S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కట్నం కాని కట్నం (కథానిక)

పెళ్లి ముహూర్తం అర్ధరాత్రికి. ఉదయం తోరు సంబరం కార్యక్రమం జరుగుతోంది. అటు ఆడపెళ్లివారి తరఫున, ఇటు మగపెళ్లి వారి తరఫునా రావలసిన బంధువులంతా వచ్చేశారు. బ్యాండుమేళం కాసేపు మంచి సినిమా పాటలు వాయించి వినిపించారు. పెళ్లి కూతురి పేరు శే్వత. పెళ్లికొడుకు పేరు సూర్యప్రతాప్.

- డా. బి.ఎస్.ఎన్. మూర్తి

చావుకబురు (చిన్న కథ )

‘ఏరా! నేను వ్యాపారం కోసం పట్నం వచ్చి రెండు నెలలైంది. ఇంటి దగ్గర వార్తలు ఏమీ తెలియటం లేదు. విశేషాలు ఏమిటి?’
‘మీరు ప్రేమగా పెంచుకునే చిలుక ఎగిరిపోయిందండీ!’
‘ఎలా ఎగిరిపోయింది? పంజరం తలుపు వేయటం మర్చిపోయారా?’
‘మర్చిపోలేదు. పనివాళ్లు కావాలనే తెరిచారు’
‘కావాలని ఎందుకు తెరిచారు?’
‘మన ఇల్లు కాలిపోతూంటే ఆ మంటల్లో పడి చచ్చిపోదటండీ!’
‘ఏమిటీ! నా ఇల్లు తగలబడిపోయిందా? ఎలా జరిగింది?’
‘పొలంలో ఉన్న మీ వరికుప్పలకు అంటుకున్న నిప్పు గాలికి ఎగిరివచ్చి అంటుకుంది’
‘ఆరుగాలం కష్టపడి పండించిన పంట అంతా బుగ్గిపాలైందా? అయ్యో! అసలు వరికుప్పలకు నిప్పు ఎలా అంటుకుంది?’

గోనుగుంట మురళీకృష్ణ

గురివిందలు (కథ)

‘‘డిఇఓ కార్యాలయానికి తీసుకెళ్లాల్సిన ఫైళ్లు తీసుకుని రమ్మన్నారు’’ అన్న అటెండర్ వర్తమానంతో కొంత కాలం క్రితమే ఆ ప్రైవేటు కానె్వంట్‌లో గుమస్తాగా చేరిన గుర్నాథం అనబడే నేను వినయంగా ప్రిన్సిపాల్ రూంలోకి ప్రవేశించాను.
నేను రూములోకి ప్రవేశించే సరికి మా ప్రిన్సిపాల్‌గారు ఫోనులో ఎవరితోనో మాట్లాడుతున్నారు.
‘‘ఎస్సార్! అలాగే సార్... తప్పకుండా సార్’’ అంటూ అత్యంత వినయంగా బదులిస్తున్నారు. మొహం మాత్రం కాస్త ఎర్రబడిందనే చెప్పాలి.
పక్కనే వినయంగా నిలబడ్డ నన్ను చూసి ‘‘పద’’ అంటూ బయటికి దారి తీశారు. ఫైళ్లతో పాటు నేను అతన్ని అనుసరించాను.
ఇద్దరం డిఇఓ కార్యాలయానికి చేరుకున్నాం.

- మండా శ్రీధర్

ఎక్కడమ్మా చంద్రుడు? ( కథ)

ఆరుబయట వెల్ల్లకిలా పడుకొని ఆకాశం వైపు ఆనందంగా చూస్తున్న పాండురంగానికి అసంఖ్యాక నక్షత్రాల మధ్య పుచ్చపువ్వులాంటి వెనె్నల వెదజల్లుతూ, పైకెగబాకుతున్న పూర్ణచంద్రుడు కన్పించేసరికి, చిన్నప్పుడు వాళ్లమ్మ పాడుతున్న పాట గుర్తుకొచ్చింది. ‘‘చందమామ రావే.. జాబిల్లిరావే! కొండెక్కిరావే-కోటివేలు తేవే’’ అంటూ ఏవేవిటో తెచ్చి మా అబ్బాయికివ్వవే అని పాడేది. ఆ వయసులో ఆ పాట తన గుండెలో గూడుకట్టుకొని గుడిలో విగ్రహంలా స్థిరపడిపోయింది. ఒకసారి అమాయకంగా అమ్మను అడిగాడు - చందమామ అంత మంచివాడా అమ్మా? కోటివేలు, బంతిపూలు, తేనెపట్టు, పాలుపెరుగు తెచ్చి యిస్తాడా - అని. ఆమె నవ్వింది. ‘‘అవును నాయనా!

- పిడుగు పాపిరెడ్డి

ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికిపోయారు

విజయవాడ (క్రైం), మే 28: ఒకరి స్థానంలో మరొకరు ఇంటర్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. పరీక్ష రాసే వ్యక్తితోపాటు, రాయాల్సిన విద్యార్థిపై కూడా పోలీసులు కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాదంపాడు పురుషోత్తనగర్‌కు చెందిన అనిశెట్టి భుజంగనాయుడు మారుతీనగర్‌లోని శ్రీవిద్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో జూనియర్ ఇంటర్ చదువుతూ ఇటీవల పరీక్షలు రాశాడు. కాగా అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు సిద్ధమైన క్రమంలో బెంజిసర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబునాయుడు కాలనీలోని నారాయణ కాలేజీ సెంటర్ పడింది. ఈక్రమంలో శనివారం ఎకనామిక్స్ పరీక్షకు హాజరై రాయాల్సి ఉండగా..

పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు

విజయవాడ, మే 28: పుష్కర పనుల్లో సాకులు చూపి పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాబు ఎ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి 11.30 గంటల నుండి శనివారం తెల్లవారు జాము 3 గంటల వరకు ఆయన కృష్ణలంక బైపాస్ రోడ్డు పనులతోపాటు సీతమ్మ పాదాల నుండి బెరమ్‌పార్క్ వరకు జరుగుతున్న పుష్కర ఘాట్ల పనులను ఇంజనీర్లు, సోమా ప్రతినిధులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. నిర్దేశించిన ప్రణాళికల ప్రకారం పనులు జరగకపోవడం వల్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు పరస్పరం చర్పించుకుని పనులు వేగవంతం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.

సారా అదుపుతో పెరిగిన మద్యం అమ్మకాలు

కూచిపూడి, మే 28: వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించిన దాడుల కారణంగా కృష్ణాజిల్లా సారా రహిత జిల్లాగా గుర్తింపు పొందిందని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎస్ వెంకట శివప్రసాద్ పేర్కొన్నారు. మొవ్వ సర్కిల్ స్టేషన్‌ను శనివారం ఆయన పరిశీలించారు.

దుకాణ విషయమై చల్లపల్లిలో ఉద్రిక్తత

చల్లపల్లి, మే 28: ఓ షాపు విషయమై లీజు దారునికి, సబ్ లీజు దారునికి మధ్య తలెత్తిన వివాదంతో శనివారం తెల్లవారు జాము నుండి చల్లపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక ప్రధాన సెంటరులో రాజాగారికోట పక్కన ఉన్న షాపు విషయమై ఇరువురి మధ్య తలెత్తిన వివాదం రెండు సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడంతో సబ్ డివిజన్‌లోని పోలీసులతో పాటు క్విక్ యాక్షన్ టీమ్ రంగ ప్రవేశం చేయగా వ్యవహారం డిఎస్పీ కార్యాలయానికి చేరింది. ఈ దశలో ఎస్టేట్ జోక్యం జోక్యం చేసుకుని సదరు షాపును స్వాధీన పర్చుకోవడంతో ఉత్కంఠతకు తెరపడింది.

అర్థరాత్రి పెనుగాలుల బీభత్సం

తోట్లవల్లూరు, మే 28: తోట్లవల్లూరులో శనివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని కళ్ళంవారిపాలెం జడ్పీరోడ్డులో మూడు భారీ చెట్లు వేళ్ళతో సహా నేలకూలాయి. దీంతో రాకపొపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చెట్ల తొలగింపుని చేపట్టారు. అలాగే కళ్ళంవారిపాలెం దళితవాడలో తూమాటి రమణకు చెందిన రేకుల షెడ్డు ధ్వంసం అయ్యింది. ఈమె పక్కా గృహం శ్లాబు దశలో ఆగిపోగా రేకుల షెడ్డులో ఉంటోంది. శనివారం వీచిన గాలికి సిమెంటు రేకులు ముక్కలు, ముక్కలుగా విరిగిపడ్డాయి. దీంతో నిలువనీడ లేకుండా పోయిందని రమణ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. చాగంటిపాడులో రెండు తాటిచెట్లు విరిగాయి.

చిరస్మరణీయుడు ఎన్టీఆర్

సికింద్రాబాద్, మే 28: ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఎన్టీఆర్ చిరస్మరణీయుడని కొనియాడారు. ఇందులో భాగంగా నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నగర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు నల్లెల కిశోర్ తదితరులు హాజరయ్యారు. అదే సమయంలో నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు.
ఎన్టీఆర్ ఘాట్‌లో నేతల ఘన నివాళి...

Pages