S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయలసీమ దత్తపుత్రుడు మన్రో

అనంతపురం కల్చరల్, మే 27 : రాయలసీమ అభివృద్ధికి విశేష కృషి చేసిన సర్ థామస్ మన్రో రాయలసీమ దత్తపుత్రుడిగా చరిత్రలో నిలిచిపోయారని జెసి బి.లక్ష్మీకాంతం కొనియాడారు. దత్త మండలాల తొలి ప్రిన్సిపల్ కలెక్టర్‌గా పనిచేసిన సర్ థామస్ మన్రో జయంతి వేడుకలను శుక్రవారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పెన్నార్ భవన్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.

1 నుంచి అన్నీ అంతర్జాలంలోనే..

డి.హీరేహాల్, మే 27 : వచ్చేనెల 1వ తేదీ నుంచి రెవెన్యూ కార్యకలాపాలకు సంబంధించి అన్నీ అంతర్జాలంలోనే నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల వద్ద నుంచి వస్తున్న ఫిర్యాదులకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకూ సబ్సిడీ విత్తనాలు అందించాలన్నారు. విత్తన పంపిణీలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. వివిధ పనుల కోసం మండల కేంద్రానికి రాకుండా అందుబాటులో ఉండేవిధంగా అంతర్జాలంలో తమ సమస్యలను నమోదు చేయవచ్చన్నారు.

నూతన పరిశోధనల కోసం సిలబస్ రూపొందించాలి

అనంతపురం సిటీ, మే 27 : జెఎన్‌టియూ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థులకు నూతన పరిశోధనలకు అవసరమయ్యే విధంగా సిలబస్ రూపొందించాలని జెఎన్‌టియూ ఉపకులపతి ఆచార్య ఎంఎంఎం.సర్కార్ సూచించారు. శుక్రవారం స్థానిక ఈఈఈ విభాగంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బిఓఎస్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు టెక్నికల్ స్కిల్స్‌తోపాటు నూతన పరిశోధనలకు అనుకూలంగా సిలబస్ రూపొంచాలని అన్ని యుజి బిఓఎస్ చైర్మన్లు, మెంబర్లకు సూచించారు. రిజిష్ట్రార్ ఆచార్య కృష్ణయ్య మాట్లాడుతూ ఎడ్యుకేషన్ గ్రిడ్ సిస్టమ్ ఎంతో అవసరమని, అన్ని యూనివర్సిటిల సిలబస్‌లను పరిశీలించి సిలబస్‌ను జాగ్రత్తగా రూపొందించాలన్నారు.

అంజన్నకు తులసీ లక్షదళార్చన

గుంతకల్లు, మే 27 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం దక్షిణాది హనుమజ్జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అంజన్నకు తులసీ లక్షదళార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని మూలవిరాట్ ఆంజనేయస్వామికి తెల్లవారుజామున సుప్రభాత సేవ, మహాభిషేకం, వజ్రకవచాలంకరణ, బంగారు కిరీటధారణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహానివేదన, మహా మంగళ హారతి నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు.

నేటి నుంచి చిన్నమ్మ పరుష

నల్లమాడ, మే 27 : ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో కొలిచే అక్కదేవతలతో ఆటలాడిన పెద్దమ్మ...పసిబాల చిన్నమ్మ పరుష మహోత్సవం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు మండలంలోని వంకరకుంట గ్రామ పరిసరాల్లో ఉన్న తుమ్మలామల దుర్గం వద్ద వెలసిన పసిబాల చిన్నమ్మ ఆలయం పరుషకు ముస్తాబైంది. వంకరకుంట గ్రామ పెద్దలు, మాజీ డిసిఎంస్ చైర్మన్ కేశవరెడ్డి, మాజీ సర్పంచ్ జయంత్‌రెడ్డి, గ్రామప్రజల ఆధ్వర్యంలో 28వ తేదీన దాసంగాలతో పరుష ప్రారంభమవుతుంది. 29న విడిదిదినము, 30న యలవ, 31న కుంకాలతో పరుష ముగియనుంది. చివరి రోజైన 31వ తేదీన నిర్వహించే ఎడ్లబండ్ల పరుగు పోటీలు తిలకించడానికి వేలాదిగా జనం హాజరవుతారు.

అశ్వవాహనంపై ఊరేగిన పెన్నోబిలేసుడు

ఉరవకొండ, మే 27 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భూదేవి, శ్రీదేవి సమేతుడైన లక్ష్మీనరసింహస్వామి శుక్రవారం అశ్వవాహనంపై ఊరేగారు. తెల్లవారుజామున సుప్రభాతం, స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకం, వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ నిత్సహోమం, దీక్షహోమం, శాంతి హోమం కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకరించి, ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకిలో ఆలయ ప్రాంగణంలో మేళతాళాల మధ్య ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై కొలవదీర్చి భక్తుల నడుమ ఊరేగించారు.

విత్తనం పంపిణీ వద్ద రైతుల తోపులాట

వజ్రకరూరు, మే 27 : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విత్తన పంపిణీలో రైతుల మధ్య శుక్రవారం తోపులాట చోటు చేసుకుంది. దీంతో ఉద్రిక్తతత చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి రైతులను బెదరగొట్టారు. చాలామంది రైతులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాశారు. అయితే విత్తన నిల్వలు తక్కువగా ఉన్నందు వల్ల ఉదయం విత్తనం కోసం ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట చోటు చేసుకుంది. వీరి మధ్యలో ఇరుక్కున్న మహిళలు, వృద్ధులను పోలీసులు బయటకు లాగారు. మరికొంత మంది అడ్డువచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

700 ఎకరాల భూమి కొనుగోలు

రాయదుర్గం రూరల్, మే 27 : ఎస్సీ నిరుపేద మహిళల కోసం భూమి కొనుగోలు పథకం కింద జిల్లాలో 700 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించినట్లు జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం రాయదుర్గం పరిధిలోని రాయదుర్గం గుమ్మఘట్ట, డి.హీరేహాల్ మండలాల్లో ఎంపిక చేసిన భూమిని పరిశీలించారు. అనంతరం స్థానిక అథితి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 300 ఎకరాల భూమిని పరిశీలించి కొనుగోలు చేసేందుకు ఎంపిక చేశామన్నారు. మిగిలిన భూమిని పరిశీలించాల్సి ఉందన్నారు. ఒక్కో నిరుపేద ఎస్సీ మహిళకు రెండు ఎకరాల చొప్పున పంపిణీ చేస్తామన్నారు.

స్వాగత తోరణం నిర్మాణం పనులు పరిశీలన

హిందూపురం టౌన్, మే 27 : మున్సిపల్ పరిధిలోని కొట్నూరు వద్ద నిర్మిస్తున్న స్వాగత తోరణ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి శుక్రవారం పరిశీలించారు. మున్సిపల్ పరిధిలో పట్టణానికి నాలుగు వైపులా స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని కౌన్సిల్‌లో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొట్నూరు వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి నాణ్యతగా ఉండాలని, త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఇఇ వన్నూరస్వామి, ఎఇ నీరజ, కాంట్రాక్టర్ వైసి ప్రభాకర్, నాయకులు సంజీవప్ప, రామకృష్ణ తదితరులు ఉన్నారు.

తగ్గని ఎండ తీవ్రత

అనంతపురం, మే 27 : జిల్లాలో ఎండలు తగ్గడం లేదు. శుక్రవారం అత్యధికంగా శింగనమలలో 41.9, డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Pages