S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముగ్గురు దోపిడీ దొంగలు అరెస్ట్

తిరుపతి, మే 27: స్థానిక వైకుంఠపురంలో ఈనెల 5వ తేదీన రిటైర్డ్ టిటిడి ఇ ఇ ప్రభాకర్‌పై దాడిచేసి విలువైన బంగారు ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లను దొంగిలించిన ముగ్గురు దోపిడీ దొంగలను తిరుపతి క్రైం పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. తిరుపతి క్రైం ఏఎస్పీ సుబ్బారెడ్డి అదేశాల మేరకు డిఎస్పీ కొండారెడ్డి ఆధ్వర్యంలో నిందితులను ఎమ్మార్‌పల్లి వద్ద ఉన్న ఉప్పరపల్లి క్రాస్ వద్ద నిందితులను అరెస్టుచేశారు.

మదనపల్లెలో మొబైల్‌షాపుపై పోలీసుల దాడులు

మదనపల్లె, మే 27: మదనపల్లె పట్టణం గాంధీరోడ్డులోని శరవణ మొబైల్‌షాపులో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో మదనపల్లె అర్భన్ సిఐ హనుమంతనాయక్, ఎస్‌ఐ సుకుమార్ తన సిబ్బందితో ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న షాపు నిర్వహకులు ఇద్దరు, బెట్టింగ్‌లు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. షాపులోని సిసి కెమెరాల ద్వారా లభ్యమైన పుటేజిలు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్‌లు, సెల్‌ఫోన్‌లు, సిసికెమెరా పరికరాలు, పుటేజిలు, భారీగా నగదు సైతం స్వాధీనం చేసుకుని ఐదుగురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మహానాడులో ‘శివా’గ్రహం

తిరుపతి, మే 27: ఎప్పుడు నవ్వుతూ... నవ్విస్తూ ఉండే చిత్తూరు టిడిపి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ శివప్రసాద్ మహానాడు వేదికపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాంస్కృతిక వేదిక పైనుంచి నిష్క్రమించారు. ఇది నిజమేనా అనుకుంటున్నారా? అవును ఇది నిజమే. ఆయన ఆగ్రహానికి, అసంతృప్తితికి కారణం ఏమిటంటే ...

బాబు మాస్క్‌తో బంగి అనంతయ్య హల్‌చల్

తిరుపతి, మే 27: ఏ విషయమైనా, ఎక్కడైనా తనదంటు ప్రత్యేక శైలితో వేషధారణలతో అందరిని ఆకట్టుకునే కర్నూలు జిల్లాకు చెందిన బంగి అనంతయ్య మహానాడు వద్ద కూడా శుక్రవారం అదే రీతిలో హల్ చల్ చేశారు. ముఖానికి చంద్రబాబు నాయుడి మాస్కు వేసుకుని, పసుపు దుస్తులు ధరించి, పార్టీ జెండాను భుజానికెత్తుకుని తన జిల్లాకు చెందిన కార్యకర్తలతో అనంతయ్య సభాప్రాంగణంలోకి ప్రవేశించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని నెంబర్ వన్‌గా నిలిపే సత్తావున్న నాయకుడు చంద్రబాబు నాయుడుని అన్నారు. అందుకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు సైతం టిడిపిలోకి రావడానికి క్యూకడుతున్నారని అన్నారు.

తిరువీధుల్లో దేవదేవుళ్లు విహారం

చంద్రగిరి, మే 27 : భక్తజనుల గోవిందనామ స్మరణల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ హరి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణుడు, సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ, హనుమంత స్వామివార్లు తిరుచ్చి వాహనాలపై కొలువుదీరి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన వైనం శుక్రవారం శ్రీనివాస మంగాపురంలో జరిగింది. చంద్రగిరి మండలంలోని శ్రీనివాస మంగాపురంలో వెలిసి ఉన్న శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 25వ తేదీ నుంచి వసంతోత్సవాలు జరుగుతున్నాయి.

సిఎంకు 5లక్షలు విరాళం అందించిన డాక్టర్ సుధారాణి

తిరుపతి, మే 27: తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి శుక్రవారం టిడిపి జాతీయ అధ్యక్షులు, సిఎం నారాచంద్రబాబు నాయుడుకి రూ.5లక్షలు చెక్కును విరాళంగా అందించారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం ప్రారంభమైన టిడిపి మహానాడు సభలో వేదికపైనే సిఎంకు ఈ చెక్కును అందజేశారు. ఇప్పటికే రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రూ.5లక్షలు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.5లక్షలు అందించిన డాక్టర్ సుధారాణి తాజాగా మరో రూ.5లక్షలను మహానాడులో అందించారు.

భూ దందాపై సమగ్ర విచారణకు సిఎం ఆదేశించాలి’

రేణిగుంట, మే 27: మండలంలోని సూరప్పకాశంలో జరిగిన అవినీతి భూ దందాపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సమగ్ర విచారణకు ఆదేశించాలని రేణిగుంట సహకార సంఘం చైర్మన్ సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

వైభవంగా శ్రీ కోదండరామస్వామివారి ఆస్థానం

తిరుపతి, మే 27: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 608వ జయంతి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. మే 21 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుపతి, శ్రీనివాసమంగాపురం, తాళ్లపాకలో అన్నమయ్య జయంతి ఉత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శుక్రవారం ఉదయం 8నుంచి 11 గంటల వరకు శ్రీ కోదండరామస్వామి వారి ఆస్థానం ఘనంగా జరిగింది. ముందుగా స్వామివారి ఉత్సవమూర్తులను శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుంచి అన్నమాచార్య కళామందిరానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టుకళాకారులు సంకీర్తన గానం నిర్వహించారు.

‘హక్కుల సాధన సంఘటిత పోరాటంతోనే సాధ్యం’

చిత్తూరు, మే 27: కార్మికులు హక్కులు సాధన సంఘటిత పోరాటంతో నే సాధ్యమని ఏపి ఎలక్ట్రిసిటి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ సాయిబాబా తెలిపారు. శుక్రవారం చిత్తూరులో ఎలక్ట్రిసిటి ఉద్యోగుల రాష్టస్థ్రాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో కార్మికులు భారీర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిసిటి సంఘం మిగతా సంఘాలకంటే భిన్నమైందన్నారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి అనేక పోరాటాలు చేసామని ఆ పోరాటాల కారణంగానే ఎలక్ట్రిసిటి ఉద్యోగులకు పలు రకాల లబ్ది చేకూరిందన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడమే మంచిదని ఆ దిశగానే ఈ సంఘం ముందుకెళ్తుందన్నారు.

సంక్షేమ పథకాలను ప్రజలవద్దకు తీసుకెళ్లాలి

కడప, మే 27:ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా జిల్లాస్థాయి అధికారులు ఆధునిక విధానాలను అవలంభిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలన్నారు. వ్యవసాయం, హార్టికల్చర్, విద్య, వయోజన విద్య, హౌసింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Pages