జగన్ అవినీతిని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. టిడిపి ఎమ్మెల్యేలు, నేతల అవినీతిపై ఇటీవలి కాలంలో సొంత మీడియాలోనూ వ్యతిరేక కథనాలు రాగా, అంతకుముందు జగన్ మీడియాలో అమరావతి భూ అక్రమాలపై వెలువడిన కథనాలు టిడిపిని ఆందోళన పరిచాయి.

మార్తి సుబ్రహ్మణ్యం

ఎండలు పోయనట్టే..

హైదరాబాద్/ విశాఖపట్నం, మే 29: ఎండాకాలం వెళ్లిపోతోంది. ఎండలు తగ్గుముఖం పట్టాయి. వడగాడ్పులు ఉంటాయని గత చాలా రోజుల నుండి ప్రకటిస్తున్న భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రస్తుతం వడగాడ్పుల గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. నైరుతీ రుతుపవనాలు ఇంకా రాకపోయినప్పటికీ, రుతుపవనాల కంటే తొలుత వచ్చే ‘ముందస్తు వర్షాలు’ కురుస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైంది. గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది.

చుక్కల్లో పప్పులు!

కాకినాడ, మే 29: పప్పు ధాన్యాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు, మినపప్పు ధరలు అమాంతం పెరిగిపోవడంతో జనం హడలెత్తిపోతున్నారు. హోటళ్లు, తినుబండారాల దుకాణదారులు కూడా ధరలు పెంచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కంది, మినప్పప్పులు బ్లాక్‌మార్కెటీర్లు స్టాక్ చేసినట్టు స్పష్టమవుతోంది. అయినప్పటికీ సదరు గోదాములపై దాడులకు అధికారులు సాహసించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణం చీకటి ఒప్పందాలేనని చెబుతున్నారు. పప్పు ధాన్యాల ధరలు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎంపిక చౌక ధరల దుకాణాల్లో గతంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసేవారు. ఇప్పుడలాంటి పరిస్థితే లేదు.

ముస్త్ఫారాజ్‌తో ప్రియమణి నిశ్చితార్ధం

కాబోయే వరుడు ముస్త్ఫారాజ్‌తో ప్రముఖ నటి ప్రియమణి నిశ్చితార్ధం బెంగళూరులో జరిగింది. ఈవెంట్ కంపెనీ యజమాని అయిన ముస్త్ఫారాజ్‌తో కొన్నాళ్లుగా ప్రేమాయణం సాగించిన ప్రియమణి త్వరలో ఓ ఇంటిది కాబోతోంది.

ఛాన్స్ వస్తుంది!

‘కృష్ణాష్టమి’ చిత్రంతో తెలుగు తెరపైకి వచ్చిన కొత్త కథానాయిక నిక్కీ గల్రాని. ఒకేసారిగా తెలుగు తెరపైకి తెరంగేట్రం చేయలేదు ఈ బెంగుళూరు భామ. గత మూడు నాలుగేళ్లుగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎడాపెడా చిత్రాల్లో నటించాకే ఆమెకు తెలుగులో అవకాశం వచ్చింది. తెలుగు మార్కెట్ పెద్దది కనుక ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకొందామని ప్రయత్నించినా తొలి చిత్రం అనుకున్న అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఆ తరువాత చేసిన ‘మలుపు’ సినిమా కూడా ఆమె కెరీర్‌కు కొత్తమలుపును ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కేవలం గ్లామర్, టాలెంట్ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని కెరీర్‌ను సాగిస్తోంది నిక్కీ గల్రాని.

వరుణ్‌కు జతగా..

గత ఏడాది మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్’ చిత్రంలో లెక్చరర్ పాత్రలో నటించి ఆకట్టుకుంది సాయిపల్లవి. తమిళ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ సినిమా తర్వాత పలు తమిళ, మలయాళ చిత్రాల్లో అవకాశాలతో జోరుమీదుంది. తాజాగా ఈమె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించనుందట. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారని తెలుస్తోంది. ‘అమెరికా అబ్బాయి- తెలంగాణా అమ్మాయి’ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కే ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర కొత్తగా ఉంటుందట. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది.

విశాల్‌తో తమన్నా

విశాల్, తమన్నా, జగపతిబాబు కాంబినేషన్‌లో హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై నిర్మాత జి.హరి ఓ సినిమాను రూపొందించనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, భారీ బడ్జెట్‌తో హైటెక్నికల్ విలువలతో, స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నామని తెలిపారు. విశాల్ కెరీర్‌లో హై రేంజ్ చిత్రంగా నిలవనుందని, షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయని ఆయన తెలిపారు. విశాల్, తమన్నా జంట సినిమాకి హైలెట్ అవుతుందని, జగపతిబాబు విలనిజం ఆకట్టుకుంటుందని, తరుణ్ అరోరా మరో విలన్‌గా నటిస్తున్నారని తెలిపారు.

Pages