S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

03/08/2018 - 03:49

జాతీయ చరిత్రను వాస్తవాల ప్రాతిపదికగా అధ్యయనం చేయడానికి ఏర్పడిన సంఘం సమర్పించిన నివేదికలోని వివరాలను ప్రభుత్వం త్వరలో వెల్లడించనున్నదట! వివరాలు వెల్లడి కాకముందే వివాదాలు ప్రచారమవుతుండడం విచిత్రమైన వ్యవహారం! బ్రిటన్ దురాక్రమణకారులు మన దేశంపై పెత్తనం చెలాయించిన కాలంలో మన జాతీయ చరిత్రను దారుణంగా వక్రీకరించారు.

03/07/2018 - 07:38

చైనా సైన్యం శత్రుభీకరంగా రూపుదిద్దుకుంటోందని, సరికొత్త ఆయుధ వ్యవస్థలను భారీగా అభివృద్ధి చేసుకుంటోందని ఆ దేశ రక్షణ బడ్జెట్ తేటతెల్లం చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి చైనా తన రక్షణ బడ్జెట్‌ను 8.1 శాతం మేర పెంచింది. దీంతో రాబోయే ఆర్థిక సంవత్సరానికి అది భారీగా 175 బిలియన్ డాలర్ల (రూ. 11 లక్షల కోట్లు)కు చేరింది. భారత రక్షణ వ్యయం కన్నా ఇది మూడున్నర రెట్లు అధికం.

03/06/2018 - 00:39

జాతీయ రాజకీయాల్లో ‘మూడవ కూటమి’ ముచ్చట్లు మళ్లీ ప్రారంభం కావడానికి తక్షణ నేపథ్యం ఈశాన్య ప్రాంతంలోని మూడు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ సాధించిన ఎన్నికల విజయం. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో భాజపా కూటమి ప్రభుత్వాలు ఏర్పడడానికి రంగం సిద్ధమైన సమయంలోనే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మూడవ కూటమికి మరోసారి అంకురార్పణ జరపడం విచిత్రమైన పరిణామం!

03/02/2018 - 22:42

జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లా మనదేశంలో జరిపిన పర్యటనకు మత సమన్వయం ఇతివృత్తం. అన్యమత విధ్వంసం లక్ష్యంగా ఇస్లాం మతానికి చెందిన ‘జిహాదీలు’ ప్రపంచ వ్యాప్తంగా జరుపుతున్న బీభత్సకాండ అబ్దుల్లా పర్యటన సందర్భంగా ఢిల్లీలో జరిగిన సమన్వయ సదస్సునకు నేపథ్యం! జిహాదీల ‘సిద్ధాంతం’తో కాని, లక్ష్యాలతో కాని, కార్య పద్ధతులతో కాని, వారు సాగిస్తున్న బీభత్సకాండతో కాని కోట్లాది ఇస్లాం మతస్థులకు సంబంధం లేదు.

03/02/2018 - 01:14

సింగరేణి బొగ్గు గనులను ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుప్రకటించడం ‘ప్రభుత్వ రంగ సంస్థల’ పరిరక్షణ స్ఫూర్తికి నిదర్శనం! ‘వాణిజ్య ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్- వ్యవస్థీకృతమైన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలోను, వివిధ రాష్ట్రాలలోను వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయి. వందల కొలది ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వేతర సంస్థలకు విక్రయమయ్యాయి.

03/01/2018 - 00:46

కంచి కామకోటి పీఠం వరిష్ఠ ధర్మాచార్యుడు జగద్గురు శంకరాచార్య జయేంద్ర సరస్వతి స్వామి పార్థివ జీవనయాత్ర పరిసమాప్తం కావడం సనాతన సాంస్కృతిక ప్రస్థాన క్రమంలో ప్రస్ఫుటించిన మరో చారిత్రక ఘటన! సనాతనమైన- శాశ్వతమైన- ఈ ధర్మాచార్యుని ఆత్మ పంచభూతాల కలయికతో ఏర్పడిన శరీరాన్ని పరిత్యజించడం అనివార్యమైన పరిణామ క్రమం! ఈ క్రమం సృష్టిగతమైన పునరావృత్తి!

02/28/2018 - 01:12

వాహన చోదకులకు మద్యం మత్తు దిగడానికి వీలుగా గతంలో తాము ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు వారు దశలవారీగా స్వయంగా వమ్ము చేయడం విచిత్రమైన న్యాయ విన్యాసం! ఇలా వమ్ము చేసే కార్యక్రమంలో చివరి ఘట్టం ఈ నెల 24వ తేదీన సంభవించింది.

02/27/2018 - 00:45

సంస్కరణల పేరుతో తన పదవిని శాశ్వతం చేసుకొనడానికి చైనా అధ్యక్షుడు ఝీ జింగ్‌పింగ్ యత్నిస్తుండడం చైనాలో కొనసాగుతున్న విపరిణామ క్రమం! చైనా రాజ్యాంగాన్ని కమ్యూనిస్టు పార్టీ నియంత్రించడం, నిర్వహించడం ‘ఏకపక్ష’ వ్యవస్థలో నిహితమై ఉన్న ‘గతి తర్కం’! అందువల్ల దేశాధ్యక్షుడు ఎన్నిసార్లైనా ఆ పదవికి ఎన్నిక కావచ్చునన్నది ఇప్పుడు ‘కమ్యూనిస్టు పార్టీ’ వారు చైనా రాజ్యాంగానికి చేసిన సవరణ!

02/24/2018 - 06:37

కెనడాతో మనదేశానికి కొనసాగుతున్న స్నేహ సంబంధాలను అపహరించడానికి ‘‘ఖలిస్తాన్’’ బీభత్స భూతం మరోసారి విఫలయత్నం చేసింది. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో మనదేశంలో వారం రోజులుగా సకుటుంబంగా జరుపుతున్న పర్యటన సందర్భంగా ఈ తథాకథిత- సోకాల్డ్- ‘‘ఖలిస్థాన్’’ తోడేలు తన తలను మరోసారి నిక్కపెట్టడానికి యత్నించింది. ‘‘ఖలిస్తాన్’’ బీభత్సకాండ పంజాబ్‌ను కల్లోల పరచడం క్రీస్తు శకం 1980వ దశకం నాటి చరిత్ర.

02/22/2018 - 07:02

చైనా ప్రభుత్వం కొనసాగిస్తున్న వ్యూహాత్మక దురాక్రమణ మరింతగా విస్తరిస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ. హిందూమహా సముద్ర జలాలలో చైనా యుద్ధ నౌకలు నెలకొనడం ఈసారి కొత్త విస్తరణ! మాల్ దీవులలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఈ ‘విస్తరణ’కు నేపథ్యం! హిందూ మహాసముద్రం మనదేశానికి దక్షిణంగా విస్తరించింది. మన దక్షిణ సరిహద్దునకు అత్యంత సమీపంలో నైరృతిగా మాల్‌దీవులు, ఆగ్నేయంగా శ్రీలంక హిందూ మహాసాగరంలో ఏర్పడి ఉన్నాయి.

Pages