S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంద కృష్ణమాదిగ రథయాత్రను అడ్డుకుంటాం

రాజమహేంద్రవరం, మే 27: సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలంగాణాకు మద్దతు ప్రకటించిన ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లె నుంచి చేపట్టిన రథయాత్రను అడ్డుకుంటామని ఎపి ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మాదిగల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, చర్మకారులకు ఉపాధి కల్పించే నిడ్‌క్యాప్‌ను పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాల్లో వర్గీకరణను వర్తింపజేసే జిఓ 25ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10న చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు చైతన్య యాత్ర చేపట్టినట్లు చెప్పారు.

ప్రచండ భానుడి ప్రతాపం

రాజమహేంద్రవరం, మే 27: తూర్పుగోదావరి జిల్లాలో ఎండ తీవ్రత భీకరంగా మారడంతో రోడ్లపై జనసంచారం కనిపించడం లేదు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. శుక్రవారం రాజమహేంద్రవరంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వ్యాపార కేంద్రమైన రాజమహేంద్రవరంలో వర్తక, వాణిజ్య కార్యకలాపాలు మందగించాయి. అపరాల హోల్‌సేల్ వెంకటేశ్వర జనరల్ మార్కెట్, తాడితోట మహాత్మా గాంధీ హోల్‌సేల్ క్లాత్ మార్కెట్, మెయిన్ రోడ్డు, కోటగుమ్మం జంక్షన్లు ఎండ తీవ్రతకు జనంలేక వెలవెలబోయాయి. ఎండకు కార్యకలాపాలు తగ్గడంతో కోట్లాది రూపాయల వ్యాపారాలు మందగించాయని వ్యాపారులు వాపోతున్నారు.

మురుగు కాలువపై ఆక్రమణల తొలగింపు

అమలాపురం, మే 27: అమలాపురం బైపాస్ రోడ్డులో గల కుమ్మరి మురుగు కాల్వపై గల ఆక్రమణలను అధికారులు శుక్రవారం తొలగించారు. అయితే తొలగింపు సందర్భంగా ఆక్రమణదారుడు కుసుమ వెంకటేశ్వరరావుకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని చివరికి పోలీసుల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరి మేజర్ ముగురు కాలువ గట్టును గత కొనే్నళ్లుగా ఆదే ప్రాంతానికి చెందిన కుసుమ వెంకటేశ్వరరావు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నాడు.

ఉనికి కోల్పోతున్న ప్రాజెక్టుల నిర్వాసితులు

రాజమహేంద్రవరం, మే 27: సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులు ఉనికి కోల్పోతున్నారు. పునరావాస, పునర్నిర్మాణ పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. నిర్వాసితులు వలసపోవలసిన అగత్యం తలెత్తింది. పోలవరమే కాదు..తోటపల్లి, వంశధార ఇలా ఏ ప్రాజెక్టైనా నిర్వాసితుల గోడు ఒక్కటే. పునరావాసం అందక ఉసూరుమంటూ ఉనికి కోల్పోతున్న పరిస్థితి దాపురించింది. క్షేత్ర స్థాయిలో హక్కులు అందని ద్రాక్షగానే మారాయి. పదేళ్లు అవుతున్నా పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అమల్లో ఎదుగూబొదుగూ కనిపించడంలేదు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అందిన వైనం లేదు. ఇంకా పునరావాసం కోసం పోరాడుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి.

బహిరంగ మలవిసర్జన లేని గ్రామాల అభివృద్ధి

కాకినాడ, మే 27: జిల్లాలో 1069 గ్రామాలుండగా వాటిలో 314 గ్రామాలను స్వచ్ఛ్భారత్ మిషన్, ఉపాధి హామీ పధకం ద్వారా ఈ ఏడాది సుమారు 120 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ నాటికి బహిరంగ మలవిసర్జన లేని (ఒడిఎఫ్) గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఒడిఎఫ్ గ్రామాలుగా ఎంపిక చేసిన గ్రామాల సర్పంచ్‌లు, ఎండిఓ, ఆయా మండలాల ప్రత్యేకాధికారులతో శుకవ్రారం కలెక్టర్ కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించేందుకు అందరి సహకారంతో కృషి చేయాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేయాలి

రామచంద్రపురం, మే 27: భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, పథకాల వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని రాష్ట్ర నేత కర్రి చిట్టిబాబు పేర్కొన్నారు. రామచంద్రపురం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కొట్టువాడ హరిబాబు అధ్యక్షతన పార్టీ సమావేశం శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్రి చిట్టిబాబు మాట్లాడుతూ ఈ నెల 26 నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు గ్రామాల్లో సభలు సమావేశాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న పథకాలను తెలియజెప్పాలని కార్యకర్తలను ఆయన కోరారు.

దళిత మహిళ హత్య!

ప్రత్తిపాడు, మే 27: ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామంలో ఓ దళిత మహిళ హత్యకు గురైంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. కంకిపూడి సింహాచలం (40) అనే మహిళ మృతదేహాన్ని గ్రామంలోని సూర్నీడి రాములుకు చెందిన చెరకుతోటలో గేదెల కాస్తున్న పిల్లలు చూసి, శుక్రవారం గ్రామస్థులకు తెలియజేశారు. గ్రామంలోని మూలలంక పంట పొలాల్లో సింహాచలం మృతదేహం పడివుంది. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్తిపాడు సిఐ ఎ సత్యనారాయణ, ఎస్‌ఐ నాగదుర్గారావు, ఏలేశ్వరం ఎస్‌ఐ రవికుమార్ శుక్రవారం సాయంత్రం సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా మహిళ మృతిపై పూర్తి సమాచారం లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు.

మండపేటలో వికసించిన మే పుష్పాలు

మండపేట, మే 27: స్థానిక సెయింట్‌ఆన్స్ పాఠశాల ఆవరణలోని ఉద్యానవనంలో మే పుష్పాలు వికసించాయి. ఏడాదికొకసారి ఈ పుష్పాలు అరుదుగా పూస్తాయి. కేవలం ఈ పుష్పాలు మేనెలలో పూయడంతో మే పుష్పాలుగా పేరుగాంచాయి. ఉద్యానవనం అంతా మే పుష్పాలు విరివిగా పూయడంతో జనం మే పుష్పాలను వింతగా తిలకిస్తున్నారు.

చంటిరెడ్డిపై కేసుల బనాయింపు తగదు

రామచంద్రపురం, మే 27: పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నల్లమిల్లి జనార్ధన రెడ్డి (చంటి రెడ్డి)పై అసత్య ఆరోపణలు చేస్తూ, కుట్రపూరితంగా వ్యవహరిస్తూ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాల ప్రతినిధులు, మహిళలు శుక్రవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మార్కెట్ సెంటర్ నుండి రాజగోపాల్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ అధికారికి వినతి పత్రం అందించారు.

అంబరాన్ని అంటిన మహానాడు సంబరాలు

తిరుపతి, మే 27: మహానాడంటే తమ ఇంటి పండుగగా టిడిపి కార్యకర్తలు నాయకులు భావిస్తారు. అది నిజమని శుక్రవారం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో ప్రారంభమైన మహనాడు కార్యక్రమాలు సాగాయి. ఉదయం నుంచే కార్యకర్తలు, నాయకులు పసుపు దుస్తులు ధరించి వేదిక వద్దకు తరలివచ్చారు. చంద్రబాబు నాయుడు రావడానికి కొంత ఆలస్యం కావడంతో వేదికపైన సాంస్కృతిక కార్యక్రమాలు విషేశంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ కళాప్రదర్శనలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సవివరంగా తెలియజేసేలా సాగాయి.

Pages